India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. పరిశ్రమలకు కావాల్సిన సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. గ్రీన్ ఎనర్జీ విషయంలో మంచి విధానం అందుబాటులో ఉంది’ అని ఆయన తెలిపారు.
AP: సత్యవేడు MLA కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఆయనపై నమోదైన లైంగిక వేధింపుల <<14026695>>కేసును <<>>హైకోర్టు కొట్టేసింది. ఈ కేసును కొట్టేయాలని MLA ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదు చేసిన మహిళ కోర్టుకు హాజరై తాను చేసిన ఆరోపణలు, FIRలో అంశాలన్నీ అవాస్తవమని, కేసును కొట్టేయాలని న్యాయమూర్తికి వివరించారు. ఈ అంశాలు పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ కేసును కొట్టేసింది.
AP: విశాఖపట్నం సమీపంలోని తాటిచెట్లపాలెం వద్ద తన కారును మంత్రి లోకేశ్ కాన్వాయ్‌లోని ఓ కారు ఢీకొట్టడంతో డ్యామేజీ అయిందని కళ్యాణ్ భరద్వాజ్ అనే వ్యక్తి ట్విటర్‌లో మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన లోకేశ్ ‘జరిగినదానికి క్షమాపణ చెబుతున్నా. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని నా భద్రతా సిబ్బందిని ఆదేశిస్తా. అలాగే మీ వాహన డ్యామేజీకి అయ్యే ఖర్చును భరిస్తా’ అని రిప్లై ఇచ్చారు.
ప్రముఖ నటి ఊర్మిళ తన ఎనిమిదేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకనున్నట్లు తెలుస్తోంది. తన భర్త మోసిన్ అక్తార్ మిర్‌తో విడాకులు తీసుకోనున్నట్లు సమాచారం. నాలుగు నెలల క్రితం ముంబై కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు జాతీయ మీడియా పేర్కొంది. వీరు విడిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. కాగా జమ్మూకశ్మీర్‌కు చెందిన వ్యాపారవేత్త మోసిన్‌ను 2016 ఫిబ్రవరి 4న ఆమె పెళ్లాడారు.
గోల్డ్ రేట్లు ఇన్వెస్టర్లకు హ్యాపీనిస్తే కస్టమర్లకు షాకిస్తున్నాయి. వారంలో విపరీతంగా పెరగడమే ఇందుకు కారణం. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ.75,420గా ఉంది. ఇక ట్యాక్సులు కలుపుకుంటే రూ.76,189 వరకు ఉంది. US ఫెడ్ వడ్డీరేట్ల కోతతో డాలర్ ఇండెక్స్ తగ్గుతోంది. మరోవైపు ఇజ్రాయెల్, పాలస్తీనా, లెబనాన్, హెజ్బొల్లా యుద్ధంతో ఫిజికల్ గోల్డ్, గోల్డ్ ETFsకు డిమాండ్ పెరిగింది.
‘దేవర’ రిలీజ్ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ‘తారక్ అన్న చాలా గ్యాప్ తర్వాత మంచి మాస్ కంటెంట్‌తో వస్తున్నారు. బెన్ఫిట్ షోలతో పాటు భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం. అభిమానులు ఫ్యాన్స్ వార్స్ సృష్టించడం ఆపండి. మూవీపై నెగటివిటీని ఆపేయండి. ప్రీమియర్స్ చూసేవారు సోషల్ మీడియాలో వీడియోలు పెట్టకండి. ఎవరినీ వీడియోలు తీయనివ్వొద్దు. NTRకు బ్లాక్ బస్టర్ అందిద్దాం’ అని పేర్కొన్నారు.
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రంజీల్లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ ప్రాబబుల్స్‌లో కోహ్లీతోపాటు రిషభ్ పంత్ పేరును కూడా DDCA చేర్చింది. చండీగఢ్‌తో జరిగే మ్యాచ్‌లో విరాట్ బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పటికి బంగ్లాతో టెస్ట్ సిరీస్ కూడా పూర్తి కానుంది. కాగా కోహ్లీ చివరిసారిగా 2012-13 సీజన్‌లో రంజీల్లో ఆడారు. యూపీపై చెలరేగి ఆడి న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికయ్యారు.
పని ఒత్తిడితో <<14129191>>చనిపోయిన<<>> యువ సీఏ అన్నా సెబాస్టియన్ పనిచేసిన పుణేలోని EY కార్యాలయానికి పర్మిషనే లేదని విచారణలో తేలింది. కార్మిక శాఖ అధికారులు కంపెనీలో తనిఖీ చేయగా ఈ విషయం బయటపడింది. ఈ ఏడాది FEBలో రిజిస్ట్రేషన్ కోసం కార్మిక శాఖకు అప్లై చేశారు. 16 ఏళ్లుగా రిజిస్ట్రేషన్ చేయనందుకు శాఖ నిరాకరించింది. కార్మికుల మరణానికి సంస్థ కారణమైతే ₹5లక్షలు జరిమానా, ఓనర్‌కి 6నెలల జైలుశిక్ష ఉంటుందని అధికారులు తెలిపారు.
TG: నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం జరిగింది. హైదరాబాద్‌లోని జల్‌పల్లి నివాసంలో రూ.10 లక్షలు పోయినట్లు ఆయన గుర్తించారు. పనిమనిషి నాయక్ ఆ డబ్బును చోరీ చేసినట్లు మోహన్ బాబు రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తిరుపతిలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా గతంలోనూ ఆయన ఇంట్లో చోరీ జరిగింది. 2019లో డబ్బులు, బంగారు ఆభరణాలు పనిమనిషి దొంగిలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఉమ్రా, హజ్ వీసాలతో తమ దేశంలోకి పాకిస్థానీ బిచ్చగాళ్లు వెల్లువలా వచ్చిపడుతుండటంతో సౌదీ అరేబియా ఆందోళన వ్యక్తం చేస్తునట్లు తెలుస్తోంది.
పాక్ జాతీయులు తమ దేశంలో బిచ్చమెత్తుకుంటే రూ.2.22 లక్షల జరిమానా విధించనున్నట్లు సమాచారం. ఈ విషయంపై పాక్ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. బిచ్చగాళ్లను తమ దేశానికి పంపడం వెనుక మాఫియా ఉందని, మొత్తం యాచకుల్లో 90% వారే ఉన్నట్లు తెలిపింది.
Sorry, no posts matched your criteria.