India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: హైడ్రా తరహా వ్యవస్థను మరిన్ని నగరాల్లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరీంనగర్, WL, NZB, KMM, సిద్దిపేట, ADB, MBNR, NRML, NLG, గద్వాల, కామారెడ్డి సహా పలు నగరాలు, పట్టణాల్లో చెరువులు, శిఖం భూములు, బఫర్ జోన్లలో అడ్డగోలుగా నిర్మాణాలు జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. దీంతో చెరువులు, కుంటల రక్షణపై దృష్టి పెట్టిన ప్రభుత్వం హైడ్రా వంటి వ్యవస్థతో వాటిని సంరక్షించాలని భావిస్తోంది.
ఆగస్టు 26న శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగ పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో సెలవు ఉండనుంది. సోమవారం (రేపు) పబ్లిక్ హాలిడే ఇస్తున్నట్లు ఇప్పటికే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పేర్కొన్నాయి. అన్ని రకాల విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు పని చేయవు. ఏపీలో రేపు పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం సైతం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్లు ప్రకటించారు.
TG: 10,954 గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గతంలో VRO, VRAలుగా పనిచేసిన వారిని ఈ వ్యవస్థలో భాగం చేయాలని, ఇందుకోసం వారికి పరీక్ష పెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇంటర్/డిగ్రీ అర్హత ఉన్న వారికి ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఇచ్చి, కొత్త వ్యవస్థలో స్థానం కల్పించనుంది. ఇలా భర్తీ కాగా మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రెవెన్యూ వర్గాల సమాచారం.
AP: విద్యార్థుల డేటాను <
TG: వరంగల్ మహా నగర అభివృద్ధికి తక్షణమే మాస్టర్ ప్లాన్ రూపొందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ, మున్సిపల్ అధికారులతో ఆయన సమీక్షించారు. HYD తర్వాత పెద్ద నగరమైన వరంగల్‌లో అభివృద్ధి విస్తరణకు 2050 నాటికి పెరిగే జనాభాను దృష్టిలో పెట్టుకుని రూపొందించాలని సూచించారు. అవసరమైన భూసేకరణను కూడా చేపట్టాలన్నారు.
హైడ్రాను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనివల్ల నేరుగా హైడ్రానే FIR ఫైల్ చేసేందుకు వెసులుబాటు కలుగుతుంది. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. ఇక హైడ్రా కూల్చివేసిన భవనాలకు గతంలో పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే విషయంపై ఉన్నతాధికారులతో ప్రభుత్వం చర్చలు జరపనుంది.
TG: హైదరాబాద్ మణికొండలోని చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. జీవో 658కి విరుద్ధంగా 225 ROW హౌసులు నిర్మించారని, జీ+1కి పర్మిషన్ తీసుకుని జీ+2 కట్టారని పేర్కొన్నారు. 15 రోజుల్లోగా నోటీసులకు రిప్లై ఇవ్వాలని స్పష్టం చేశారు. గత పాలకుల నిర్ణయాలతో చిత్రపురి సొసైటీకి రూ.50 కోట్ల నష్టం జరిగిందంటూ ఫిర్యాదు అందడంతో అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఒకరోజు సెలవు కోసం 5 ఏళ్ల బాలుడిని తోటి విద్యార్థులే కొట్టి చంపారు. బ్రిజ్‌పురి మదర్సాలో ఓ విద్యార్థి చనిపోయాడని పోలీసులకు సమాచారం వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముగ్గురు చిన్నారులు(ఇద్దరికి 9, ఒకరికి 11 సంవత్సరాలు) హత్య చేసినట్లు గుర్తించారు. తమను అసభ్య పదజాలంతో దూషించేవాడని, చంపితే ఒక రోజు మదర్సాకు సెలవు ఇస్తారని హత్య చేసినట్లు ముగ్గురూ ఒప్పుకున్నారు.
HYDలో హైడ్రా దాదాపు నెలరోజుల్లోనే 100 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. కమిషనర్ రంగనాథ్ చెరువుల ఆక్రమణపై అవగాహన కోసం రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా శాటిలైట్ చిత్రాలు తెప్పించుకున్నారు. ముందుగానే సిబ్బంది మఫ్టీలో వెళ్లి భవనాలు, కట్టడాలు పరిశీలించి వస్తారు. రాత్రి యంత్రాలు, సిబ్బందిని సిద్ధం చేసి ఉదయమే కూల్చివేతలు ప్రారంభిస్తారు. ముఖ్యంగా శని, ఆదివారాలు ప్లాన్ చేసుకుంటారు.
టాలీవుడ్ ఉస్తాద్ రామ్ పోతినేని, స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. తాజాగా రామ్ నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’, హరీశ్ తెరకెక్కించిన ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్లుగా నిలిచాయి. ఈక్రమంలో వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమా రద్దయినట్లు టీటౌన్‌లో చర్చ జరుగుతోంది. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటికైనా డైరెక్టర్ కొత్త స్టోరీలపై ఫోకస్ పెట్టాలని ఆయన అభిమానులు కోరుతున్నారు.
Sorry, no posts matched your criteria.