news

News August 23, 2024

రేవంత్ రాజీవ్ విగ్రహాన్ని పెట్టడానికి కారణమదే: కేటీఆర్

image

TG: తెలంగాణకు రాజీవ్ గాంధీ చేసిందేమీ లేదని మీడియాతో చిట్‌చాట్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘రాహుల్ దగ్గర మార్కులు కొట్టేయడం కోసమే రేవంత్ ఇక్కడ రాజీవ్ విగ్రహాన్ని పెడుతున్నారు. రాజీవ్ గాంధీ ఎయిర్‌పోర్టు పేరును కచ్చితంగా మారుస్తాం. అదే కాదు, మిగిలిన పేర్లనూ పరిశీలిస్తాం. ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణనే లేకుండా చేయాలి’ అని తేల్చిచెప్పారు.

News August 23, 2024

త్రిపురలో వరద బీభత్సం.. 17 లక్షలమందిపై ప్రభావం

image

గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా త్రిపుర వరదలతో అతలాకుతలమవుతోంది. ఇప్పటికే 19మంది మృతి చెందగా సుమారు 17 లక్షలమంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. గోమతి, దక్షిణ త్రిపుర, ఉనకోటి, పశ్చిమ త్రిపుర జిల్లాల్లో నష్టం అధికంగా ఉంది. భారత వాతావరణ శాఖ తాజాగా రెడ్ అలర్ట్ జారీ చేయడంతో రాష్ట్ర ప్రజల్లో ఆందోళన నెలకొంది. జాతీయ విపత్తు స్పందన బలగాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.

News August 23, 2024

భారతీయులు వీసా లేకుండానే శ్రీలంకకు వెళ్లొచ్చు!

image

భారత పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది అక్టోబరు 1 మొదలు 6 నెలల పాటు భారత్‌ సహా 35 దేశాల పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పించింది. శ్రీలంక పర్యాటకాన్ని మరింత పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ దేశ పర్యాటక మంత్రి హరీన్ ఫెర్నాండో తెలిపారు. భారత్‌తో పాటు చైనా, జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్, ఫ్రాన్స్, కెనడా, సౌదీ, యూఏఈ, ఖతర్ తదితర దేశాలు వీసా ఫ్రీ జాబితాలో ఉన్నాయి.

News August 23, 2024

గోల్డ్ మెడల్ గెలిచిన వినేశ్ ఫొగట్ ఊరి అమ్మాయి!

image

వినేశ్ ఫొగట్ ఒలింపిక్ మెడల్ కోల్పోయారన్న బాధ నుంచి ఆమె ఊరికి చెందిన మరో అమ్మాయి నేహా సాంగ్వాన్ కొంతమేర ఉపశమనం కల్గిస్తున్నారు. హరియాణాలోని బలాలీకి చెందిన నేహ, రెజ్లింగ్ అండర్-17 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో జపాన్ క్రీడాకారిణి సో సుత్సుయ్‌పై 10-0 తేడాతో గెలుపొంది స్వర్ణ పతకం సాధించారు. కాగా.. నేహతో పాటు అదితి కుమారి, పుల్‌కిత్ కూడా మహిళల రెజ్లింగ్‌లో వేర్వేరు కేటగిరీల్లో స్వర్ణాలు సాధించడం విశేషం.

News August 23, 2024

UPI పేమెంట్ తప్పుగా చేశారా.. ఇవి గుర్తుంచుకోండి

image

ఒక్కోసారి పొరపాటున తప్పుడు నెంబర్‌కు యూపీఐ పేమెంట్ చేస్తుంటాం. అలాంటి సమయంలో ఏం చేయాలి? బ్యాంకింగ్ నిపుణులేమంటున్నారంటే.. ముందుగా లావాదేవీ వివరాలను స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఆ యూపీఐ యాప్ కస్టమర్‌ కేర్‌కు విషయాన్ని తెలియజేయాలి. ఒకవేళ పరిష్కారం లభించకపోతే NPCIకి ఫిర్యాదు చేయొచ్చు. అదే విధంగా మీ బ్యాంకులోనూ సాయం కోరవచ్చు. ఆఖరి ఆప్షన్‌గా 1800-120-1740 నెంబర్‌కు కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వొచ్చు.

News August 23, 2024

బర్త్‌డేకి సంప్రదాయ దుస్తుల్లో చిరు-చరణ్

image

నిన్న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా చిరుతో పాటు ఆయన కుమారుడు రామ్ చరణ్ సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. దీనికి సంబంధించిన ఫొటోను చెర్రీ ఇన్‌స్టాలో పంచుకోగా వైరల్ అవుతోంది. ఆ పోస్టులో తండ్రికి చరణ్ బర్త్‌డే విషెస్ తెలిపారు. నాన్న అన్న పిలుపునకు బదులు హ్యాపీ బర్త్‌డే అప్పా అంటూ తమిళ స్టైల్లో విష్ చేయడం గమనార్హం. చిరు తిరుమల నుంచి తిరిగి రాగానే ఈ ఫొటో తీసుకున్నట్లు సమాచారం.

News August 23, 2024

పోలాండ్ కబడ్డీ ఆటగాళ్లతో పీఎం భేటీ

image

పోలాండ్‌ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, అక్కడి కబడ్డీ స్టార్స్‌తో తాజాగా భేటీ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ఆయన తెలిపారు. ‘వార్సాలో పోలాండ్ కబడ్డీ ఆటగాళ్లు మికల్ స్పిజ్కో, అన్నా కల్బర్క్‌జిక్‌లను కలిశాను. ఆ ఆటను ఇక్కడి వారు చాలా ఇష్టపడుతుంటారు. పోలాండ్‌లో దాన్ని మరింతగా విస్తృతపరచడంపై, భారత్‌తో మరిన్ని టోర్నీలు ఆడటంపై వారితో చర్చించాను’ అని పీఎం వెల్లడించారు.

News August 23, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 23, 2024

ఆగస్టు 23: చరిత్రలో ఈ రోజు

image

1872: AP తొలి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు జననం
1918: భౌతిక శాస్త్రవేత్త అన్నా మణి జననం
1964: సంగీత దర్శకుడు SA రాజ్‌కుమార్ జననం
1968: దివంగత గాయకుడు కేకే జననం
1966: లూనార్ ఆర్బిటర్-1 భూమిని ఫొటో తీసింది.
1994: ఇంగ్లీషు ఛానెల్‌ను ఈదిన తొలి భారత మహిళ ఆరతి సాహా మరణం
2005: MGNREGAకు పార్లమెంట్ ఆమోదం
* జాతీయ అంతరిక్ష దినోత్సవం

News August 23, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఆగస్టు 23, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:46 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:01 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:19 గంటలకు
అసర్: సాయంత్రం 4:45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:36 గంటలకు
ఇష: రాత్రి 7.51 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.