India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: రైతు భరోసా పెట్టుబడి సాయం పంపిణీకి ఆన్‌లైన్ అప్లికేషన్లు స్వీకరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం ప్రత్యేక వెబ్‌సైట్ లేదా యాప్ తీసుకురానున్నట్లు సమాచారం. కేవలం సాగుభూములకే సాయం అందేలా ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాట్లు చేయనుంది. వీటి గుర్తింపునకు శాటిలైట్, ఫీల్డ్ సర్వే చేయనుంది. ఎన్ని ఎకరాల లోపు ఇవ్వాలనే విషయమై భట్టి అధ్యక్షతన సబ్ కమిటీ సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది.
AP: కుంభమేళాకు రైళ్లను మళ్లించడంతో పలు సర్వీసులను మార్చి 1 వరకు రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. తిరుపతి- కదరిదేవరపల్లి ప్యాసింజర్, గుంతకల్- తిరుపతి ప్యాసింజర్, తిరుపతి- హుబ్లీ మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌పెస్‌లను 2 నెలలు నిలిపేశారు. వీటితో పాటు తిరుపతి- కడప మీదుగా ధర్మవరం మార్గంలో నడిచే 6 రైళ్లను రద్దు చేశారని, రైల్వే బోర్డు ప్రత్యామ్నాయం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
TG: దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు నివాళులర్పించేందుకు రాష్ట్ర శాసనసభ ఈరోజు ప్రత్యేకంగా సమావేశమవనుంది. ఉదయం పదింటికి సభ ప్రారంభం కాగానే సీఎం రేవంత్ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో మన్మోహన్ కృషిని సభ్యులు గుర్తుచేసుకోనున్నారు. కాగా.. మన్మోహన్‌తో ఉన్న అనుబంధం దృష్ట్యా మాజీ సీఎం కేసీఆర్ సభకు వచ్చే అవకాశం ఉందా అన్నది ఆసక్తికరంగా మారింది.
TG: BJP రాష్ట్ర నూతన అధ్యక్షుడి నియామకాన్ని సంక్రాంతి తర్వాతే చేపట్టాలని ఆ పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. పదవికి పోటీలో డీకే అరుణ, ఈటల, అరవింద్, రఘునందన్, బండి సంజయ్ పేర్లు ప్రధానంగా వినిపించగా వీరిలో ఈటల, అరవింద్, రఘునందన్ పేర్లను అధిష్ఠానం షార్ట్ లిస్ట్ చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో వీరిలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
TG: రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పీజీ వైద్య సీట్ల భర్తీకి వెబ్ ఆప్షన్లు మొదలయ్యాయి. రేపటి వరకూ ఫస్ట్ స్టేజీ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. కన్వీనర్ కోటా సీట్లను ముందుగా భర్తీ చేయనున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదవకుండానే పీజీ కోసం దరఖాస్తు చేసుకున్న 34మందిని వర్సిటీ అనర్హులుగా ప్రకటించింది.
నాలుగో టెస్టులో బుమ్రా మరోసారి అద్భుత ప్రదర్శన కనబరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో 4, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశారు. 2024లో 13 మ్యాచులు ఆడిన బుమ్రా 14.92 యావరేజ్‌తో 71 వికెట్లు తీసి ఏడాదిని ఘనంగా ముగించారు. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మూడో బెస్ట్ బౌలింగ్ యావరేజ్. అలాగే బాక్సింగ్ డే టెస్టుల్లో మొత్తం 24 వికెట్లు తీశారు. అటు, భారత్ స్కోర్ 11 ఓవర్లకు 19/0 ఉండగా, టార్గెట్ 340.
TG: తెలంగాణలో మున్ముందు ఏర్పడేది తమ ప్రభుత్వమేనని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే. దేశానికి మోదీ తప్ప మరో దిక్సూచి కనిపించడం లేదు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మా పార్టీ విజయ పతాకం ఎగురవేస్తుంది. బీజేపీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ. 140కోట్లమంది జనాభా ఉన్న భారతదేశం ప్రశాంతంగా ఉందంటే దానికి మోదీ నాయకత్వమే కారణం’ అని పేర్కొన్నారు.
AP: సీఎం చంద్రబాబు రేపు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలోని యల్లమంద గ్రామంలో ఆయన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 10.50 గంటలకు ఆ గ్రామానికి చేరుకోనున్న చంద్రబాబు పింఛన్ల పంపిణీ తర్వాత ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
పీఎస్ఎల్వీ సిరీస్‌లోని పీఎస్ఎల్వీ సీ60 రాకెట్‌ను ఇస్రో నేడు ప్రయోగించనుంది. నిన్న రాత్రి 8.58 గంటలకు కౌంట్ డౌన్ మొదలైంది. 25 గంటల కౌంట్ డౌన్ అనంతరం నేటి రాత్రి 9.58 గంటలకు రాకెట్ శ్రీహరికోట నుంచి స్వదేశీ సైంటిస్టులు రూపొందించిన స్పాడెక్స్ ఉపగ్రహాలను తీసుకుని నింగిలోకి దూసుకుపోనుంది. ఈ ఏడాది భారత్‌కు ఇదే ఆఖరి ప్రయోగం.
ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి, భారత సంతతి వ్యక్తి సుచిర్ బాలాజీది ఆత్మహత్య కాదని, హత్యేనని అతడి తల్లి పూర్ణిమ ఆరోపిస్తున్నారు. తాము ప్రైవేటుగా నియమించుకున్న ఇన్వెస్టిగేటర్ ఇదే విషయాన్ని తేల్చారని ఆమె చేసిన ట్వీట్‌కు ఎలాన్ మస్క్ స్పందించారు. ఆమెకు మద్దతుగా నిలుస్తూ కచ్చితంగా సుచిర్‌ది సూసైడ్‌లా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఎఫ్‌బీఐతో దర్యాప్తు చేయించాలని ఆమె అమెరికా సర్కారును డిమాండ్ చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.