India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: పరిశ్రమలు ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు అన్నారు. ‘పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ కోసం కమిటీ ఏర్పాటు చేస్తాం. రెడ్ కేటగిరీ పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలి. పరిశ్రమల అనుబంధ శాఖలన్నీ ఉమ్మడిగా పనిచేయాలి. అన్ని శాఖలు ఒకేసారి తనిఖీలు నిర్వహించాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూస్తాం. ఎవరైనా కుట్రలు చేసినా ఎక్కువ రోజులు సాగవు’ అని అచ్యుతాపురం ఘటనపై వ్యాఖ్యానించారు.
ఆండ్రాయిడ్ యూజర్లకు వాట్సాప్ ‘వాయిస్ ట్రాన్‌స్క్రిప్షన్’ ఫీచర్ తీసుకొచ్చింది. దీని వల్ల వాయిస్ మెసేజ్‌లు టెక్స్ట్ రూపంలో కనిపిస్తాయి. ఆడియో వినలేని సందర్భంలో టెక్స్ట్ చదువుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్‌లో చాట్స్‌కు వెళ్లి ట్రాన్‌స్క్రిప్షన్ ఆఫ్/ఆన్ ఆప్షన్ ఎంచుకోవాలి. ప్రస్తుతం ఇది కొందరికే కనిపిస్తోంది. హిందీ, ఇంగ్లిష్, స్పానిష్, రష్యన్, పోర్చుగీసు భాషలకు సపోర్ట్ చేస్తోంది.
TG: MLCగా తనకు పోలీసులు కల్పించే సెక్యూరిటీని కోదండరాం నిరాకరించారు. వ్యక్తిగత భద్రత సిబ్బంది తనకు అవసరం లేదని ఆయన వెల్లడించారు. తాను ప్రజల మనిషినని, ఈ భద్రత వల్ల ప్రజలతో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని కోదండరాం అభిప్రాయపడ్డారు. కాగా ఇటీవలే MLCగా కోదండరాం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
AP: అచ్యుతాపురం సెజ్ ఘటనపై విచారణకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కమిటీ నివేదిక వచ్చాక ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఎసెన్షియా కంపెనీ రెడ్ కేటగిరిలో ఉంది. బాధితులకు కంపెనీయే పరిహారం చెల్లిస్తుంది. నిబంధనలు పాటించకపోతే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. విశాఖలో గత 5 ఏళ్లలో 119 ప్రమాదాలు జరగగా, 120 మంది చనిపోయారు’ అని వెల్లడించారు.
హీరోయిన్ ఆయేషా టకియా ఊహించని విధంగా మారిపోయారు. 13 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న ఆమె ఇటీవల బ్లూ కలర్ చీరలో పోస్ట్ చేసిన ఓ రీల్ వైరల్‌గా మారింది. అందులో ఆమె పెదాలు ఉబ్బిపోయి ఉండగా, ఆమె లుక్ ఏమీ బాగోలేదని, గుర్తుపట్టలేకపోయినట్లు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తెలుగులో సూపర్ సినిమాతో మెప్పించిన ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్‌లో దిల్ మాంగే మోర్, టార్జాన్, సలాం ఇ ఇష్క్, వాంటెడ్ వంటి చిత్రాల్లో నటించారు.
స్టాక్ మార్కెట్లు మోస్తరుగా లాభపడ్డాయి. BSE సెన్సెక్స్ 147 పాయింట్లు ఎగిసి 81053 వద్ద ముగిసింది. NSE నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి 24811 వద్ద క్లోజైంది. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 27:23గా ఉంది. గ్రాసిమ్, టాటా కన్జూమర్, ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్స్, టాటా స్టీల్ టాప్ గెయినర్స్. విప్రో, NTPC, టాటా మోటార్స్, M&M, డాక్టర్ రెడ్డీస్ టాప్ లూజర్స్. ఇండియా విక్స్ 13కి తగ్గడం స్థిరత్వాన్ని సూచిస్తోంది.
వచ్చే ఏడాది భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్న 5 మ్యాచుల టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది.
తొలి టెస్ట్: జూన్ 20-24 (హెడింగ్లీ, లీడ్స్)
రెండో టెస్ట్: జులై 2-6 (ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్)
మూడో టెస్ట్: జులై 10-14 (లార్డ్స్, లండన్)
నాలుగో టెస్ట్: జులై 23-27 (ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్)
ఐదో టెస్ట్: జులై 31- ఆగస్టు 4 (ఓవల్, లండన్)
మహారాష్ట్రలోని బద్లాపుర్‌లో ఇద్దరు బాలికలపై లైంగికదాడి <<13897763>>ఘటనను<<>> ముంబై హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. పాఠశాలలో రక్షణ లేకపోతే విద్యాహక్కు చట్టం గురించి మాట్లాడటంలో అర్థమే లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదుచేయకపోవడంపై మండిపడింది. నేరం గురించి రిపోర్టు చేయనందుకు స్కూల్ యాజమాన్యాన్నీ విచారించేందుకు పోక్సో చట్టం అనుమతిస్తుందని పేర్కొంది.
TG: కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశం మేరకు టీపీసీసీ నేతలు హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులకు వినతిపత్రం అందించారు. అదానీ అక్రమాలపై జేపీసీ విచారణ జరిపించాలని అందులో డిమాండ్ చేశారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఏఐసీసీ ఇన్‌ఛార్జీ దీపాదాస్ మున్షీ తదితరులు ఉన్నారు.
తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కొత్తగూడెం, ఖమ్మం, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.