news

News December 28, 2024

కాంగ్రెస్ ఎన్నడూ మన్మోహన్‌ సింగ్‌ను గౌరవించలేదు: BJP నేత

image

మన్మోహన్ సింగ్ మరణంపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని BJP నేత సుధాంశు త్రివేది ఆరోపించారు. బతికున్నప్పుడు వాళ్లెప్పుడూ ఆయన్ను గౌరవించలేదని విమర్శించారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు తగవు. మోదీ ప్రభుత్వం ప్రణబ్, మాలవీయ, PVని భారతరత్నతో గౌరవించింది. కాంగ్రెస్‌లో గాంధీ-నెహ్రూ కుటుంబీకులు కాకుండా పదేళ్లు ప్రధానిగా చేసింది మన్మోహన్ ఒక్కరే. పటేల్, శాస్త్రి, పీవీని వాళ్లు అవమానించారు’ అని వివరించారు.

News December 28, 2024

తెలంగాణ ప్రభుత్వంపై అంబటి సెటైర్లు

image

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలంగాణ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఆస్ట్రేలియాతో మ్యాచులో నితీశ్ పుష్ప తరహాలో సెలబ్రేషన్స్ ఉద్దేశించి ‘‘ప్రపంచాన్నే ప్రభావితం చేస్తున్న ‘పుష్ప’ హీరో AAని వేధిస్తూ తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తానంటే నమ్మేదెలా అబ్బా?’’ అని ట్వీట్ చేశారు. ఇటీవల TGలో జరిగిన పరిణామాలపైన ఆయన వ్యంగ్యంగా ఈ ట్వీట్ చేశారని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

News December 28, 2024

ఉదయపు పలకరింపై, ఊరు ప్రశ్నించే గొంతుకై

image

Way2News.. తొమ్మిదేళ్ల క్రితం వేల మంది యూజర్లతో ప్రారంభమై నేడు కోట్లాది తెలుగు వారికి చేరువైంది. ఉదయమే అందరికీ పలకరింపుగా, ప్రతి ఊరు తరఫున ప్రశ్నించే గొంతుగా మారడం ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. ప్రజలకు వేగంగా, సులువుగా సమాచారం అందించాలనే మా ఆశయానికి మీ ఆశీర్వాదం తోడవడంతోనే ఈ విజయయాత్ర సాధ్యమైంది. మనమంతా వార్తా ప్రపంచంలో కొత్త గమ్యాలు చేరేందుకు ఇలాగే సహకరిస్తారని ఆశిస్తూ.. కృతజ్ఞతలు!
-Team Way2News

News December 28, 2024

100 పాములతో ఆ సీన్ చేశా: వెంకటేశ్

image

బొబ్బిలిరాజా సినిమాలో కొండ చిలువను పట్టుకునే సీన్ హాలీవుడ్ మూవీ నుంచి రిఫరెన్స్‌గా తీసుకున్నట్లు విక్టరీ వెంకటేశ్ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బొబ్బిలి రాజాలో ఒకటి కాదు ఏకంగా వంద పాములతో కలిసి సీన్ చేసినట్లు వెల్లడించారు. అది గ్రాఫిక్స్ కాదని స్పష్టం చేశారు. మొదట ఆ సీన్ చేసేందుకు భయపడినా తర్వాత ధైర్యం తెచ్చుకొని చేసినట్లు పేర్కొన్నారు.

News December 28, 2024

జీన్స్‌తో వచ్చాడని ఫైన్.. టోర్నీ నుంచి నిష్క్రమించిన కార్ల్‌సన్

image

వరల్డ్ రాపిడ్ చెస్ ఛాంపియన్ షిప్ నుంచి మాగ్నస్ కార్ల్‌సన్(నార్వే) నిష్క్రమించారు. జీన్స్ ధరించి గేమ్‌లో పాల్గొనగా FIDE నిబంధనలను ఉల్లంఘించారని ఆయనకు 200 డాలర్ల జరిమానా విధించింది. డ్రెస్ కోడ్ నిబంధనలు పాటిస్తేనే 9వ రౌండ్‌లో పాల్గొనే అవకాశముందని తేల్చి చెప్పింది. FIDE నిర్ణయంపై అసహనంతో టోర్నీ నుంచి నిష్క్రమించినట్లు కార్ల్‌సన్ తెలిపారు. తన ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పారు.

News December 28, 2024

ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీ చేసిన పిన్న వయస్కులు (భారత ప్లేయర్లు)

image

*18 ఏళ్ల 253 రోజులు- సచిన్ (సిడ్నీ)
*18 ఏళ్ల 283 రోజులు- సచిన్ (పెర్త్)
*21 ఏళ్ల 91 రోజులు- రిషభ్ పంత్ (సిడ్నీ)
*21 ఏళ్ల 214 రోజులు- నితీశ్ రెడ్డి (మెల్‌బోర్న్)
*22 ఏళ్ల 42 రోజులు- దత్తు ఫడ్కర్ (ఆడిలైడ్)
*22 ఏళ్ల 263 రోజులు- కేఎల్ రాహుల్ (సిడ్నీ)
*22 ఏళ్ల 330 రోజులు- యశస్వీ జైస్వాల్ (పెర్త్)
*23 ఏళ్ల 80 రోజులు- విరాట్ (ఆడిలైడ్)

News December 28, 2024

RRR సినిమా కన్నా డాక్యుమెంటరీనే ఎమోషనల్: రాజమౌళి

image

తాను దర్శకత్వం వహించిన RRR సినిమా కన్నా ఇటీవల వచ్చిన డాక్యుమెంటరీనే ఎమోషనల్‌గా ఉందని రాజమౌళి ట్వీట్ చేశారు. 20TB డేటా నుంచి సరైన మెటెరియల్‌ను తీసిన వాల్ అండ్ ట్రెండ్స్‌ టీమ్ వర్క్‌ను ప్రశంసించారు. ఎడిటర్ శిరీష, వంశీ పనితీరును మెచ్చుకున్నారు. ఈ టీమ్ వర్క్ పట్ల గర్వంగా ఉందని, ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. RRR సినిమా షూటింగ్ సీన్స్‌తో రూపొందించిన బిహైండ్ అండ్ బియాండ్ ఓటీటీలోకి వచ్చేసింది.

News December 28, 2024

BSNL: 19000 ఉద్యోగులే టార్గెట్‌గా VRS

image

BSNL సంస్కరణలు రెండో దశకు చేరుకున్నాయి. 19000 (35%) ఉద్యోగులే లక్ష్యంగా రెండోసారి VRS అమలుకు టెలికం శాఖ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆర్థికశాఖ అనుమతి కోరినట్టు సమాచారం. ఇందుకు రూ.15000 కోట్లు అవసరమవుతాయి. BSNL ఆదాయంలో 38% అంటే రూ.7500 కోట్లు జీతాలకే వెళ్లిపోతోంది. దీనిని రూ.5000 కోట్లకు తగ్గించాలన్నది ప్లాన్. ప్రస్తుతం కంపెనీకి 55వేల ఉద్యోగులున్నారు. తొలి విడత VRSకు మంచి స్పందనే లభించడం గమనార్హం.

News December 28, 2024

నితీశ్‌పై ఎమ్మెస్కే విమర్శలు.. రిప్లై అదుర్స్ కదా

image

ఆస్ట్రేలియా సిరీస్‌లో నితీశ్ కుమార్ రెడ్డిపై మాజీ సెలక్టర్ ఎమ్మెస్కే విమర్శలకు నెటిజన్లు కౌంటర్ ఇస్తున్నారు. బాక్సింగ్ డే టెస్టులో గిల్‌ను పక్కన పెట్టి పూర్తి బౌలర్/బ్యాటర్ కానీ NKRపై నమ్మకం ఉంచడం ఏంటని MSK విమర్శించారు. అయితే ఇవాళ నితీశ్ ప్రదర్శనతో MSKకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు అంటున్నారు. సీనియర్లు విఫలమైన చోట NKR పరువు నిలబెట్టారని, ఎవరినీ తక్కువ చేయొద్దని హితవు పలుకుతున్నారు.

News December 28, 2024

నవంబర్‌లో శ్రీవారి హుండీకి రూ.111.3 కోట్లు

image

AP: నవంబర్ నెలలో తిరుమల శ్రీవారిని 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో హుండీ కానుకలు రూ.111.3 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. 7.31 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు చెప్పారు. నెల రోజుల్లో 97.01 లక్షల లడ్డూలు విక్రయించగా 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు పేర్కొన్నారు.