news

News December 28, 2024

మన్మోహన్‌కు స్మారకమా? మరి నా తండ్రికెందుకు అడగలేదు: ప్రణబ్ కుమార్తె

image

మన్మోహన్ సింగ్ ప్రత్యేక స్మారకం కోసం PM మోదీని ఖర్గే కోరడాన్ని ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ విమర్శించారు. పార్టీకి సేవలందించి, రాష్ట్రపతిగా పనిచేసిన తన తండ్రి చనిపోతే వాళ్లు స్మారకమే అడగలేదన్నారు. కనీసం CWC మీటింగ్ పెట్టి సంతాపం ప్రకటించలేదని ఆరోపించారు. ఇవన్నీ ప్రధానులకే అని ఒకరు చెప్పగా KR నారాయణన్‌కు CWC సంతాపం ప్రకటించడాన్ని తన తండ్రి డైరీస్ ద్వారా తెలుసుకున్నానని గట్టిగా కౌంటర్ ఇచ్చారు.

News December 28, 2024

సంక్రాంతికి ఇంటికెళ్లేవారికి GOOD NEWS

image

సంక్రాంతికి HYD నుంచి APకి వెళ్లే వారి కోసం 2,400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు APSRTC ప్రకటించింది. JAN 9 నుంచి 13 మధ్య ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని, అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని పేర్కొంది. MGBSలో రద్దీని తగ్గించేందుకు JAN 10-12 మధ్య కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే బస్సులను CBS గౌలిగూడ నుంచి నడిపిస్తామంది.

News December 28, 2024

పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి!

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి కలకలం రేపాడు. పోలీసు అధికారిలా యూనిఫాంతో హడావుడి చేయగా అనుమానం వచ్చిన కొందరు అతనిపై ఫిర్యాదు చేశారు. అతడిని విజయనగరం జిల్లాకు చెందిన సూర్యప్రకాశ్‌గా గుర్తించారు. పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ ఐపీఎస్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

News December 28, 2024

డాలర్‌ వెపన్‌ను బిట్‌కాయిన్‌తో నిర్వీర్యం చేసిన పుతిన్

image

వెస్ట్రన్ కంట్రీస్ ఆంక్షలు, డాలర్‌ ఆయుధీకరణను అడ్డుకొనేందుకు రష్యా దీటైన పథకమే వేసింది. ఒకప్పుడు వ్యతిరేకించిన డిజిటల్ కరెన్సీనే అనుకూలంగా మలుచుకుంది. ఇతర దేశాలు, గ్లోబల్ కంపెనీలకు బిట్‌కాయిన్ల ద్వారా చెల్లింపులు చేపట్టింది. వీటి మైనింగ్, పేమెంట్లకు మద్దతుగా పుతిన్ చట్టాలు తీసుకొచ్చారు. డీసెంట్రలైజ్డ్ కరెన్సీ కావడమే BTC ప్లస్‌పాయింట్. యుద్ధం చేస్తున్నా రష్యా మెరుగైన GDP సాధించడానికి ఇదే కారణం.

News December 28, 2024

ఓటీటీలోకి కొత్త చిత్రం

image

కేన్స్ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై ‘గ్రాండ్ పిక్స్’ అవార్డును పొందిన ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ మూవీ OTTలోకి రానుంది. పాయల్ కపాడియా తెరకెక్కించిన ఈ ఫీచర్ ఫిల్మ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌లో JAN 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ముంబై నర్సింగ్ హోమ్‌లో పనిచేసే ఇద్దరు నర్సుల కథే ఈ చిత్రం. కశ్రుతి, దివ్య ప్రధాన పాత్రల్లో నటించారు. US మాజీ అధ్యక్షుడు ఒబామా మెచ్చిన ఈ మూవీ గోల్డెన్‌ గ్లోబ్ నామినేషన్స్‌నూ పొందింది.

News December 28, 2024

DAY 3: నిలిచిన ఆట.. నితీశ్-సుందర్ సెంచరీ భాగస్వామ్యం

image

బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. ఆట నిలిచే సమయానికి భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. నితీశ్(85*), సుందర్(40*) క్రీజులో ఉన్నారు. ఇవాళ తొలి సెషన్‌లో టీమ్ ఇండియా రెండు వికెట్లు కోల్పోగా, రెండో సెషన్‌లో నితీశ్-సుందర్ 105 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మ్యాచ్ నిలిచిపోవడంతో అంపైర్లు టీ బ్రేక్ ప్రకటించారు.

News December 28, 2024

మొబైల్ రీఛార్జ్ ధరలు పెంపు?

image

టెలికం కంపెనీలు టారిఫ్ రేట్లను పెంచే అవకాశం ఉందని ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ వెల్లడించింది. వచ్చే ఏడాది DECలో 15% టారిఫ్ పెంచవచ్చని తెలిపింది. ARPU లెవెల్స్ పెంచుకునేందుకు టెలికం కంపెనీలు ఇక నుంచి తరచూ ఈ పద్ధతి కొనసాగించొచ్చని పేర్కొంది. కాగా గత ఐదేళ్లలో మూడు సార్లు (2019, 21, 24)టారిఫ్ పెంచారు. 2019 SEPలో రూ.98 ఉన్న రీఛార్జ్ ప్లాన్ 2024 SEPకు రూ.193కి ఎగబాకింది.

News December 28, 2024

RECORD:10 నిమిషాలకో ₹50L కారు అమ్మకం

image

సంపద, సంపన్నులు పెరగడంతో లగ్జరీ కార్ల అమ్మకాల్లో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2024లో ప్రతి 10 నిమిషాలకో ₹50L పైబడిన కారును అమ్మింది. తొలిసారి ఒక ఏడాదిలో 50వేల లగ్జరీ కార్ల ఘనతను అందుకుంది. 2025లో 54వేలకు చేరుతుందని ఇండస్ట్రీ వర్గాల అంచనా. 2024లో మెర్సిడెస్ బెంజ్ 20వేలు, BMW 12వేల కార్లను అమ్మినట్టు సమాచారం. ఇవి సగటున 15% గ్రోత్ నమోదు చేశాయి. వివిధ కారణాలతో AUDI కార్ల సేల్స్ 16% తగ్గాయి.

News December 28, 2024

BREAKING: కేటీఆర్‌కు ఈడీ నోటీసులు

image

TG: ఫార్ములా- ఈ రేసింగ్ కేసులో కేటీఆర్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి 7న కేటీఆర్ విచారణకు హాజరుకావాలని కోరింది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి 2, 3 తేదీల్లో విచారణకు రావాలని పేర్కొంది. ఫార్ములా-ఈ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని కేటీఆర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

News December 28, 2024

రూ.6,000 కోట్ల పోంజీ స్కామ్.. నిందితుడు అరెస్ట్

image

రూ.6వేల కోట్ల పోంజీ స్కామ్ ప్రధాన నిందితుడు భూపేంద్రసింగ్‌ను సీఐడీ అరెస్టు చేసింది. గుజరాత్‌ మెహసానా జిల్లాలోని ఓ గ్రామంలో దాక్కున్న అతడిని ఎట్టకేలకు అదుపులోకి తీసుకుంది. బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో అయిన ఇతను బ్యాంకుల కన్నా అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి వేలాది మందిని మోసం చేశారు. కొన్ని నెలలుగా అతను సీఐడీకి దొరక్కుండా తిరుగుతున్నారు.