news

News December 28, 2024

నేటి నుంచి 4 రోజులు TGB సేవలు బంద్

image

TG: ఏపీజీవీబీ బ్రాంచ్‌లు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనమవుతున్న నేపథ్యంలో నేటి నుంచి ఈ నెల 31 వరకు TGB సేవలు నిలిచిపోనున్నట్లు ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. జనవరి 1 నుంచి సేవలు పునరుద్ధరిస్తామని చెప్పారు. బ్రాంచ్‌ల విలీనం జరిగినా ఖాతా నంబర్లు మారవని స్పష్టం చేశారు. కస్టమర్ల అత్యవసరాల నిమిత్తం ఈ నెల 30, 31 తేదీల్లో రూ.10వేల వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు.

News December 28, 2024

నేడు కడపకు పవన్.. ఎంపీడీవోకు పరామర్శ

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ నేతల దాడిలో గాయపడి కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న అన్నమయ్య(D) గాలివీడు MPDO జవహర్ బాబును పరామర్శిస్తారు. అనంతరం గాలివీడులోని ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శిస్తారు. దాడి జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకుంటారు. కాగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.

News December 28, 2024

మన్మోహన్ స్మారకార్థం స్థలం కేటాయించిన కేంద్రం

image

మన్మోహన్ సింగ్ <<14998092>>అంత్యక్రియలపై వివాదం<<>> రాజుకున్న వేళ కేంద్రం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అభ్యర్థన మేరకు మన్మోహన్ స్మారకార్థం ఢిల్లీలో స్థలం కేటాయింపునకు కేంద్ర హోంశాఖ అంగీకరించింది. ఈ విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు తెలిపినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. క్యాబినెట్ మీటింగ్ పూర్తయిన వెంటనే అమిత్ షా దీనిపై నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నాయి.

News December 28, 2024

రేపు కొమురవెల్లి మల్లన్న కళ్యాణం

image

TG: సిద్దిపేట(D) కొమురవెల్లిలోని ప్రఖ్యాత మల్లికార్జున స్వామి కళ్యాణ వేడుక రేపు ఉ.10.45 గంటలకు వైభవంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దేవదాయ శాఖ పూర్తి చేసింది. ఈ కళ్యాణంతో బ్రహ్మోత్సవాలకు కూడా అంకురార్పణ జరగనుంది. రేపటి నుంచి మార్చి 24 వరకు నిర్వహించే జాతరకు AP, TGలతోపాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక నుంచి వేలాది మంది భక్తులు వస్తారు.

News December 28, 2024

ఘోరం: కుటుంబమంతా ఆత్మహత్య

image

AP: వైఎస్సార్(D) సింహాద్రిపురం(M) దిద్దేకుంటలో విషాదకర ఘటన జరిగింది. అప్పుల బాధతో ఓ అన్నదాత కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. రైతు నాగేంద్ర(40) చీనీ తోట సాగు చేస్తున్నారు. ఆదాయం లేకపోవడం, రుణదాతల ఒత్తిడి పెరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో భార్య వాణి(38), పిల్లలు గాయత్రి(12), భార్గవ్(11)ను తోటకు తీసుకెళ్లి ఉరివేశాడు. అనంతరం తానూ సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News December 28, 2024

2024లో స్టార్లకు ‘సినిమా’ కష్టాలు

image

ఈ ఏడాది మూవీల హిట్లు, ఫట్లు పక్కనపెడితే పలువురు టాలీవుడ్ స్టార్లను ‘సినిమా’ కష్టాలు వెంటాడాయి. ప్రేమ పేరుతో మోసం చేశాడని హీరో రాజ్ తరుణ్‌పై యువతి ఫిర్యాదు, లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్టు కలకలం రేపాయి. HYDలో Nకన్వెన్షన్ కూల్చివేత, నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యలు, మంచు ఫ్యామిలీలో వివాదం, RGVకి నోటీసులు, బన్నీ అరెస్టు చర్చనీయాంశమయ్యాయి.

News December 28, 2024

విద్యుత్ ఛార్జీల పెంపుపై సీపీఎం పోరుబాట

image

AP: కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడంపై రాష్ట్రవ్యాప్తంగా నిన్న YCP ఆందోళనలు చేపట్టగా సీపీఎం కూడా పోరు బాటపట్టేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల 7, 10 తేదీల్లో విజయవాడ, కర్నూలులో ధర్నాలు, భోగి మంటల్లో ఛార్జీల పెంపు జీవోలను దహనం చేస్తామని ప్రకటించింది. మరోవైపు ఫిబ్రవరి 1-4 తేదీల్లో నెల్లూరు జిల్లాలో సీపీఎం రాష్ట్ర మహాసభలను నిర్వహిస్తామని నేతలు తెలిపారు.

News December 28, 2024

నేడు స్కూళ్లకు సెలవు ఉందా?

image

మాజీ PM మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా కేంద్రం ఇవాళ హాఫ్ డే సెలవు ఇచ్చింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తిస్తుందని తెలిపింది. విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ హాలిడే వర్తించదు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు ఇవాళ యధావిధిగా పనిచేయనున్నాయి. కాగా, నిన్న తెలంగాణలో ఉద్యోగులు, విద్యార్థులకు సెలవు ప్రకటించారు.

News December 28, 2024

వాచ్‌మెన్‌కు జాక్‌పాట్.. లాటరీలో రూ.2.32కోట్లు

image

దుబాయ్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న HYDకు చెందిన రాజమల్లయ్య(60)కు జాక్‌పాట్ తగిలింది. ఇటీవల ప్రకటించిన బిగ్ టికెట్ మిలియనీర్ ఎలక్ట్రానిక్ లక్కీ డ్రాలో ఆయన మిలియన్ దిర్హామ్స్(రూ.2.32 కోట్లు) గెలుచుకున్నారు. దీంతో మల్లయ్య సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. తాను 30ఏళ్లుగా లాటరీ టికెట్ కొంటున్నానని, ఇప్పుడు అదృష్టం వరించిందని తెలిపారు. ఈ మొత్తాన్ని కుటుంబం, స్నేహితులతో పంచుకుంటానని తెలిపారు.

News December 28, 2024

దటీజ్ మన్మోహన్: ఆపరేషన్ తర్వాత తొలి ప్రశ్న.. ‘నా దేశం ఎలా ఉంది?’

image

మన్మోహన్ సింగ్‌ ప్రధానిగా ఉండగా 2009లో హార్ట్ సర్జరీ జరిగింది. 11 గంటల శస్త్రచికిత్స తర్వాత బ్రీతింగ్ పైప్ తీసేయగానే ఆయన తన ఆరోగ్యం గురించి కాకుండా దేశం ఎలా ఉంది? కశ్మీర్ ఎలా ఉంది? అని అడిగారు. తన ధ్యాసంతా సర్జరీపై కాకుండా దేశంపైనే ఉందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ఆయనకు సర్జరీ చేసిన డాక్టర్ రమాకాంత్ పాండా ఓ సందర్భంలో వెల్లడించారు. మన్మోహన్ మానసికంగా చాలా బలంగా ఉండేవారని తెలిపారు.