India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సుప్రీంకోర్టు తీర్పును మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తప్పుగా అర్థం చేసుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించి, EVMలలో పోలైన ఓట్లతో సరిపోల్చాలని సుప్రీంకోర్టు చెప్పలేదన్నారు. తాను పోటీ చేసిన ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని 12 ఈవీఎంలు, వీవీప్యాట్లను పరిశీలించి స్లిప్పులను లెక్కించాలని బాలినేని హైకోర్టును ఆశ్రయించారు.
శక్తికాంత దాస్‌కు <<13905624>>ఏ+ ర్యాంకు<<>> రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొవిడ్ సంక్షోభ సమయంలో ఎకానమీని పటిష్ఠంగా ఉంచేందుకు ఆయన చర్యలు తీసుకున్నారు. ధరల నియంత్రణ, ఆర్థిక వృద్ధిరేటు పెంపు, స్థిరమైన రూపాయి విలువ, విదేశీ మారక నిల్వల పెంపు, వడ్డీరేట్ల నిర్వహణ, బ్యాంకు బ్యాలెన్స్ షీట్ల పటిష్ఠం, NPAల తగ్గుదల, వ్యవస్థలో లిక్విడిటీ తగ్గింపులో సక్సెస్ అయ్యారు. ప్రతి నిర్ణయాన్ని ఆచితూచి తీసుకోవడం ఆయన ప్రత్యేకత.
AP: తెలంగాణ విద్యార్థుల ప్రవేశాలకు మాత్రమే అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇవ్వడంపై ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచారం వ్యక్తం చేసింది. ఈ యూనివర్సిటీలో AP వారికి అవకాశం లేకపోవడం బాధాకరమంది. 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై స్పందించి, ఈ విద్యా సంవత్సరం ఉమ్మడిగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. APలో ఈ యూనివర్సిటీ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని CM చంద్రబాబును కోరింది.
దేశంలోని రేషన్ షాపుల్లో భారీ మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. డీలర్ల ఆదాయం పెంచడం, ప్రజలకు పోషక పదార్థాలు అందించడమే లక్ష్యంగా వీటిని జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చే పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. UP, గుజరాత్, రాజస్థాన్, తెలంగాణలోని 60 రేషన్ షాపులను ఇందుకోసం ఎంపిక చేసింది. ఈ షాపుల్లో తృణధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, రోజువారీ నిత్యావసర సరుకులు వంటి 3,500 ఉత్పత్తులు విక్రయించనున్నారు.
బాలీవుడ్ సినిమాలు భారత్‌ను చెడుగా చూపిస్తుంటాయని కన్నడ నటుడు రిషబ్ శెట్టి వ్యాఖ్యానించారు. ‘బాలీవుడ్ సినిమాలకు ప్రపంచ సినీ వేదికలపైకి ఆహ్వానం దక్కుతుంటుంది. మన దేశం, మన రాష్ట్రం, మన భాష మనకు గర్వకారణం. దాన్ని వారెందుకు గొప్పగా చూపించరు?’ అని ప్రశ్నించారు. ఆయన విమర్శల పట్ల బాలీవుడ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘కాంతార’లో ఆయన పాత్ర హీరోయిన్‌తో ప్రవర్తించే తీరును గుర్తుచేస్తూ పోస్టులు పెడుతున్నారు.
ఓవర్ టైం సదుపాయం వినియోగంలో ఉద్యోగులు, సిబ్బంది అవకతవకలను అరికట్టడంపై రైల్వే బోర్డు ఫోకస్ పెట్టింది. అన్ని రైల్వే స్టేషన్లలో సిబ్బంది కోసం బయోమెట్రిక్ హాజరు యంత్రాలు లేదా ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని 17 రైల్వే జోన్ల GMలను ఆదేశించింది. రైల్వే విజిలెన్స్ డైరెక్టరేట్ చేసిన సిఫార్సుల మేరకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.
TG: జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. గతంలో ప్రకటించిన గడువు ఇటీవల ముగియడంతో తాజాగా మరోసారి పెంచారు. 2024-25 విద్యాసంవత్సరానికి ఇక గడువు పెంపు ఉండదని ఇంటర్ బోర్డు సంచాలకురాలు శృతి ఓజా స్పష్టం చేశారు.
స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. క్రితం సెషన్లో 80802 వద్ద ముగిసిన BSE సెన్సెక్స్ నేడు 80667 వద్ద మొదలైంది. 112 పాయింట్ల నష్టంతో 80697 వద్ద చలిస్తోంది. 24680 వద్ద ఓపెనైన NSE నిఫ్టీ 13 పాయింట్లు తగ్గి 24685 వద్ద కొనసాగుతోంది. బ్యాంకు నిఫ్టీ 346 పాయింట్లు పతనమై 50456 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 29:20గా ఉంది. దివిస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడు సంజయ్ రాయ్, దారుణానికి ఒడిగట్టే ముందు వ్యభిచార గృహాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. కోల్‌కతా పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 8న రాత్రి మద్యం సేవించిన రాయ్, RG కర్‌కు చెందిన మరో వాలంటీర్‌తో కలిసి రెడ్ లైట్ ఏరియాకు వెళ్లాడు. తెల్లవారుజామున ఆస్పత్రికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో సెమినార్ హాల్‌లో గాఢనిద్రలో ఉన్న బాధితురాలిని చూసి అత్యాచారానికి ఒడిగట్టాడు.
RBI గవర్నర్ శక్తికాంత దాస్‌కు గ్లోబల్ ఫైనాన్స్ సెంట్రల్ బ్యాంకర్ రిపోర్ట్ కార్డ్స్-2024 మరోసారి ‘A+’ రేటింగ్ ఇచ్చింది. గత ఏడాది కూడా ఆయనకు ఇదే గ్రేడ్ దక్కింది. ఈ సందర్భంగా దాస్‌ను PM మోదీ, వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా అభినందించారు. దాదాపు 100 దేశాల సెంట్రల్ బ్యాంకుల గవర్నర్లకు మాంద్యం నియంత్రణ, ఆర్థిక వృద్ధి వంటి వాటి ఆధారంగా గ్లోబల్ ఫైనాన్స్ సంస్థ 1994 నుంచి గ్రేడ్స్ ఇస్తోంది.
Sorry, no posts matched your criteria.