news

News August 20, 2024

డాక్టర్లు డ్యూటీలో చేరాలని కోరిన CJI

image

దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న డాక్టర్లు తిరిగి విధుల్లో చేరాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ సూచించారు. వారి సమస్యల పరిష్కారానికి తాము ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. వైద్యుల భద్రతపై 10 మంది సీనియర్ డాక్టర్లతో నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, RJ కర్ ఆస్పత్రి ఘటనతో దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు.

News August 20, 2024

ఆయన సరసన నటించడం నా అదృష్టం: ప్రియాంక

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘ఓజీ’ సినిమాలో నటించడం తన అదృష్టమని హీరోయిన్ ప్రియాంక మోహన్ అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ‘సరిపోదా శనివారం’ మూవీ ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. పవన్, నాని ఎప్పుడూ క్రియేటివ్‌గా ఆలోచిస్తారని చెప్పారు. పవన్ ప్రజల గురించి ఆలోచిస్తే, నాని సినిమాల గురించి కలలు కంటారని తెలిపారు. కాగా సరిపోదా శనివారం మూవీ ఈ నెల 29న థియేటర్లలో విడుదల కానుంది.

News August 20, 2024

దాడికి ఎలా అనుమతించారు: సుప్రీంకోర్టు

image

ఆర్జీ క‌ర్ మెడిక‌ల్ కాలేజీలో ఘోర‌మైన నేరం జ‌రిగిన త‌రువాత ఆస్ప‌త్రికి 24 గంట‌లూ భ‌ద్ర‌త క‌ల్పించాల్సింది పోయి, ఒక గుంపు వ‌చ్చి దాడి చేయ‌డానికి ఎలా అనుమతించారని బెంగాల్ ప్రభుత్వాన్ని SC ప్రశ్నించింది. రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులదేనని చెప్పింది. దాడి చేసిన వారందరినీ తప్పనిసరిగా విచారించాలని ఆదేశించింది. ఆగస్టు 22లోపు నివేదిక సమర్పించాలని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ CBIని ఆదేశించారు.

News August 20, 2024

బ్యాంకుల్లో 5,351 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

image

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5,351 ఉద్యోగాల భర్తీకి IBPS దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. వీటిలో 4,455 PO/మేనేజ్‌మెంట్ ట్రైనీస్ పోస్టులు, 896 స్పెషలిస్టు ఆఫీసర్ జాబ్స్ ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ, ఎంబీఏ పూర్తయిన వారు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం <>https://www.ibps.in/<<>> వెబ్‌సైట్‌లో చూడగలరు.

News August 20, 2024

3 వారాల్లో మ‌ధ్యంత‌ర నివేదిక ఇవ్వండి: SC

image

దేశ‌వ్యాప్తంగా ఆస్ప‌త్రులు, వైద్య సంస్థ‌ల్లో వైద్యులు, సిబ్బంది ర‌క్ష‌ణ‌కు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై మూడువారాల్లో మ‌ధ్యంతర నివేదిక ఇవ్వాల‌ని నేష‌న‌ల్ టాస్క్‌ఫోర్స్‌ను సుప్రీంకోర్టు కోరింది. పూర్తిస్థాయి నివేదిక‌ను 3 నెల‌ల్లో అంద‌జేయాలంది. క్యాబినెట్ సెక్ర‌ట‌రీ, కేంద్ర హోం, ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శులు టాస్క్‌ఫోర్స్‌కు అవ‌స‌ర‌మైన స‌హ‌కారాన్ని అందించాల‌ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

News August 20, 2024

‘అలయ్‌ బలయ్‌’కి రావాలని సీఎంకు ఆహ్వానం

image

TG: బండారు దత్తాత్రేయ అనగానే గుర్తొచ్చేది ‘అలయ్ బలయ్’. ఏటా దసరా మరుసటి రోజున రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హరియాణా గవర్నర్‌గా ఉన్నప్పటికీ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అక్టోబర్ 13న జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఆహ్వానించారు. ఈ విషయాన్ని సీఎం ట్వీట్ చేశారు. తెలంగాణ సమాజంలో ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీక ఈ కార్యక్రమమని పేర్కొన్నారు.

News August 20, 2024

బాక్సాఫీస్ వద్ద ‘స్త్రీ-2’ జోరు.. 5 రోజుల్లోనే రూ.242 కోట్లు

image

హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ ‘స్త్రీ-2’ బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రూ.50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 5 రోజుల్లోనే రూ.242 కోట్లు సాధించింది. ఈ వారంలో రూ.500 కోట్ల మార్క్ చేరుకునే అవకాశం ఉందని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించారు.

News August 20, 2024

మెడికల్ కాలేజీల్లో భద్రతపై CJI ఆందోళన

image

మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల్లో సౌకర్యాలపై సీజేఐ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు.
*36 గంటలు డ్యూటీ చేసినా రెస్ట్ రూమ్స్ లేవు. కనీస శుభ్రత పాటించట్లేదు.
*లాంగ్ షిప్ట్స్ చేసి ఇంటికి వెళ్లేందుకు సరైన రవాణా సదుపాయాలు అందుబాటులో లేవు.
*సీసీటీవీ కెమెరాలు సరిగ్గా పని చేయట్లేదు అని తెలిపారు. వీటిపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అందులో తెలుగు డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డికి చోటు దక్కింది.

News August 20, 2024

ట్రైనీ డాక్టర్ తల్లితో చెప్పిన మాటలివే..

image

కోల్‌కతాలో హత్యాచారానికి గురైన ట్రైనీ డాక్టర్ తల్లి తన కూతురిని తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ‘నా కూతురికి భక్తి ఎక్కువ. దుర్గ పూజను చాలా శ్రద్ధగా చేసేది. రెండేళ్లుగా చాలా వైభవంగా చేసుకున్నాం. మూడోసారి కూడా అదే విధంగా చేయాలని చెప్పింది. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. తాను బతికి ఉండి ఉంటే దుర్గ పూజ సమయానికి పీజీ పూర్తై ఉండేది’ అని కన్నీరు పెట్టుకున్నారు.

News August 20, 2024

బెంగాల్ ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం

image

కోల్‌క‌తాలో ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచారం కేసులో FIR న‌మోదుకు ఎందుకు ఆల‌స్య‌మైంద‌ని బెంగాల్ ప్ర‌భుత్వాన్ని సుప్రీంకోర్టు నిల‌దీసింది. దారుణ‌మైన అఘాయిత్యం జ‌రిగినా స‌హ‌జ‌ మ‌ర‌ణంగా ఎందుకు పేర్కొన్నారని ప్ర‌శ్నించింది. ఇది హ‌త్య‌గా సాయంత్రం వ‌ర‌కు ఎందుకు గుర్తించ‌లేక‌పోయార‌ని నిల‌దీసింది. విచార‌ణ జ‌ర‌ప‌కుండానే కాలేజీ ప్రిన్సిప‌ల్‌ను మరో కాలేజీకి ప్రిన్సిప‌ల్‌గా ఎలా నియ‌మించారంటూ ప్ర‌శ్నించింది.