news

News August 20, 2024

తెరపైకి యువరాజ్ సింగ్ బయోపిక్

image

భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ తెరకెక్కనుంది. ఆయన క్రీడా ప్రయాణాన్ని మూవీగా తీసుకురానున్నట్లు Tసిరీస్ అధికార ప్రకటన వెల్లడించింది. ఈ సినిమాలో యువరాజ్ సింగ్ అద్వితీయ క్రికెట్ ప్రయాణం, ఆయన పాత్ర వంటి అంశాల నేపథ్యంలోనే సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. 2007 టీ20WC, 2011 వరల్డ్ కప్ గెలవడంలో యువీ కీలక పాత్ర పోషించారు. క్యాన్సర్‌తో పోరాడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు.

News August 20, 2024

కుండపోత వర్షాలు.. ఉద్యోగులకు సెలవులు రద్దు

image

TG: హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తుండటంతో GHMC జలమండలి ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జీఎం, డీజీఎం, మేనేజర్లతో ఎండీ అశోక్‌రెడ్డి అత్యవసర జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఉద్యోగులు, సిబ్బందికి అన్ని రకాల సెలవులూ రద్దు చేశారు. కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాలకు ట్యాంకర్లతో సురక్షిత జలాలను సరఫరా చేయాలని ఆదేశించారు. మ్యాన్‌హోళ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవొద్దని ప్రజలకు సూచించారు.

News August 20, 2024

GOOD NEWS: అక్టోబ‌ర్‌ నుంచి BSNL 4G!

image

దేశంలో BSNL 4G స‌ర్వీసులు అక్టోబ‌ర్ నుంచి ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. ట్ర‌య‌ల్ ఫ‌లితాలు సంతృప్తిక‌రంగా ఉండటంతో క‌స్ట‌మ‌ర్లు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న 4G స‌ర్వీసుల‌ను ఆక్టోబ‌ర్ నుంచి ప్రారంభిస్తామ‌ని సంస్థ అధికారి ఒక‌రు తెలిపారు. ప్రారంభానికి ముందు మరిన్ని ట్రయల్స్ చేస్తామన్నారు. ఇప్పటికే దేశంలో 25 వేల ట‌వ‌ర్ల‌ను ప్రారంభించిన BSNL త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు 4G సిమ్ కార్డులను జారీ చేస్తోంది.

News August 20, 2024

‘మాకు టాయిలెట్ల బాధ్యతలా?’.. సచివాలయ ఉద్యోగుల ఆగ్రహం

image

AP: ప్రభుత్వ పాఠశాలల్లోని టాయిలెట్ల ఫొటోల <<13896129>>అప్‌లోడ్<<>> బాధ్యతలను తమకు అప్పగించడంపై గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మండిపడుతున్నారు. విద్యాశాఖతో సంబంధం లేని తమకు ఆ డ్యూటీలు అప్పగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పున:సమీక్షించుకోవాలని మంత్రి నారా లోకేశ్‌ను ఎంప్లాయిస్ అసోసియేషన్ కోరింది. ప్రభుత్వం స్పందించకపోతే బాత్‌రూమ్ కడుగుతూ నిరసన తెలియజేస్తామని తెలిపారు.

News August 20, 2024

‘దేవర’ ‘ఆయుధ సాంగ్’ బిట్ లీక్?

image

Mr.ఎన్టీఆర్-జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న దేవర సినిమా నుంచి ఇప్పటికే పలు డైలాగ్స్ లీకైన విషయం తెలిసిందే. తాజాగా ఆయుధ పూజ సాంగ్ నుంచి 25 సెకన్ల మ్యూజిక్ బిట్ <>లీకైందంటూ<<>> పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీనిపై మూవీ టీమ్ ఇంకా స్పందించలేదు. ఈ BGM అదిరిపోయిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా చిత్రం నుంచి విడుదలైన ఫియర్, చుట్టమల్లే పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయి.

News August 20, 2024

7 గంటలు నడిస్తే గంటకు రూ.4వేలు: టెస్లా

image

గంటల తరబడి నడిచేందుకు ఆసక్తిగా ఉన్నవారికి వాహన తయారీ సంస్థ టెస్లా వినూత్న ఆఫర్ ప్రకటించింది. తమ వద్ద 7 గంటల పాటు నడిస్తే గంటకు రూ.4వేలు(రోజుకు రూ.28వేలు) ఇస్తామని వెల్లడించింది. అచ్చం మనిషిని పోలి ఉండే హ్యూమనాయిడ్ రోబోట్‌ను సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఈక్రమంలో మోషన్-క్యాప్చా సాంకేతికత సాయంతో దానికి శిక్షణ ఇచ్చేందుకు వారిని వినియోగించుకోవాలని టెస్లా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News August 20, 2024

image

https://sticky.way2news.co/sticky_jsps/Quiz.jsp?id=338&langid=1&token={TOKEN}

News August 20, 2024

గుండెపోటుతో నాలుగో తరగతి బాలుడు మృతి

image

TG: వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు కలవరపెడుతున్నాయి. తాజాగా వరంగల్ జిల్లా తిమ్మరాయినిపహాడ్‌‌కి చెందిన నాలుగో తరగతి విద్యార్థి అక్షిత్(10) గుండె పోటుతో మరణించాడు. ఛాతీలో నొప్పి ఉందని అతను చెప్పడంతో పేరెంట్స్ వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే శ్వాస లేకపోవడంతో సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. హార్ట్ అటాక్‌తో బాలుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

News August 20, 2024

మేనల్లుడిపై ప్రేమ.. 1,008 రకాల వస్తువులతో భారీ సారె

image

తమిళనాడులోని తాడికొంబులో శబరిపాండి-షర్మిల దంపతుల కుమారుడు సంతోష్‌కు వారి సంప్రదాయం ప్రకారం చెవులు కుట్టే వేడుక జరిగింది. ఇందుకోసం అతని మేనమామలు మేళతాళాలు, ట్రాక్టర్లతో భారీ సారె తీసుకొచ్చారు. బియ్యం మూటలు, పండ్లు, దుస్తులు, చాక్లెట్లు, స్వీట్లు, క్రీడా సామగ్రి సహా ఏకంగా 1,008 రకాల వస్తువులు అందులో ఉన్నాయి. మేనత్తలు కూడా అదేస్థాయిలో ఊరేగింపుగా సారెను తీసుకొచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.

News August 20, 2024

లాభాల‌తో ఆరంభం.. అయినా జాగ్రత్తపడుతున్నారు!

image

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. నిఫ్టీ 24,600 ఎగువన, సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో 80,700 వ‌ద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఐటీ, మెటల్స్, హెల్త్‌కేర్ వంటి కీలక రంగాలు లాభాలను నమోదు చేశాయి. అయితే, ఆటో, బ్యాంకింగ్ రంగాలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సెంటిమెంట్ మిశ్రమంగా ఉండ‌డంతో ఇన్వెస్ట‌ర్లు జాగ్ర‌త్త‌ప‌డుతున్న‌ట్టు మొద‌టి 15 నిమిషాల డౌన్ ట్రెండ్ స్ప‌ష్టం చేస్తోంది.