India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రికవరీ చేయడానికి కష్టతరమైన బకాయిల మొత్తం గత ఏడాదితో పోలిస్తే 4% పెరిగి ₹76,293 కోట్లకు చేరుకున్నట్టు సెబీ తెలిపింది. 807 కేసుల్లో 95% (విలువ ఆధారంగా) కోర్టులలో లేదా కోర్టు నియమించిన కమిటీల ముందు పెండింగ్‌లో ఉన్నందున వీటిని రికవరీకి కష్టమైన బకాయిలుగా వర్గీకరించినట్టు తెలిపింది. సెబీ చట్టాలను ఉల్లంఘించిన సంస్థలు, వ్యక్తులు, మధ్యవర్తులపై నియంత్రణ సంస్థ జరిమానాలు విధిస్తుంటుంది.
AP: ఫుడ్‌పాయిజన్‌తో విశాఖ KGHలో చికిత్స పొందుతున్న చిన్నారులను హోంమంత్రి అనిత పరామర్శించారు. బయటి నుంచి తెచ్చిన ఆహారం తినడం వల్లే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న హాస్టళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటివాటిని గుర్తించి, వెంటనే మూసేయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆరా తీశారని వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్‌లో, 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటిస్తుండడం గమనార్హం. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపనకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన జరుగుతుందని MEA కార్యదర్శి (వెస్ట్) తన్మయ లాల్ తెలిపారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటిస్తారని తెలిపారు.
AP: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు TTD వెల్లడించింది. 4న ధ్వజారోహణం, పెద్దశేష వాహనం, 5న చిన్నశేష వాహనం, హంస వాహనం, 6న సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, 7న కల్పవృక్ష వాహనం, భూపాల వాహనం, 8న మోహినీ అవతారం, గరుడ వాహనం, 9న స్వర్ణ రథం, గజ వాహనం, 10న సూర్యప్రభ వాహనం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం, ధ్వజావరోహణం ఉంటుందని తెలిపింది.
నిన్న మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో సిమెంట్‌తో తయారు చేసిన <<13885622>>ఫేక్ వెల్లుల్లిని<<>> అమ్మడం చర్చనీయాంశంగా మారింది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నకిలీ వెల్లుల్లిని మార్కెట్లోనే గుర్తించవచ్చు. అసలైన వెల్లుల్లితో పోల్చితే నకిలీ వెల్లుల్లి వాసనలో కొంత తేడా ఉంటుంది. దాని స్మెల్ ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తుంది. నిజమైన వెల్లుల్లి దట్టంగా, దృఢంగా ఉంటుంది. నీటిలో ఉంచితే మునిగిపోతుంది. > SHARE
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం ఘటన జరిగాక ఆస్పత్రికి వచ్చిన బాధితురాలి తల్లిదండ్రులను 3 గంటలపాటు నిరీక్షింపజేయడం, పోస్టుమార్టం తరువాత హడావుడిగా దహనం చేయడం అనుమానాలకు తావిచ్చింది. ఈ ఘటనలో అనేక మంది ప్రమేయం ఉందని, అందుకే బెంగాల్ ప్రభుత్వం ఏదో దాస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై సొంత పార్టీ నేతలు, ప్రజల నిరసనలతో TMC ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనలో బెంగాల్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. CMగా ఉండి మమతా ధర్నాకు దిగడంపై విమర్శలు, ఘటన జరిగాక సరిగా స్పందించలేదన్న ఆరోపణలు ఆమెను చుట్టుముట్టాయి. బాధితురాలు ఆత్మహత్య చేసుకుందంటూ జరిగిన ప్రచారం, అనంతరం హత్యాచారం జరిగినట్టు తేలడం ప్రజల ఆందోళనలకు కారణమైంది. నిరసన తెలిపినవారిని అడ్డగించడం ఆగ్రహం తెప్పించింది.
త్వరలోనే విశాఖ రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇప్పటివరకున్న అడ్డంకులు తొలగాయని, AP ప్రజల ఆశలు నెరవేరబోతున్నట్లు చెప్పారు. రాష్ట్రం నుంచి పూర్తి సహకారం ఉందని, అతిత్వరలోనే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి అవసరమైన సన్నాహాలకు సిద్ధమవుతామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సానుకూలంగా చర్చలు జరిగాయని, భూ కేటాయింపు, ఇతర అంశాలపై క్లారిటీ వచ్చిందన్నారు.
ఎన్నో ఏళ్ల తరువాత రిలయన్స్ పవర్ స్టాక్‌కు కొనుగోళ్ల మద్దతు లభించింది. కంపెనీకి చెందిన నాగ్‌పూర్‌లోని 600 మెగావాట్ల బుటిబోరి థర్మల్ పవర్ ప్రాజెక్టును అదానీ పవర్ కొనుగోలు చేయనుందన్నవార్తల నేపథ్యంలో BSEలో స్టాక్ ప్రైస్ వరుసగా రెండో సారి అప్పర్ సర్క్యూట్ తాకింది. 5 శాతం ధర ఎగబాకడంతో షేరు ధర రూ.32.81 స్థాయికి చేరుకుంది.
Sorry, no posts matched your criteria.