India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెళ్లి ప్రతిపాదన తీసుకురావడంతో శ్రీదేవి తనతో ఆరు నెలల పాటు మాట్లాడలేదని నిర్మాత బోనీ కపూర్ చెప్పారు. ఇద్దరు పిల్లల తండ్రిగా ఉండి, అలా ఎలా మాట్లాడుతున్నారని ఆ సమయంలో ప్రశ్నించినట్లు గుర్తు చేశారు. ముందుగా తానే శ్రీదేవికి ప్రపోజ్ చేసినట్లు వెల్లడించారు. తన చివరి రోజు వరకు ఆమెను ప్రేమిస్తూ ఉంటానని పేర్కొన్నారు. 2018లో శ్రీదేవి దుబాయ్‌లో మరణించిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి జాన్వీ, ఖుషీ కపూర్ సంతానం.
సినీ పరిశ్రమ తరలింపు ప్రచారం నేపథ్యంలో ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వాల మద్దతుతోనే చిత్ర పరిశ్రమ ఎదిగిందని, HYDలో తెలుగు సినీ పరిశ్రమ స్థిరపడటానికి అప్పటి సీఎం చెన్నారెడ్డి ప్రోత్సాహం ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సున్నిత విషయాలపై ‘మా’ సభ్యులు స్పందించవద్దని కోరారు. ఇటీవల జరిగిన ఘటనలపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.
భారత్‌లో జెండర్ బడ్జెటింగ్ పాలసీ అమలుకు 20 ఏళ్లు పూర్తయ్యాయి. 2014లో కేటాయింపులను 4.5 నుంచి 6.8 శాతానికి పెంచిన మోదీ ప్రభుత్వం FY25లో ఏకంగా 18.9%కి చేర్చిందని RBI నివేదిక పేర్కొంది. దీని విలువ రూ.3.27L కోట్లని వెల్లడించింది. కేంద్ర బడ్జెట్‌ను 3 పార్టులుగా విభజిస్తారు. పార్ట్ Aలో పూర్తిగా PMAY, LPG కనెక్షన్ వంటి మహిళల స్కీములే ఉంటాయి. పార్ట్ B, Cలో కనీసం 30% నిధులు వారి సంక్షేమం కోసం మళ్లిస్తారు.
ప్రపంచమంతా క్రిస్మస్ వేడుకలు జరుగుతుంటే ఉక్రెయిన్‌లో మాత్రం రక్తం పారుతోంది. డ్రోన్ దాడులకు రష్యా ప్రతీకారం తీర్చుకుంటోంది. ప్రధాన నగరాలే లక్ష్యంగా బాలిస్టిక్, క్రూయిజ్ మిసైళ్లను ప్రయోగిస్తోంది. విద్యుత్, ఇంధన కేంద్రాలను ధ్వంసం చేస్తోంది. ఈ దాడుల్లో కొందరు మరణించినట్టు సమాచారం. బుధవారం ఉదయం నుంచే నల్లసముద్రం మీదుగా శత్రువు మిసైళ్లను ప్రయోగించినట్టు ఉక్రెయిన్ ఎనర్జీ మినిస్టర్ ధ్రువీకరించారు.
TG: మెదక్ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత మెదక్ చర్చిలో జరిగే కార్యక్రమానికి సీఎం వెళ్లనున్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం వెంట పలువురు మంత్రులు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు.
APలో స్కూళ్లకు సంక్రాంతి సెలవుల్లో మార్పులు ఉండనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ 2024-25 ప్రకారం పండుగ హాలిడేస్ JAN 10-19 తేదీల్లో ఉంటాయని విద్యాశాఖ గతంలో పేర్కొంది. కానీ ఇటీవల భారీ వర్షాలతో చాలా జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవులు ఇచ్చారు. దీంతో పనిదినాలు తగ్గొద్దంటే ఈ సెలవులు తగ్గించాలి. ఈసారి 11-15 లేదా 12-16 తేదీల్లో పొంగల్ హాలిడేస్ ఉండొచ్చని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
మతంతో సంబంధం లేకుండా ప్రజలందరికీ రక్షణ కల్పించాలని బంగ్లాదేశ్‌కు అమెరికా సూచించింది. ఈ మేరకు మహ్మద్ యూనస్‌తో US NSA జేక్ సలివాన్ ఫోన్లో మాట్లాడారు. ‘మానవ హక్కుల పరిరక్షణ, గౌరవానికి అంకితమయ్యేందుకు ఇద్దరు నేతలు ఆసక్తి ప్రదర్శించారు. సంక్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని నడిపిస్తున్నందుకు యూనస్‌ను జేక్ అభినందించారు. నిలకడ, సౌభాగ్య, ప్రజాస్వామ్య బంగ్లాదేశ్‌కు మద్దతిస్తామన్నారు’ అని వైట్‌హౌస్ తెలిపింది.
అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో కురుస్తున్న వర్షాలతో వరి, పత్తి, మిర్చి పంటలకు భారీ నష్టం వాటిల్లుతోంది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో 2 రోజులుగా కురుస్తున్న జల్లులతో కోతకొచ్చిన పంటతో పాటు ధాన్యం నీటి పాలైనట్లు రైతులు వాపోయారు. అటు TGలోని భూపాలపల్లి జిల్లాలోని మహాముత్తారం మండలం, ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల, ఏన్కూరు మండలాల్లో ధాన్యం నీటి పాలైందని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరుతున్నారు.
లేడీ సూపర్‌స్టార్ నయనతార క్రిస్మస్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో పారిస్ వెళ్లిన హీరోయిన్ భర్త, పిల్లలతో ఈఫిల్ టవర్ ముందు ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను అక్కడ జరుపుకుంటున్న ఆమె ఫ్యామిలీతో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో హ్యాపీ క్రిస్మస్ అంటూ ఫ్యాన్స్ విషెస్ తెలుపుతున్నారు. నయనతార, విఘ్నేష్ శివన్‌లకు సరోగసి ద్వారా కవల పిల్లలు జన్మించిన విషయం తెలిసిందే.
కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సుకుమార్, దిల్ రాజుతో కలిసి ఇవాళ మరోసారి పరామర్శిస్తారని తెలుస్తోంది. మ.2 గంటలకు వెళ్లనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీతేజ్ కుటుంబానికి సాయంపై బాలుడి తండ్రి భాస్కర్‌తో చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే రేవతి భర్తకు దిల్ రాజు ఉద్యోగ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.