India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై తాను షేర్ చేసిన వీడియోలో బాధితురాలి పేరును ప్రస్తావించినందుకు TMC ఎంపీ, నటి రచనా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. భావోద్వేగంతో మాట్లాడుతుండగా ఆమె పేరు అనుకోకుండా చెప్పినట్లు పేర్కొన్నారు. సోషల్ మీడియా నుంచి వీడియోను డిలీట్ చేసినట్లు తెలిపారు. అంతకుముందు వీడియో వైరలవ్వడంతో ఎంపీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాది సచిన్ ఆమెపై హైకోర్టులో ఫిర్యాదు చేశారు.
AP: గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని CM చంద్రబాబును APCC చీఫ్ షర్మిల కోరారు. ‘గ్రూప్-2, DEO పోస్టులకు 1:100 విధానాన్ని అనుసరించారు. గ్రూప్-1 మెయిన్స్‌కూ దానినే పరిగణనలోకి తీసుకోవాలి. గ్రూప్-2, గ్రూప్-1 పరీక్షల మధ్య టైమ్ తక్కువగా ఉంది. కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్‌తోనే ప్రిలిమ్స్ నిర్వహించారు. దీని వల్ల తాము నష్టపోయామని అభ్యర్థులు చెబుతున్నారు’ అని లేఖ రాశారు.
‘దేవర’ మూవీపై అభిమానుల్లో రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన ‘చుట్టమల్లే’ లిరికల్ వీడియో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయుధ పూజ సాంగ్‌ను కూడా రిలీజ్ చేయాలని అభిమానులు ‘దేవర’ బృందాన్ని కోరారు. మూవీ టీమ్ బదులిస్తూ ’ఆ సాంగ్ వదిలితే ఇప్పుడే పోతారు. లాస్ట్‌లో రిలీజ్ చేస్తాం‘ అని పేర్కొంది. దీంతో హైప్ ఎక్కించి చంపేస్తారా అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
సెప్టెంబర్‌లో జరగనున్న యాపిల్ నెక్ట్స్ ఈవెంట్ ద్వారా ఐఫోన్- 16 మార్కెట్‌లోకి విడుదల కానుంది. ఈ కొత్త సిరీస్‌లో 4 ఫోన్లతోపాటు Apple వాచ్ సిరీస్ 10, AirPods 4, మరిన్ని ప్రొడక్ట్స్ విడుదల కానున్నాయి. కొత్త సిరీస్‌లో టైటానియం కలరింగ్, ఫినిషింగ్ మరింత మెరుగ్గా ఉండి, స్క్రాచ్ రెసిస్టెన్స్‌గా ఉంటుందని సమాచారం. ఐఫోన్ 16, ప్లస్ మోడల్స్ ఏ18 బయోనిక్ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో రానున్నాయి.
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల రెసిడెంట్ డాక్టర్‌పై హత్యాచార ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. మంగళవారం ఈ కేసుపై సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరపనుంది. ఆగస్ట్ 9న జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహాజ్వాలలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం రంగంలోకి దిగింది.
రాఖీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా మార్కెట్లు రద్దీగా ఉన్నాయని, రూ.12 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అంచనా వేస్తోంది. ప్రజలు స్వదేశీ వస్తువులతో ఈ పర్వదినాన్ని జరుపుకోవాలని ట్రేడ్ బాడీ కోరింది. దేశీయంగా తయారైన రాఖీలు మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. గత ఏడాది రూ.10 వేలకోట్ల వ్యాపారం జరిగింది.
TG: రైతులను కాంగ్రెస్ రుణమాఫీ పేరుతో మోసం చేసిందని ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీకి మాజీ మంత్రి KTR లేఖ రాశారు. రుణమాఫీ మోసంతో లక్షలాది మంది రైతులు ఆవేదనలో ఉన్నారని పేర్కొన్నారు. కనీసం 40శాతం మందికి రుణమాఫీ చేయకుండానే 100% పూర్తయిందని ప్రకటించడం దౌర్భాగ్యమన్నారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని అన్నదాతల పక్షాన ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే రైతుల తరఫున పోరాడుతామని హెచ్చరించారు.
కోల్‌కతాలోని ఆర్జే కర్ ఆస్పత్రి కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేస్తుందన్న కారణంతో ట్రైనీ డాక్టర్‌పై అఘాయిత్యం జరిగి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉదంతంలో ఆమెను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసినట్టున్నారని సహచరులు చెబుతున్నారు. ఇప్పటిదాకా ఈ కేసులో అరెస్టైన పోలీస్ వాలంటీర్ కేవలం బలిపశువు కావచ్చని, దీని వెనుక పెద్ద వాళ్లు ఉండవచ్చని తెలిపారు.
TG: సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు షేర్ చేసేవారు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ఇలా వివరాల్ని బయటపెట్టడం సైబర్ నేరగాళ్లకు అవకాశం ఇచ్చినట్లవుతుందని తెలిపారు. ఏదైనా ట్రిప్‌కు వెళ్తే ఆ వివరాల్ని షేర్ చేయొద్దని చెబుతున్నారు. ఒకవేళ షేర్ చేస్తే నేరగాళ్లు రహస్యంగా కదలికల్ని గమనిస్తూ వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసే ఛాన్సుందని, ఆ తర్వాత వేధింపులకు గురిచేసే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.
ఝార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన మాజీ CM చంపై సోరెన్ ఝార్ఖండ్ టైగర్‌గా పాపులర్ అయ్యారు. ఆయనకు JMM చీఫ్ శిబు సోరెన్ కుటుంబానికి ఎలాంటి బంధుత్వం లేదు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన చంపై పార్టీలో శిబు సోరెన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఎదిగారు. హేమంత్ సోరెన్ రాజీనామా అనంతరం అనూహ్యంగా CM పదవి దక్కించుకున్నారు.
Sorry, no posts matched your criteria.