news

News December 24, 2024

తిరుమల శ్రీవారి దర్శనానికి 16 గంటల టైమ్

image

AP: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 28 కంపార్ట్‌మెంట్లలో వేంకటేశ్వరస్వామి దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న మలయప్పస్వామిని 65,656 మంది దర్శించుకోగా, 24,360 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చినట్లు దేవస్థానం వెల్లడించింది. అటు, రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

News December 24, 2024

మోహన్‌బాబుపై చర్యలకు సిద్ధమవుతున్న పోలీసులు!

image

TG: జర్నలిస్టుపై దాడి కేసులో నటుడు మోహన్‌బాబుకు గతంలో హైకోర్టు ఇచ్చిన ఉపశమనం గడువు నేటితో ముగియనుంది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను నిన్న ధర్మాసనం కొట్టేసింది. దీంతో తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇవాళ ఆయనకు నోటీసులు జారీ చేసి విచారణకు పిలుస్తారని సమాచారం.

News December 24, 2024

ఫార్ములా ఈ-రేసు కేసు.. 2 రోజుల్లో నిందితులకు నోటీసులు!

image

TG: ఫార్ములా ఈ-రేసు కేసుపై ఈడీ అధికారులు కూడా విచారణ ప్రారంభించారు. రెండు రోజుల్లో నిందితులకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. రేసుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను పరిశీలించిన అధికారులు, నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. HMDAకు చెందిన మరిన్ని పత్రాలను కూడా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కేటీఆర్ ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే.

News December 24, 2024

నేడు పోలీసుల విచారణకు అల్లు అర్జున్!

image

TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇవాళ ఉ.11 గంటలకు విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇదే విషయంపై బన్నీ నిన్న తన లీగల్ టీమ్‌తో సమావేశమయ్యారు. ఇవాళ విచారణలో ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి? అనేదానిపై చర్చించినట్లు తెలుస్తోంది. వివాదానికి తావులేకుండా ఐకాన్ స్టార్ తన లాయర్‌తో కలిసి చిక్కడపల్లి పీఎస్‌లో విచారణకు హాజరవుతారని సమాచారం.

News December 24, 2024

BITCOIN: $91000 వద్ద కీలక సపోర్ట్

image

క్రిప్టో మార్కెట్లో స్తబ్ధత నెలకొంది. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జీవితకాల గరిష్ఠం నుంచి 13% పతనమైన బిట్‌కాయిన్ ప్రస్తుతం $94,200 స్థాయిలో చలిస్తోంది. గత 24 గంటల్లో 0.37% మేర తగ్గింది. $91000 వద్ద సపోర్టు లభించే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. రెండో అతిపెద్ద కాయిన్ ఎథీరియమ్ 3.66% లాభపడి $3387 వద్ద కొనసాగుతోంది. XRP, BNB, SOL, DOGE, ADA, TRX, AVAX, LINK, TON, SHIB 4-6% మేర ఎగిశాయి.

News December 24, 2024

ఇందిరమ్మ ఇళ్లు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు

image

TG: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను గృహనిర్మాణ సంస్థ ఎండీ గౌతమ్ ఆదేశించారు. దరఖాస్తుదారులు పేర్కొన్న స్థలం సరైనదా కాదా అనే విషయాన్ని పరిశీలకులే నిర్ధారించాలని, ఆ తర్వాతే యాప్‌లో వివరాల్ని నమోదు చేయాలని స్పష్టం చేశారు. యాప్‌లో నమోదు చేసిన వివరాలపై 360 డిగ్రీల సాఫ్ట్‌వేర్‌తో మరోసారి పరిశీలన ఉంటుందన్నారు.

News December 24, 2024

STOCK MARKETS: నేడెలా ఓపెనవుతాయో..

image

బెంచ్‌మార్క్ సూచీలు లాభాల్లో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నిన్న US సూచీలు భారీగా లాభపడ్డాయి. నేడు ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుతున్నాయి. నిక్కీ, కోస్పీ మినహా అన్నీ పెరిగాయి. డాలర్ మరింత బలపడింది. గిఫ్ట్‌నిఫ్టీ 27pts మేర ఎగిసింది. నిఫ్టీ సపోర్ట్ 23,672, రెసిస్టెన్సీ 23,843 వద్ద ఉన్నాయి. క్రూడాయిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. Stock 2 Watch: కోరమాండల్, ZEN TECH, HDFC BANK, HPCL, MCX

News December 24, 2024

నేటి నుంచి స్కూళ్లకు సెలవులు

image

ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు ఇచ్చారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. అటు TGలో రేపు, ఎల్లుండి పబ్లిక్ హాలిడేలు ఉండటంతో వరుసగా 3 రోజులు సెలవులు వచ్చినట్లయింది. ఏపీలో రేపు పబ్లిక్ హాలిడే ఉండగా 26న ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం ప్రకటించింది.

News December 24, 2024

భూ రికార్డుల్లో తప్పులు చేస్తే క్రిమినల్ కేసులు!

image

TG: ప్రభుత్వం ధరణి స్థానంలో ‘భూ భారతి’ చట్టాన్ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ, మండలిలో ఆమోదం పొందిన ఈ చట్టం బిల్లుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వం కఠిన నిబంధనలను పెట్టినట్లు తెలుస్తోంది. భూ రికార్డుల్లో తప్పులు చేస్తే అధికారులపై క్రిమినల్ కేసులతో పాటు ఉద్యోగం నుంచి తొలగించనున్నట్లు సమాచారం. ఏ స్థాయి అధికారి అయినా చర్యలు తప్పవని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.

News December 24, 2024

అకౌంట్లలోకి రూ.12,000.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏటా ₹12K అందించే పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పథకాన్ని ఉపయోగించుకున్న వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయనుంది. ఈమేరకు ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. అయితే ఇప్పటికీ మార్గదర్శకాలు వెల్లడించకపోవడంపై పేదలు ఆందోళన చెందుతున్నారు. తొలి విడతలో ఈ నెల 28న ఖాతాల్లో ₹6K చొప్పున జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.