India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రిటైర్మెంట్‌పై భారత రెజ్లర్ వినేశ్ ఫొగట్ వెనక్కి తగ్గారు. విభిన్న పరిస్థితుల నడుమ తాను 2032 వరకు ఆడాలనుకున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే తన భవిష్యత్తు ఏంటో తనకు తెలియదన్నారు. సరైందని భావించే దాని కోసం కచ్చితంగా పోరాడుతానని పేర్కొన్నారు. కష్ట సమయాల్లో వ్యక్తిగత, శిక్షణ సిబ్బంది అండగా నిలిచారన్నారు. ఒలింపిక్స్‌లో భారత జెండాను రెపరెపలాడించాలనేది తన కోరిక అని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై గతంలో తాను చేసిన విజ్ఞప్తిపై కేంద్ర హోం శాఖ తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే ఇప్పటిదాకా తీసుకున్న చర్యలను వివరించేలా హోం శాఖకు ఆర్డర్స్ ఇవ్వాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ వచ్చే వారం విచారణకు రానుంది.
TG: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు గచ్చిబౌలిలోని DLF ఫుడ్‌స్ట్రీట్‌లో నైట్ ఫుడ్ ఎంజాయ్ చేస్తారు. ఈ వార్త చూస్తే మళ్లీ అటువైపు చూసే ధైర్యం కూడా చేయరు. అక్కడి హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. పాడైపోయిన చికెన్, కూరగాయలు, బొద్దింకలు, మురుగు నీరు, సింథటిక్ ఫుడ్ కలర్స్, ఎక్స్‌పైరీ అయిన నూడుల్ ప్యాకెట్లు గుర్తించారు. ప్రజారోగ్యం, శుభ్రత పాటించని ఇలాంటి హోటళ్లు ఎన్నో.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను ఎదుర్కునేందుకు జేమ్స్ కుక్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన విజయవంతమైంది. పరిశోధకుల బృందం మైక్రోప్లాస్టిక్‌లను ఉపయోగించి స్టీల్ కంటే 200 రెట్లు స్ట్రాంగ్‌గా, డైమండ్ కంటే హార్డ్‌గా ఉండే పదార్థాన్ని తయారుచేస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లను మైక్రోప్లాస్టిక్‌గా మార్చి, తర్వాత అత్యంత విలువైన పదార్థంగా మలుస్తున్నారు.
TG: కాంగ్రెస్, బీజేపీ నేతలు బీఆర్ఎస్ విలీనం కానుందంటూ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. BJPలో బీఆర్ఎస్ కలుస్తుందంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించగా, కాంగ్రెస్‌లోనే విలీనం కానుందని బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు తాము ఎవరితో కలవబోమని పార్టీలో సంస్థాగత మార్పులు చేస్తామని BRS పేర్కొంది. దీంతో ఎవరి మాటలను నమ్మాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్‌లో LKG పిల్లల స్కూల్ ఫీజులపై బెంగళూరుకు చెందిన ఇన్వెస్టర్ అవిరాల్ భట్నాగర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. LKG ఫీజు సంవత్సరానికి రూ.3.70 లక్షలుగా ఉందని, ఏడాది క్రితం రూ.2.30 లక్షలుగా ఉండేదని తెలిపారు. అయితే ఆయన స్కూల్ పేరును మెన్షన్ చేయలేదు. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందన్నారు. సగటు మధ్యతరగతి కుటుంబం ఆహారం, విద్య, ఆరోగ్యంపైనే 70% ఖర్చు చేస్తోందని మరో వ్యక్తి కామెంట్ చేశారు.
ఏపీలో 10 మంది IPSలను ప్రభుత్వం బదిలీ చేసింది.
*అనంతపురం ఎస్పీగా పి.జగదీశ్
*గ్రేహౌండ్స్ కమాండర్‌గా గరుడ్ సుమిత్ సునీల్
*చింతూరు ఏఎస్పీగా పంకజ్ కుమార్ మీనా
*గుంతకల్లు SRPగా రాహుల్ మీనా (రైల్వే పోలీసు)
*విజయవాడ డీసీపీగా కేఎం మహేశ్వర్ రాజు
*ఇంటెలిజెన్స్ ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్
*పార్వతీపురం SPDOగా అంకిత మహవీర్
TG: మహిళలపై చేసిన <<13867346>>వ్యాఖ్యలకు<<>> బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎక్స్‌లో క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదని మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ మహిళా సమాజానికి ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బ్రేక్ డాన్సులకు అలవాటుపడిన వారే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని దుయ్యబట్టారు.
రవితేజ హీరోగా తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా నిడివిని కాస్త తగ్గించినట్లు దర్శకుడు హరీశ్ శంకర్ తెలిపారు. మూవీలో వచ్చే హిందీ సాంగ్స్‌తో పాటు దాదాపు 13 నిమిషాలు ట్రిమ్ చేసినట్లు పేర్కొన్నారు. పలువురి సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. అప్డేడేట్ ప్రింట్లు ఇవాళ రాత్రి నుంచి రన్ అవుతాయన్నారు. కాగా ఇవాళ రాత్రి ఆయన HYDలోని బాలానగర్ విమల్ థియేటర్లో అభిమానులతో కలిసి సినిమా చూస్తానన్నారు.
AP: వెయిటింగ్‌లో ఉన్న ఐపీఎస్ అధికారులు వరుసగా సెలవులకు దరఖాస్తు చేసుకున్నారు. రోజూ ఉ.10 నుంచి సా.6 వరకు హెడ్ క్వార్టర్స్‌లో ఉండాలని, అటెండెన్స్ రిజిస్టర్‌లో వచ్చి వెళ్లేటప్పుడు సంతకాలు చేయాలని <<13850500>>16 మంది ఐపీఎస్‌లకు<<>> డీజీపీ మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు మూకుమ్మడిగా సెలవు పెట్టారు.
Sorry, no posts matched your criteria.