India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రానున్న రెండు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తరు వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. గంటకు 40కి.మీ మేర ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.
AP: సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. అలాగే పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు కూడా సీఎంతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో చేపట్టనున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులతో సీఎం చర్చించారు.
నిరుడు ఆగస్టు నుంచి కార్ల విక్రయాలపై మొదలైన రెట్టింపు రాయితీలు పండుగల సీజన్ పూర్తయ్యే వరకు కొనసాగొచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. FY25ని 3 లక్షల యూనిట్లతో కంపెనీలు మొదలుపెట్టాయి. అమ్మకాలు తగ్గడంతో మరో లక్ష వీటికి జత కలిశాయి. భారత్ స్టేజ్ 6 ఎమిషన్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇన్వెంటరీని తగ్గించుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు ఆఫర్లు ఇవ్వనున్నాయి.
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 22న శంకర్‌దాదా MBBS మూవీ మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. జయంత్ సి.పరాన్జీ డైరెక్షన్ వహించిన ఈ చిత్రం 2004లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. మెగాస్టార్ కామెడీ టైమింగ్, ఏటీఎం పాత్రలో శ్రీకాంత్ నటన సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. సోనాలీ బింద్రే హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్‌లో తెరకెక్కిన మున్నాభాయ్ MBBSకు రీమేక్‌గా ఈ మూవీ రూపొందింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మెరుగైన అమెరికా అమ్మకాలు, సీపీఐ డేటా, త్వరలోనే వడ్డీరేట్ల కోత, రిసెషన్ భయాలు తగ్గిపోవడమే ఇందుకు కారణాలు. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 505 పాయింట్ల లాభంతో 79609, ఎన్ఎస్ఈ నిఫ్టీ 150 పాయింట్లు ఎగిసి 24295 వద్ద ట్రేడవుతున్నాయి. LTIM, విప్రో, అపోలో హాస్పిటల్స్, M&M, టీసీఎస్ టాప్ గెయినర్స్. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఎక్కువ నష్టపోయాయి.
TG: ఎట్టకేలకు TJS అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ శాసనమండలిలో అడుగుపెట్టారు. గవర్నర్ కోటాలో ఆయనతో పాటు అలీఖాన్ MLCలుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్న కోదండరామ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్‌తో విభేదించారు. తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించి, అప్పటి ప్రభుత్వంపై పోరాడారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో కోదండరామ్‌కు MLC పదవి ఇచ్చి గౌరవించింది.
పాకిస్థాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ తల్లి రిజియా పర్వీన్ మరోసారి నీరజ్ చోప్రాపై తన అభిమానం చాటుకున్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో ‘నీరజ్‌ను మీ ఇంటికి పిలుస్తారా?’ అని జర్నలిస్టు అడగ్గా ‘అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. తప్పకుండా ఆహ్వానిస్తా’ అని ఆమె చెప్పుకొచ్చారు. పారిస్ ఒలింపిక్స్‌లో నదీమ్ గోల్డ్ గెలిచాక పర్వీన్ స్పందిస్తూ ‘సిల్వర్ గెలిచిన నీరజ్ కూడా నా కొడుకులాంటి వాడే’ అని పేర్కొనడం తెలిసిందే.
స్థిరమైన, సురక్షితమైన పెట్టుబడి అంటే గుర్తొచ్చేది బంగారం. బలహీనమైన డాలర్, ఎకానమీ, ఆర్థిక, యుద్ధ సంక్షోభ సమయాల్లో ఇంతకు మించిన ఆర్థిక సాధనం మరొకటి లేదని నానుడి. పుత్తడిపై ఎంత పెట్టుబడి పెట్టాలని చాలామందికి సందేహం. మీ పోర్టుఫోలియోలో 10-15% వరకు పెడితే సమతూకం వస్తుందని ఆర్థిక నిపుణులు, ఫండ్ మేనేజర్లు చెబుతున్నారు. ఫిజికల్ గోల్డ్, గోల్డ్ ETF, గోల్డ్ MF, SGBల్లో అనువైనది ఎంచుకోవచ్చని సూచిస్తున్నారు.
TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా TJS అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్, అలీఖాన్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలో వారితో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే వీరిని నామినేట్ చేయగా దీనిపై BRS హైకోర్టుకు వెళ్లింది. నియామక గెజిట్‌ను HC కొట్టివేయడంతో ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది. ప్రభుత్వానికి అనుకూలంగా SC నిన్న తీర్పిచ్చింది.
TG: వికారాబాద్(D) నవల్గాకు చెందిన నరేశ్(17), ఓ బాలిక(16) ప్రేమించుకుని మే 2న ఇంట్లో నుంచి పారిపోయారు. దీంతో అతనిపై జహీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో కిడ్నాప్ కేసు నమోదైంది. అయితే బాలుడి ఆచూకీ చెప్పాలంటూ తనను 3 నెలలుగా పోలీసులు చిత్ర హింసలు పెడుతున్నారని, దెబ్బలకు చేతులు, కాళ్లు వాచిపోయాయని తల్లి కళావతి వాపోతున్నారు. పోలీసులు కొట్టిన విషయం తమ దృష్టికి రాలేదని, దీనిపై విచారణ చేస్తామని CI అశోక్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.