news

News February 18, 2025

మా నాయకత్వాన్ని హైకమాండ్ నిర్ణయిస్తుంది: సీఎం సిద్ధరామయ్య

image

కర్ణాటకలో ‘లీడర్‌షిప్ రొటేషన్’లో భాగంగా సీఎంగా సిద్ధరామయ్యను తప్పించి మరో నేతను కాంగ్రెస్ ఎంపిక చేస్తుందన్న వార్తలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. వాటిని సిద్ధరామయ్య కొట్టిపారేశారు. కర్ణాటకలో నాయకత్వంపై కాంగ్రెస్ హైకమాండ్ చూసుకుంటుందని, దాని గురించి పెద్ద చర్చ అక్కర్లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న శివకుమార్‌కు సీఎం పదవి రావొచ్చని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి.

News February 18, 2025

ఢిల్లీ తొక్కిసలాటలో కుట్ర కోణం లేదు: రైల్వే మంత్రి

image

ఢిల్లీ తొక్కిసలాట ఘటనలో ఎలాంటి కుట్ర కోణం లేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తేల్చిచెప్పారు. ‘తొక్కిసలాట జరిగేంత రద్దీ కూడా రైల్వే స్టేషన్లో లేదు. కుట్రేమీ లేదని భావిస్తున్నాం. ప్రస్తుతం సీసీటీవీ పర్యవేక్షణ మరింతగా పెంచాం’ అని పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ స్టేషన్‌కు ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 8 కంపెనీల పారామిలిటరీ బలగాల్ని స్టేషన్‌కు లోపల, బయటా మోహరించినట్లు అధికారులు తెలిపారు.

News February 18, 2025

ప్రతి ఉద్యోగికి రూ.4లక్షల బోనస్

image

లాభాలను ఉద్యోగులకు పంచే కంపెనీలు కొన్నే ఉంటాయి. పారిస్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ హెర్మేస్ ఆ కోవలోకి వస్తుంది. గతేడాది తమ కంపెనీకి అసాధారణ లాభాలు రావడంతో ప్రతి ఉద్యోగికి రూ.4లక్షల బోనస్ ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ దేశాల్లో వ్యాపారం చేస్తున్న ఈ కంపెనీలో 25k మంది పని చేస్తున్నారు. అంతర్జాతీయంగా తన బ్రాండ్‌ను విస్తరించి నమ్మకమైన కస్టమర్ బేస్ సంపాదించుకోవడమే భారీ లాభాలకు కారణమయ్యాయి.

News February 18, 2025

వ్యాయామం చేయకుండానే ఫిట్‌గా ఉండాలా?

image

కసరత్తులతో చెమటలు చిందించకుండానే శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సమతుల్య ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, సీడ్స్, ప్రోటీన్ పదార్థాలు తినాలి. షుగర్, ఫ్రై, ప్రాసెస్‌డ్ ఫుడ్ తినకూడదు. అలాగే లిఫ్ట్ బదులుగా మెట్లు ఎక్కడం, ఇంటి పనులు చేయడం, పార్కులో నడవడం వల్ల కేలరీలు కరిగి శరీరం ఫిట్‌గా మారుతుంది. తగినన్ని నీళ్లు తాగి, తగినంత నిద్ర పోతే శరీరం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు.

News February 18, 2025

ఒడిశాలో విద్యార్థిని ఆత్మహత్యపై స్పందించిన నేపాల్ PM

image

ఒడిశాలోని కళింగ యూనివర్సిటీలో తమ దేశ విద్యార్థిని ఆత్మహత్య, తదనంతరం చోటు చేసుకున్న <<15495303>>నిరసనలపై<<>> నేపాల్ ప్రధాని కేపీ ఓలీ స్పందించారు. ఢిల్లీలోని తమ ఎంబసీకి చెందిన ఇద్దరు అధికారులను అక్కడికి పంపించినట్లు చెప్పారు. వారు పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తారని తెలిపారు. వర్సిటీలోని తమ దేశ విద్యార్థుల ఇష్టప్రకారం కావాలంటే అక్కడి హాస్టల్‌లో, లేదంటే బయట వసతి ఏర్పాట్లు చేస్తారని వెల్లడించారు.

News February 18, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 18, 2025

ఫిబ్రవరి 18: చరిత్రలో ఈరోజు

image

1745: బ్యాటరీ ఆవిష్కర్త ఇటలీ శాస్త్రవేత్త అలెస్సాండ్రో వోల్టా జననం
1836: ఆధ్యాత్మిక గురువు రామకృష్ణ పరమహంస జననం
1939: ఆంధ్రసభ స్థాపకుడు, సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ మరణం
2002: ఒలింపిక్ మెడలిస్ట్ షూటర్ మనూ భాకర్ జననం
2014: ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదం
2015: సినీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మరణం
2023: నటుడు నందమూరి తారకరత్న మరణం

News February 18, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: ఫిబ్రవరి 18, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 5.29 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.41 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
అసర్: సాయంత్రం 4.42 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.19 గంటలకు
ఇష: రాత్రి 7.32 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 18, 2025

శుభ ముహూర్తం (మంగళవారం, 18-02-2025)

image

తిథి: బహుళ షష్ఠి తె.4.34 వరకు
నక్షత్రం: స్వాతి
రాహుకాలం: మ.3.00 నుంచి మ.4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి మ.10.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.24- ఉ.9.12, తిరిగి రా.10.48- రా.11.36
వర్జ్యం: ఉ.11.46 నుంచి మ.1.32 వరకు
అమృత ఘడియలు: రా.9.51 నుంచి రా.11.33 వరకు

News February 18, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.