India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: తమ డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్రంలోని 3,422 మంది సెకండ్ ఏఎన్ఎమ్‌లు నేటి నుంచి సమ్మెబాట పట్టనున్నారు. 636 PHCలు, 235 UPHCలలోని సిబ్బంది విధులను బహిష్కరించనున్నారు. తమను ఫస్ట్ ఏఎన్‌ఎంలుగా పర్మినెంట్ చేయాలని, 100 శాతం గ్రాస్ శాలరీ, రూ.10 లక్షల హెల్త్, లైఫ్ బీమాను వర్తింపజేయాలని వారు కోరుతున్నారు. గత నెల 27వ తేదీనే సమ్మె నోటీసు ఇచ్చామని చెబుతున్నారు.

AP: తిరుపతిలో నేటి నుంచి 3 రోజులపాటు అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఇవాళ ఏపీ, మహారాష్ట్ర, గోవా సీఎంలు చంద్రబాబు, ఫడణవీస్, ప్రమోద్ సావంత్, కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పాల్గొననున్నారు. వీరు ఇంటర్నేషనల్ టెంపుల్ ఎక్స్‌పోను ప్రారంభిస్తారు. ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్‌షాపులు జరుగుతాయి. దాదాపు 100 ఆలయాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు.

TG: GOVT పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నేటి నుంచి కంటి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రెండు విడతలుగా 89,245మందికి పైగా చిన్నారులకు గత ఏడాది పరీక్షలు ముగిశాయి. వారిలో 88,676మందిలో దృష్టిలోపాలున్నాయని అధికారులు గుర్తించారు. ఇక ఈరోజు నుంచి వచ్చే నెల 5 వరకూ మూడో విడత పరీక్షలు ప్రారంభం జరగనున్నాయి. సమస్య ఎక్కువగా ఉన్న పిల్లలకు కళ్లజోళ్లను అందివ్వనున్నారు.

AP: ఉపాధి హామీ పథకంలో భాగంగా 2025-26 ఏడాదికి APకి 26.77 కోట్ల పనిదినాల్ని కేటాయించాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ అధికారుల బృందంతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శైలేశ్ కుమార్‌ను ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో భారీగా పెరిగిన కూలీల సంఖ్యకు తగ్గట్టుగా కేటాయింపులు పెంచాలని కోరారు. ఈ మేరకు ప్రతిపాదనలను ఆయనకు సమర్పించారు.

ఈ నెల 27, 28 తేదీల్లో బెంగళూరులో జరిగే ‘టెక్ అండ్ ఇన్నోవేషన్ సమిట్’లో పాల్గొనాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు ఆహ్వానం లభించింది. ఆ సదస్సులో ఆయన ప్రసంగించాలని నిర్వాహకులు ఆయన్ను కోరారు. ఆహ్వానాన్ని మన్నించిన కేటీఆర్, భవిష్య సాంకేతికాభివృద్ధి అనే అంశంపై కేటీఆర్ ప్రసంగిస్తారని తెలుస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వివిధ ప్రభుత్వాల ప్రతినిధులు ఇందులో పాల్గొననున్నారు.

ఢిల్లీ కొత్త సీఎం ఎవరన్న సస్పెన్స్‌కు నేడు తెరపడే ఛాన్స్ ఉంది. ఈరోజు రాజధానిలో జరిగే సమావేశంలో సీఎం పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఆ పేరుపై హైకమాండ్ ఇప్పటికే స్పష్టతతో ఉన్నప్పటికీ బయటికి పొక్కకుండా జాగ్రత్త పడుతోంది. కేజ్రీవాల్‌పై విజయం సాధించిన పర్వేశ్ వర్మతో పాటు మాజీ విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ, ఆశిష్ సూద్, జితేంద్ర మహాజన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

TG: మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు MLCలకు చోటు కల్పించాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. CM రేవంత్ తాజా ఢిల్లీ పర్యటనలో ఈ విషయంపై చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. 6 మంత్రి పదవుల్లో 4 ఎమ్మెల్యేలకు, 2 ఎమ్మెల్సీలకు కేటాయించనున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం రేవంత్‌కు అత్యంత నమ్మకమైన వరంగల్ నేతకు, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు ఈ అవకాశం దక్కొచ్చని సమాచారం.

వచ్చే నెల 9 నుంచి 13 వరకు తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్నాయి. తొలిరోజు శ్రీసీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తిగా, 2వరోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణభగవానుడిగా, 3వరోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామిగా శ్రీవారు పుష్కరిణిలో విహరించనున్నారు. తెప్పోత్సవాల కారణంగా వచ్చే నెల 9, 10 తేదీల్లో సహస్రదీపాలంకరణ, 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం సేవల్ని TTD రద్దు చేసింది.

అమెరికన్లకు ఆదాయ పన్నును రద్దు చేస్తామని ట్రంప్ చేసిన ప్రకటన ఆసక్తిని రేపింది. అయితే పన్నులేని దేశాలు ఇంకా చాలానే ఉన్నాయి. అవి.. సౌదీ, UAE, ఖతర్, ఒమన్, బహ్రెయిన్, బ్రూనై, ఉత్తర కొరియా, కేమన్ ఐలాండ్స్, బెర్ముడా, బహామాస్, ఆంగ్విలా, St కిట్స్ అండ్ నెవిస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, టర్క్స్ అండ్ కేకోస్, ఆంటిగ్వా అండ్ బార్బుడా, సెయింట్ బార్తెలమీ, వాటికన్, మొనాకో, వాటిస్ అండ్ పుటునా, వనువాటు, నౌరు.

భారత నేవీకి చెందిన నౌక ఐఎన్ఎస్ శార్దూల్, పీ8ఐ నిఘా విమానం ఇండోనేషియాకు చేరుకున్నాయి. అక్కడ జరిగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో పాటు ఇరు దేశాల సంయుక్త నౌకాదళ విన్యాసాల్లో అవి పాల్గొననున్నాయి. మరోవైపు బ్రహ్మాస్ సూపర్ సోనిక్ క్షిపణుల కొనుగోలుకు ఇండోనేషియా భారత్‌తో చర్చలు జరుపుతోంది. ఈ డీల్ విలువ సుమారు 300 మిలియన్ డాలర్ల విలువ ఉండొచ్చని అంచనా.
Sorry, no posts matched your criteria.