news

News August 14, 2024

6 నెలలు రేషన్ తీసుకోని కార్డులు కట్!

image

AP: జాతీయ ఆహార భద్రత చట్టం కింద 1,36,420 కార్డుదారులు 6 నెలలుగా రేషన్ తీసుకోవడం లేదని కేంద్రం గుర్తించింది. దీంతో వాటిని తొలగించి, రాష్ట్ర కార్డులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పౌరసరఫరాల శాఖ నుంచి ప్రతిపాదనలూ అందాయి. మరోవైపు రేషన్ దుకాణాల్లో ప్రతినెలా బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు, గోధుమపిండి, జొన్నలు, సజ్జలు కూడా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

News August 14, 2024

మరో 2 నెలల్లో స్కూళ్లకు కొత్త టీచర్లు!

image

TG: టీచర్లు, లెక్చరర్ల రిక్రూట్‌మెంట్‌పై ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు నెలల్లో నియామకాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెలాఖరులోగా DSC ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఇంటర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. గతంలో నిలిచిపోయిన డిగ్రీ లెక్చరర్ల(అసిస్టెంట్ ప్రొఫెసర్) నియామక ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి కానున్నట్లు సమాచారం.

News August 14, 2024

రేపు 4 సినిమాలు రిలీజ్.. మీ ఛాయిస్ ఏది?

image

రేపు థియేటర్లలో నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. వీటిలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘మిస్టర్ బచ్చన్’, రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్’, కోలీవుడ్ హీరో విక్రమ్ ‘తంగలాన్’, ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ ‘ఆయ్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఈ నాలుగు సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి మీరు ఏ సినిమాకు వెళ్తున్నారో కామెంట్ చేయండి.

News August 14, 2024

రేపే రూ.2,00,000 రుణమాఫీ

image

TG: మూడో విడత కింద రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణమాఫీని రేపు ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. 14.45 లక్షల మందికి రుణమాఫీ అవుతుందని అంచనా. కాగా దక్షిణ కొరియా నుంచి రేవంత్ ఇవాళ హైదరాబాద్ చేరుకుంటారు. రేపు గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం ఆయన ఖమ్మంకు బయల్దేరతారు.

News August 14, 2024

నివురుగప్పిన నిప్పులా పశ్చిమాసియా!

image

ఇజ్రాయెల్‌పై ఇరాన్, హెజ్బొల్లా, హమాస్‌లు ముప్పేట దాడి చేయనున్నట్లు ఆ దేశాన్ని అమెరికా అప్రమత్తం చేసింది. ఈ వారంలోనే దాడులు జరగొచ్చని వైట్ హౌస్ హెచ్చరించింది. కాగా రేపు ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ చర్చలు జరగనున్నాయి. దీంతో యూఎస్, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ నేతలు ఇరాన్‌ను బుజ్జగిస్తున్నారు. చర్చల వేళ దాడులు జరపొద్దని ఇరాన్ కొత్త అధ్యక్షుడితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

News August 14, 2024

క్రీడా మంత్రిత్వ శాఖపై అశ్విని విమర్శలు

image

పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న షట్లర్ అశ్విని పొన్నప్ప కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖపై విమర్శలు చేశారు. ‘నాకు రూ.4.50 లక్షలు చెల్లించి.. శిక్షణ, టోర్నీల కోసం రూ.1.48కోట్లు ఖర్చు చేసినట్లు సాయ్ ప్రకటించడం షాక్‌కు గురిచేసింది. ఇందులో వాస్తవం లేదు. నాకు డబ్బులు ఇచ్చినట్లు చెప్పడం సరికాదు. కనీసం ప్రత్యేక కోచ్‌‌ని కూడా నియమించలేదు. ట్రైనర్‌కు కూడా నేనే డబ్బులు ఇస్తున్నా’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

News August 14, 2024

ఇజ్రాయెల్‌కు $20 బిలియన్ల ఆయుధాలను విక్రయించిన అమెరికా

image

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్‌కు 20 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను అమెరికా విక్రయించింది. ఇందులో 33 వేల ట్యాంక్ క్యాట్రిడ్జ్‌లు, 50 వేల మోర్టార్ క్యాట్రిడ్జ్‌లు, 50 ఎఫ్-15 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఈ ఆయుధాలను 2029 నాటికి ఇజ్రాయెల్‌కు అందించనుంది. కాగా వీటి పంపిణీని ఆపాలని మానవతావాదులు ఒత్తిడి చేస్తున్నా అమెరికా వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.

News August 14, 2024

‘విశ్వంభర’ టీజర్‌పై క్రేజీ రూమర్?

image

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ మూవీ టీజర్‌పై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ నెల 22న మెగాస్టార్ పుట్టినరోజున ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ ఎడిటింగ్, మిక్సింగ్ పనులు ప్రారంభించినట్లు సమాచారం. దీనిపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

News August 14, 2024

క్రికెట్‌కు కివీస్ ప్లేయర్ గుడ్ బై

image

న్యూజిలాండ్ ప్లేయర్ జార్జ్ వర్కర్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. వర్కర్ కివీస్ తరఫున 10 వన్డేలు ఆడి 272, 2 టీ20ల్లో 90 పరుగులు చేశారు. 2015-18 మధ్య ఆయన న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించారు. కాగా ఆయన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 16,601 పరుగులు సాధించారు. ఇందులో 30 శతకాలు ఉన్నాయి.

News August 14, 2024

ALERT: వాహనానికి జాతీయ జెండా పెట్టారా?

image

ప్రతి ఒక్కరూ ఇంటిపై జాతీయ జెండాను ఏర్పాటుచేసే హక్కు ఉంది. కానీ, వాహనాలపై జెండాను పెట్టే హక్కు కొందరికే ఉంది. <>ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా<<>> ప్రకారం ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా జెండాను వాహనాలకు ఏర్పాటు చేయకూడదు. కేవలం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, గవర్నర్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్, ప్రధాని, కేంద్ర మంత్రులు, సీఎం, రాష్ట్ర మంత్రులు, లోక్‌సభ & అసెంబ్లీ స్పీకర్, రాజ్యసభ వైస్ ఛైర్మన్, CJI, జడ్జిలు అర్హులు.