India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: కృష్ణా జలాలను ఏపీ ఇష్టారాజ్యంగా తరలించుకుపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తోందని KTR విమర్శించారు. నాగార్జునసాగర్ కుడి కాల్వ ద్వారా గత 3 నెలలుగా రోజుకు 10వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ఇప్పటికే 646 టీఎంసీలను వినియోగించుకుందని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదుల్లో బొట్టు బొట్టును కాపాడి బీడు భూములను KCR సస్యశ్యామలం చేస్తే ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పంటపొలాలను ఎండబెట్టిందని Xలో ఫైరయ్యారు.

విద్యార్థులు పరీక్షల కోసం కాకుండా జ్ఞానం కోసం చదివినట్లయితే ఒత్తిడి అనేది ఉండదని యాక్టర్ విక్రాంత్ మాస్సే అన్నారు. ‘పరీక్షా పే చర్చ’ లో నటి భూమి పెడ్నేకర్‌తో కలిసి పరీక్షల అనుభవాల్ని స్టూడెంట్స్‌తో పంచుకున్నారు. ఓటములనేవి జీవితంలో భాగమని వాటినుంచే మనం అధికంగా నేర్చుకోవచ్చని సూచించారు. విద్యార్థులు తమకంటూ స్వంత లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాధించేలా కృషి చేయాలన్నారు.

ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన రికార్డు టీమ్ ఇండియాపైనే ఉంది. మన జట్టు ఇప్పటివరకు 18 విజయాలు తన ఖాతాలో జమ చేసుకుంది. ట్రోఫీ చరిత్రలోనే భారత్ నిలకడైన జట్టుగా కొనసాగుతోంది. ఆ తర్వాత శ్రీలంక (14), ఇంగ్లండ్ (14), వెస్టిండీస్ (13), ఆస్ట్రేలియా (12), న్యూజిలాండ్ (12), సౌతాఫ్రికా (12), పాకిస్థాన్ (12) ఉన్నాయి.

AP: ఏటా JANలో జాబ్ క్యాలెండర్, మెగా DSC అంటూ జగన్ నిరుద్యోగులను మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. MLC ఎన్నికలు ముగియగానే తమ ప్రభుత్వం 16,247 పోస్టులతో DSC విడుదల చేస్తుందని పునరుద్ఘాటించారు. జూన్‌కు ముందే నియామకాలు పూర్తి చేస్తామని, ‘తల్లికి వందనం’ అందిస్తామని చెప్పారు. సముద్రంలో చేపల వేట నిషేధిత రోజులకు గాను మత్స్యకారులకు APRలో ₹20K, MAYలో ‘అన్నదాత సుఖీభవ’ అమలు చేస్తామన్నారు.

AP: <<15471142>>మస్తాన్‌సాయి<<>> కేసు వ్యవహారం మరో మలుపు తిరిగింది. గుంటూరు మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా మస్తాన్ సాయి కుటుంబాన్ని తొలగించాలని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు లావణ్య తరఫు లాయర్ లేఖ రాశారు. అతని నేరాల వల్ల దర్గా పవిత్రతకు భంగం వాటిల్లుతుందని పేర్కొన్నారు. అలాగే సీఎస్, గుంటూరు కలెక్టర్, మైనార్టీ సంక్షేమ కార్యదర్శికి కూడా లేఖలు రాశారు.

TS: హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎంపీ అర్వింద్ విమర్శించారు. ప్రపంచ దేశాలు మోదీని గౌరవిస్తుంటే, ఆయన కులంపై సీఎం విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. రేవంత్‌కు సబ్జెక్ట్ లేదని, అడ్మినిస్ట్రేషన్‌లోనూ ఆయన విఫలమయ్యారన్నారు. కులగణనలో కోటి మంది ప్రజల లెక్క తెలియలేదని దుయ్యబట్టారు.

క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ ఇవాళ సాయంత్రం రానుంది. సా.5.30 గంటలకు జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం కానున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది. విడుదలైన 9 రోజుల్లోనే రూ.100 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ వారం రిలీజైన కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ మూవీ కలెక్షన్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 7న విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు.

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో నటుడు రాజేంద్ర ప్రసాద్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కలిసి పలు అంశాలపై మాట్లాడుకున్నారు. తాజా రాజకీయ అంశాలు, టాలీవుడ్ ఇండస్ట్రీపై చర్చించుకున్నట్లు సమాచారం. అంతకుముందు పవన్‌ను రాజేంద్రప్రసాద్ సన్మానించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

TG: ప్రజల కోరిక మేరకు కులగణన మరోసారి చేపట్టినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సర్వేలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారని, కనీసం ఆమెను చూసైనా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ నేర్చుకోవాలని హితవు పలికారు. సర్వే పూర్తయ్యాక తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిస్తామన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ప్రధానితో మాట్లాడి బీసీ కులగణనను చట్టంగా మార్చాలని డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.