India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఫార్ములా- ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌ను ఏసీబీ ఇవాళో, రేపో అరెస్ట్ చేస్తుందని జోరుగా ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయనను 10 రోజులపాటు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు చెప్పింది. అదే సమయంలో విచారణ కొనసాగించొచ్చని పేర్కొంది. దీంతో ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఈ-కార్ రేసులో నిధుల దుర్వినియోగంపై ప్రశ్నల వర్షం కురిపించవచ్చు.
8వ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్రం స్పష్టత ఇవ్వడం లేదు. అయితే, వేతన సవరణ విధానాన్ని మార్చాలని యోచిస్తున్నట్టు Financial Express నివేదిక తెలిపింది. ఉద్యోగుల పనితీరు ఆధారంగా లేదా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా వివిధ స్థాయుల్లో వేతన సవరణ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు వివరించింది. 7వ వేతన సంఘం గడువు ముగుస్తుండడంతో తదుపరి కేంద్ర చర్యలపై ఉత్కంఠ నెలకొంది.
టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీషాకు శత్రువులెవరూ లేరని, తనకు తానే శత్రువని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) విమర్శించింది. ఫిట్‌నెస్, క్రమశిక్షణ, ఆటిట్యూడ్‌లో సమస్యలే ఇందుకు కారణమని తెలిపింది. ‘SMATలో పృథ్వీ షా జట్టులో ఉన్నా లేనట్లే. ఫీల్డింగ్‌లో దగ్గరికి వచ్చిన బంతిని కూడా ఆయన అందుకోలేకపోయారు. బ్యాటింగ్‌లోనూ ఏమాత్రం రాణించలేదు. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు కూడా అతడిపై ఫిర్యాదు చేశారు’ అని పేర్కొంది.
భారత్‌లో అల్లంత ఎత్తునుంచి జారిపడే జలపాతాలకు కొదవే లేదు. వాటిలో అనేక వందల మీటర్ల ఎత్తున్నవి కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని.. కుంచికల్ ఫాల్స్(కర్ణాటక- 455 మీటర్లు), బరేహీపానీ ఫాల్స్(ఒడిశా-399 మీటర్లు), నోహ్కలీకాయ్ ఫాల్స్(మేఘాలయ-340 మీటర్లు), నోహ్సంగిథియాంగ్ ఫాల్స్(మేఘాలయ-315 మీటర్లు), దూద్‌సాగర్ ఫాల్స్(గోవా-కర్ణాటక బోర్డర్, 310 మీటర్లు), మీన్‌ముట్టి ఫాల్స్(కేరళ-300 మీటర్లు).
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల DNAలోనే దళితులపై వ్యతిరేకత ఇమిడి ఉందని మంత్రి కొండా సురేఖ విమర్శించారు. ఢిల్లీలో పార్లమెంటు సాక్షిగా అంబేడ్కర్‌ను అమిత్ షా అవమానించారని, తెలంగాణలో అసెంబ్లీ సాక్షిగా దళిత నేత, స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ సభ్యులు దాడికి యత్నించడం శోచనీయమన్నారు. బీఆర్ఎస్ సభ్యుల తీరును ఆమె ఖండించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు.
TG: ఈ-కార్ రేసు కేసులో మాజీ మంత్రి KTRను 10 రోజుల (డిసెంబర్ 30) వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసులో <<14924276>>ఏసీబీ దర్యాప్తు<<>> కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ నెల 30లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను DEC 27కు వాయిదా వేసింది. ఈ-కార్ రేసు అంశంలో తనపై నమోదైన FIRను క్వాష్ చేయాలని KTR ఈ పిటిషన్ దాఖలు చేశారు.
రాహుల్ గాంధీపై BJP విమర్శల వేడి పెంచింది. MPలను తోయడం మగతనం అనిపించుకోదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. ఈ ఘటన నిలువరించదగినదని పేర్కొన్నారు. రాహుల్ బలవంతంగా తోసేసినా సంఖ్యా బలం ఉన్న BJP MPలు ప్రతిఘటించలేదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సంఖ్యాబలం సభ నడపడానికి, ఓటింగ్ కోసం ఉందన్నారు. విపక్షాల తీరు వల్ల అనేక బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘డాకు మహారాజ్’ మూవీ నుంచి ఓ క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ నెల 23న సెకండ్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జనవరి 4న డల్లాస్‌లో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. కేటీఆర్ లాయర్ సుందరం, ఏజీ సుదర్శన్ రెడ్డి సుదీర్ఘంగా తమ వాదనలు వినిపించారు. కేసు కొట్టేయాలని సుందరం, వద్దని సుదర్శన్ కోరారు. దీంతో కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. కాసేపట్లో ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.
ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి. సుమారు రెండున్నర గంటలుగా కేటీఆర్ తరఫు లాయర్ సుందరం, ఏజీ సుదర్శన్ రెడ్డి వాదిస్తున్నారు. కేటీఆర్‌పై నమోదు చేసిన కేసులో ఎన్నో లొసుగులు ఉన్నాయని, కేసును క్వాష్ చేయాలని సుందరం కోరారు. అయితే కేసు విచారణ దశలో ఉండగా క్వాష్ చేయాలనడం సరికాదని సుదర్శన్ రెడ్డి అన్నారు.
Sorry, no posts matched your criteria.