news

News August 13, 2024

వారికి పిల్లలపై హక్కు లేదు: హైకోర్టు

image

వీర్యదాత, అండం ఇచ్చిన మహిళకు పుట్టిన బిడ్డల‌పై ఎలాంటి చట్టపరమైన హక్కు ఉండదని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. వీరికి పిల్ల‌ల‌పై బ‌యోలాజిక‌ల్ రైట్స్ ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేసింది. ఓ కేసులో మ‌ర‌ద‌లు ఇచ్చిన అండంతో జ‌న్మించిన క‌వ‌ల‌ల‌పై త‌న భార్య‌కు ఎలాంటి హ‌క్కు లేద‌ని భ‌ర్త వాదిస్తుండ‌డంపై బాధిత‌ వివాహిత కోర్టును ఆశ్ర‌యించింది. భ‌ర్త వాద‌న‌ను తోసిపుచ్చిన కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.

News August 13, 2024

MS ధోనీ కొత్త లుక్(PHOTO)

image

భారత జట్టు మాజీ కెప్టెన్ MS ధోనీ కొత్త లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ ట్రెండీ లుక్‌లో ఆయన చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. ట్రిమ్ షేవ్, న్యూ హెయిర్ స్టైల్‌తో ఉన్న మిస్టర్ కూల్ లుక్‌ను ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాశ్ గోవారికర్ క్లిక్‌మనిపించారు. ఈ లుక్‌లో MSD సినిమా హీరోలా ఉన్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఐపీఎల్ టైంలోనూ వింటేజ్ లుక్‌లో ఆయన దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే.

News August 13, 2024

హాస్టళ్లలో దారుణ పరిస్థితులు

image

TG: ప్రభుత్వ హాస్టళ్లలో దారుణ పరిస్థితులు ఉన్నాయని ACB తనిఖీల్లో వెల్లడైంది. ఈరోజు 10 హాస్టళ్లలో ఫుడ్ క్వాలిటీ, శుభ్రతపై అధికారులు తనిఖీలు చేశారు. శుభ్రత లేదని, మంచినీరూ సరిగా ఇవ్వట్లేదని గుర్తించారు. రోజూ పాలు, గుడ్డు అందట్లేదని, రికార్డులు మెయింటైన్ చేయట్లేదని తేల్చారు. వార్డెన్లు వారానికో సారి లేదా నెలకోసారి మాత్రమే వస్తున్నారని తెలిపారు. సరుకుల కొనుగోళ్లలో నిధులు పక్కదారి పట్టాయన్నారు.

News August 13, 2024

కేజ్రీవాల్, కవిత కస్టడీ పొడిగింపు

image

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, BRS MLC కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సెప్టెంబర్ 2 వరకు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ కేసులో ఈ కస్టడీ పొడిగించారు. ఇద్దరినీ తిహార్ జైలు నుంచి వర్చువల్‌గా జడ్జి ముందు అధికారులు హాజరుపరిచారు. అటు కవిత బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

News August 13, 2024

రైతు రుణమాఫీ కాని వారికి GOOD NEWS

image

TG: రూ.లక్షన్నర వరకు 2 విడతల్లో రుణాలు మాఫీ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించినా పలువురికి రుణాలు జమ కాలేదు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి రుణాలు మాఫీ చేస్తామన్నారు. ఆధార్, పాస్‌బుక్‌లో పేర్లలో మార్పులు, కుటుంబాల్లో పంపకాలు పూర్తి కాకపోవడం వంటి కారణాలతో పలువురికి మాఫీ కాలేదు.

News August 13, 2024

ప్రతి విద్యార్థికి ఐడీ కార్డు ఇవ్వాలి: CBN

image

AP: విద్య ప్రతి ఒక్కరి హక్కు అని బడి ఈడు పిల్లలు బయట ఉండటానికి వీల్లేదని అధికారులకు CM చంద్రబాబు స్పష్టం చేశారు. 100% విద్యార్థుల ఎన్రోల్మెంట్ జరగాలని సూచించారు. ప్రైవేట్ స్కూళ్లలో మాదిరి ప్రభుత్వ పాఠశాలల్లోనూ పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించాలన్నారు. కేంద్రం తీసుకొచ్చిన APAAR ద్వారా ప్రతి విద్యార్థికి ID కార్డు ఇవ్వాలన్నారు. స్కూళ్లలో ఇంగ్లిష్‌తో పాటు తెలుగుకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.

News August 13, 2024

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రేపు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, వైజాగ్, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ఏలూరు, అనంతపురం, సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో మోస్తరు వర్షాలు కురుస్తాయంది. NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, ప.గో, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.

News August 13, 2024

232 రోజులు పెరోల్ మీద ఉన్నాడు!

image

రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ 2022 జూన్ నుంచి ఇప్ప‌టిదాకా 232 రోజులు పెరోల్ మీద ఉండ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. 2022లో 70 రోజులు, 2023లో 91 రోజులు, ఈ ఏడాది 71 రోజులు క‌లుపుకొని మొత్తంగా 232 రోజులు పెరోల్‌పై ఉన్నాడు. ఇది హ‌రియాణా ప్ర‌భుత్వ‌ నిర్ణయం అని, దీనికీ న్యాయవ్యవస్థకు సంబంధం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

News August 13, 2024

హీరోయిన్‌కు లేని ప్రాబ్లం మీకేంటి?: హరీశ్ శంకర్

image

‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో హీరో రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ మధ్య ఏజ్ గ్యాప్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో దర్శకుడు హరీశ్ శంకర్ ఘాటుగా స్పందించారు. ‘మన ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు వయస్సు, మిగతావి అన్నీ చూసుకోవాలి. ఇది సినిమా. హీరోకు స్క్రీన్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది. సినిమాకు ఒప్పుకునే అమ్మాయి(హీరోయిన్)కే సమస్య లేనప్పుడు, మీకేంటి ప్రాబ్లం?’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

News August 13, 2024

ఈ కాలర్ ట్యూన్ వస్తోందా?

image

‘హర్ ఘర్ తిరంగా-3’లో భాగంగా పౌరులు తమ ఇళ్లపై మువ్వన్నెల జెండాను ఎగరవేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, పౌరులకు ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేసేందుకు కేంద్రం కాలర్ ట్యూన్‌ను ఏర్పాటు చేసింది. దీంతో ఎవరికైనా కాల్ చేసినప్పుడు ‘హర్ ఘర్ తిరంగా’ గురించి మోదీ వాయిస్ వినిపిస్తోంది. కొంతమందికి రావట్లేదు. మీకూ ఇలా కాలర్ ట్యూన్ వస్తోందా? కామెంట్ చేయండి.