India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చర్చ కన్నా రభసే ఎక్కువగా జరిగింది. NDA, INDIA పరస్పరం విమర్శల కత్తులు దూసుకున్నాయి. మొదట అదానీ అంశంపై కాంగ్రెస్ ఆందోళన చేసింది. సొరోస్‌తో సోనియా, రాహుల్ సంబంధాలతో BJP దాన్ని తిప్పికొట్టింది. రాజ్యాంగం, అంబేడ్కర్‌పై అమిత్ షా ప్రసంగాన్ని ట్రిమ్ చేసి కాంగ్రెస్ రచ్చ మొదలెట్టింది. కాదు మీరే బాబాసాహెబ్‌ను అవమానించారని BJP ఎదురుదాడికి దిగింది. ఇక MPల తోపులాట ఓ కొసమెరుపు!
హిందీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘పుష్ప-2’కు PVR INOX షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నార్త్ ఇండియాలో షోలను రద్దు చేసేందుకు PVR సిద్ధమైనట్లు సమాచారం. ‘బేబీ జాన్’ ఈనెల 25న విడుదల నేపథ్యంలో 50-50 షోస్‌ను ‘పుష్ప-2’ డిస్ట్రిబ్యూటర్ కోరడంతో థియేటర్ల పంపిణీలో గొడవ తలెత్తింది. మేకర్స్ దీనిపై చర్చలు జరపడంతో ఉదయం నుంచి కొన్నిచోట్ల షోలు తిరిగి స్టార్ట్ అయ్యాయి. ఈనెల 25 తర్వాత షోలు భారీగా తగ్గే అవకాశం ఉంది.
తెలంగాణ అసెంబ్లీ ఆందోళనల మధ్యే కొనసాగుతోంది. ‘భూభారతి’పై ఒకవైపు మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుండగా ఫార్ములా-ఈ కార్ రేసు కేసుపై చర్చకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
AP: ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తేమ, ఇతర అంశాల్లో కచ్చితత్వం ఉండాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని, తానే స్వయంగా ఐవీఆర్ఎస్ ద్వారా అభిప్రాయాలు సేకరిస్తానని చెప్పారు. అన్నదాతలకు సేవ చేసే విషయంలో తప్పు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు.
AP: అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి BJP ప్రయత్నిస్తోందని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ షర్మిల అన్నారు. గురువారం పార్లమెంటులో చోటు చేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. వారిలో వారే కొట్టుకుని రాహుల్ గాంధీపై నిందలు మోపుతున్నారని ఆరోపించారు. అమిత్ షా వ్యాఖ్యల వీడియో డిలీట్ చేయాలంటూ ‘X’కు కేంద్రం నోటీసులివ్వడం చూస్తుంటే వారే తప్పు చేశారని అర్థమవుతోందన్నారు.
AP: వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ ప్రశాంత్ కుమార్ ధర్మాసనం తదుపరి విచారణను జనవరి 7కు వాయిదా వేసింది. నందిగం సురేశ్ ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే.
TG: ఫార్ములా-ఈ కార్ రేసులో KTRను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో విధ్వంసం సృష్టించేందుకు BRS కుట్ర పన్నుతోందని కాంగ్రెస్ MLA ఆది శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. ‘అరెస్ట్ చేయగానే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, దాడులకు కుట్ర జరుగుతోంది. KTR ఆత్మ, బినామీ తేలుకుంట్ల శ్రీధర్ కుట్ర చేస్తున్నారు. నియోజకవర్గానికి రూ.కోటి పంపిస్తున్నారు. BRS కుట్రల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు.
జమిలి బిల్లును జేపీసీకి పంపడంపై కేంద్రమంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందింది. రాజ్యసభ నుంచి 12 మందిని జేపీసీకి పంపాలని ప్రతిపాదించారు. ఇందులో తెలుగు ఎంపీలు సీఎం.రమేశ్, హరీశ్ బాలయోగి, బాలశౌరి, కె.లక్ష్మణ్, విజయసాయిరెడ్డికి చోటు దక్కింది. కాగా ఇప్పటికే జమిలి బిల్లు జేపీసీకి పంపడానికి లోక్‌సభలో ఆమోదం లభించింది.
పుణే ఎయిర్ పోర్టు పేరును మారుస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ గురువారం తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇప్పటి వరకూ దాని పేరు లోహెగావ్ ఎయిర్‌పోర్టుగా ఉండగా ఇకపై జగద్గురు సంత్ తుకారాం మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా వ్యవహరించనున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖకు ఈ తీర్మానాన్ని పంపించనున్నారు. మహారాష్ట్రలోని డెహూ గ్రామంలో జన్మించిన తుకారాం వర్కారీ సంప్రదాయ గురువు. పండరీపురంలోని విఠోబాకు అపరభక్తుడు.
TG: తనపై ACB కేసులను క్వాష్ చేయాలని హైకోర్టులో <<14930926>>KTR <<>>దాఖలు చేసిన పిటిషన్ విచారణ జరగడంపై ఉత్కంఠ నెలకొంది. జస్టిస్ శ్రవణ్ బెంచ్ ముందు లంచ్ మోషన్ పిటిషన్ వేయగా, ఆయన సీజే బెంచ్ వద్దకు వెళ్లాలన్నారు. సీజే వద్ద ఈ విషయం KTR లాయర్లు మెన్షన్ చేయగా, రిజిస్ట్రీకి వెళ్లాలని సీజే సూచించారు. సా.4గంటలకు రాష్ట్రపతితో జడ్జిల భేటీ కార్యక్రమం ఉండటంతో ఇవాళ విచారణ జరుగుతుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.