news

News August 13, 2024

వేడితో యూరప్‌లో గత ఏడాది 47వేల మంది మృతి

image

ఐరోపా ఖండంలో వేడి కారణంగా గత ఏడాది 47వేలమందికి పైగా మృతిచెందారని బార్సిలోనా ఐఎస్ గ్లోబల్ హెల్త్ నివేదిక వెల్లడించింది. ఉష్ణోగ్రతల నమోదు మొదలయ్యాక యూరప్‌నకు నిరుడు అత్యంత వేడైన సంవత్సరంగా నిలిచింది. 60 వేల మరణాలుంటాయని అంచనా ఉన్నప్పటికీ ఆరోగ్య రంగ సేవలు మెరుగవుతుండటంతో మరణాలు తగ్గినట్లు నివేదిక వివరించింది. ఎక్కువ మరణాలు గ్రీస్, బల్గేరియా, ఇటలీ, స్పెయిన్ నుంచి ఉన్నట్లు తెలిపింది.

News August 13, 2024

నాన్నా.. నీ వెంటే నేను: గుండెపోటుతో తండ్రీకొడుకు మృతి

image

TG: అల్లారుముద్దుగా పెంచిన తండ్రి మరణాన్ని తట్టుకోలేక గంటల వ్యవధిలోనే కుమారుడూ చనిపోయాడు. ఈ హృదయవిదారక ఘటన భూపాలపల్లి(D) పెద్దంపేటలో జరిగింది. బీసుల పెద్ద లస్మయ్య(62) సోమవారం ఉదయం గుండెపోటుతో చనిపోయాడు. దీంతో కొడుకు కృష్ణంరాజు(30) తల్లడిల్లిపోయాడు. రోదిస్తూనే అంత్యక్రియలు చేసిన అతను సాయంత్రం హార్ట్ అటాక్‌తో కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశాడు.

News August 13, 2024

2036 నాటికి దేశ జనాభా 152 కోట్లు

image

2011 లెక్కల ప్రకారం 121 కోట్లుగా ఉన్న దేశ జనాభా 2036 నాటికి 152 కోట్లకు చేరనుంది. గణాంకాల శాఖ నివేదిక ప్రకారం పనిచేసే(15-59ఏళ్లు) వారి సంఖ్య 64.9 శాతానికి(గతంలో 60.7%) చేరనుంది. 2011లో లింగ నిష్పత్తి 1000:943 ఉండగా, 2036కు 1000:952కు పెరగనుంది. పట్టణ జనాభా 37.7కోట్ల నుంచి 59.4కోట్లకు, గ్రామీణ జనాభా 83కోట్ల నుంచి 92కోట్లకు చేరనుంది. 15ఏళ్ల లోపు వారి సంఖ్య తగ్గి 60ఏళ్లు పైబడే వారి సంఖ్య పెరగనుంది.

News August 13, 2024

మేం చూస్తూనే ఉన్నాం: అమెరికా

image

బంగ్లాలో పరిస్థితుల్ని US నిరంతరం పర్యవేక్షిస్తోందని వైట్‌హౌస్ ప్రకటించింది. ఇంతకు మించి చెప్పేదేమీ లేదంది. ఎలాంటి మానవ హక్కుల అంశమైనా జో బైడెన్ ఎప్పుడూ గట్టిగా, స్పష్టంగానే మాట్లాడతారని నొక్కి చెప్పింది. హిందువులు, మైనారిటీలపై దాడుల్ని అడ్డుకోవాలని కొన్ని రోజులుగా అమెరికన్ హిందూ సంఘాలు, నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే వైట్‌హౌస్ ప్రకటనలో మైనారిటీలు, హిందువులు అన్న పదాలే లేకపోవడం గమనార్హం.

News August 13, 2024

కుడి ఎడమైతే పొరపాటేనా?

image

ఈరోజు ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే. మనిషికి ఉండే రెండు చేతుల్లో ఏది ముఖ్యమని అడిగితే రెండూ ముఖ్యమే అంటారు. కానీ ఎడమచేతిపై వివక్ష ఎప్పటికీ ఉంటుంది. మహిళల్లో ఈ పట్టింపు మరీ ఎక్కువ. ఇంట్లో ఆడపిల్లలు ఎడమ చేత్తో వండినా, వడ్డించినా ఆఖరికి మంచినీళ్లిచ్చినా ఈసడింపుగా చూస్తారు. అందుకే లెఫ్ట్ హ్యాండర్స్‌కు ఈ సమాజం నుంచి కొన్ని సవాళ్లు ఎక్కువే. దీనిపై మీ అభిప్రాయం?

News August 13, 2024

నేడు, రేపు విశాఖ నేతలతో జగన్ భేటీ

image

AP: ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులతో వైసీపీ అధినేత జగన్ రెండు రోజులపాటు సమావేశం కానున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ <<13788692>>ఉప ఎన్నిక<<>> నేపథ్యంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో ఇతర జిల్లాల నాయకులు, సందర్శకులకు జగన్‌ను కలిసే అవకాశం ఉండదని పార్టీ తెలిపింది. కాగా ఇప్పటికే విశాఖ జిల్లాలోని 5 నియోజకవర్గాల MPTCలు, ZPTCలతో ఆయన సమావేశమైన విషయం తెలిసిందే.

News August 13, 2024

ట్రంప్-మస్క్ ఇంటర్వ్యూపై సైబర్ దాడి

image

US అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో ట్విటర్‌లో తాను నిర్వహించిన ఇంటర్వ్యూపై DDoS సైబర్ దాడి జరిగిందని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తెలిపారు. అందువల్లే ఇంటర్వ్యూ 45 నిమిషాలు ఆలస్యంగా మొదలైందని పేర్కొన్నారు. వెబ్‌సైట్ లేదా యాప్ పని తీరు దెబ్బతీసేలా కృత్రిమంగా భారీ ఆన్‌లైన్ ట్రాఫిక్‌‌ను తీసుకురావడాన్ని DDoS దాడిగా చెబుతారు. కాగా ట్రంప్ బృందం ఈ ముఖాముఖిని ‘ఇంటర్వ్యూ ఆఫ్ ది సెంచరీ’గా ప్రకటించింది.

News August 13, 2024

తీవ్ర గాయం.. చేతి కర్రల సాయంతో బెన్ స్టోక్స్‌ నడక

image

‘హండ్రెడ్’ టోర్నీలో ఆల్ రౌండర్, ENG టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్రంగా గాయపడ్డారు. నార్తర్న్ సూపర్ ఛార్జర్స్‌కు ఆడుతున్న అతను మాంచెస్టర్‌తో మ్యాచ్‌లో పరుగు తీస్తూ కీపర్‌ను ఢీకొట్టారు. దీంతో చీలమండ దెబ్బతింది. మరో ఇద్దరు అతనిని గ్రౌండు నుంచి తీసుకెళ్లారు. ప్రస్తుతం చేతికర్రల సాయంతో స్టోక్స్ నడుస్తున్నారు. దీంతో వచ్చే వారం శ్రీలంకతో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌కు దూరమయ్యే అవకాశం కన్పిస్తోంది.

News August 13, 2024

MLA దానం నాగేందర్‌పై కేసు నమోదు

image

TG: ప్రభుత్వ స్థలం వ్యవహారంలో ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సహా మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ రోడ్ నం.69 నందగిరిహిల్స్‌లో GHMC స్థల ప్రహరీని కొందరు కూల్చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గుర్తించారు. కూల్చివేతతో MLAకు సంబంధం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రహరీ కూల్చివేత వల్ల రూ.10లక్షల నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News August 13, 2024

మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు

image

AP: మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఉదయమే NTR జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న 15 మంది సిబ్బంది ఫైళ్లను పరిశీలిస్తున్నారు. సీఐడీ స్వాధీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేశారనే ఆరోపణలతో ఆయన కుటుంబీకులపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలోనే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.