India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ అప్పీల్‌పై తీర్పు వాయిదా పడింది. తీర్పును ఆగస్టు 11కు వాయిదా వేస్తున్నట్లు ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ వెల్లడించింది. రెజ్లింగ్ ఫైనల్‌కు ముందు 100 గ్రాముల బరువు ఎక్కువ ఉండటంతో IOC ఆమెను డిస్‌క్వాలిఫై చేసింది. అయితే తనకు సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలని వినేశ్ కోర్టుకెళ్లారు.
పారిస్ ఒలింపిక్స్‌లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ దుస్మంతోవ్ గోల్డ్ మెడల్ గెలిచారు. అయితే అతడితో కలిసి సంబరాలు చేసుకుంటుండగా హెడ్ కోచ్ కిలిచెవ్ గుండెపోటుకు గురయ్యారు. అక్కడే ఉన్న బ్రిటన్‌కు చెందిన డాక్టర్ హర్జ్ సింగ్, ఫిజియో లిల్లిస్ ఆయనకు CPR చేశారు. డెఫిబ్రిలేటర్‌తో షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. దీంతో కిలిచెవ్ స్పృహలోకి వచ్చారు. సమయస్ఫూర్తితో స్పందించిన హర్జ్ సింగ్, లిల్లీస్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.
AP: చంద్రబాబు హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న <<13824303>>జగన్<<>> విమర్శలకు TDP కౌంటర్ ఇచ్చింది. ‘రాష్ట్రానికి రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని ఒప్పుకున్నందుకు సంతోషం. నువ్వు చేసిన పెంటకు అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయి. వాటిని చక్కదిద్దే పనిలో ఉన్నారు చంద్రబాబు. నీ ప్రత్యేక హోదా, 45 ఏళ్లకు పెన్షన్, సన్నబియ్యం, వారంలో సీపీఎస్ రద్దు, మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్ ఏమయ్యాయి?’ అని Xలో ప్రశ్నించింది.
ఇటీవల వివాహమై, ఆషాఢ మాసం తర్వాత అత్తారింటికి వచ్చిన అల్లుడికి 100 రకాల పిండి వంటలు పెట్టారు. కాకినాడ(D) కిర్లంపూడి(M) తామరాడకు చెందిన ఉద్ధగిరి వెంకన్నబాబు-రమణి దంపతులు వారి అల్లుడు బాదం రవితేజ, కుమార్తె రత్న కుమారికి శనివారం 100 రకాల పిండి వంటలు స్వయంగా చేసి వడ్డించారు. సాధారణంగా గోదావరి జిల్లాలో అల్లుళ్లకు ఇటువంటి మర్యాద చేయడం ఆనవాయితీగా వస్తోంది.
పై ఫొటో చూడండి. పాలపుంతలోని ఓ ధూళి మేఘం అది. నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఈ ఫొటోలో ఓ మూల ఉన్న చిన్న కొమ్ములాంటి చోట జూమ్ చేస్తే, అందులో మరింత మూలకి మన సౌర కుటుంబం ఉంటుంది. సూర్యుడు ఒక ఖాళీ బంతి అనుకుంటే అందులో సుమారు 3,30,000 భూముల్ని పట్టించొచ్చని చెబుతారు ఖగోళ శాస్త్రవేత్తలు. దీంతో ఈ భూమిలో మనమెంత.. మన ఆస్తులు, జీవితాలు, కష్టనష్టాలు ఎంత అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
వయనాడ్‌ను ఈరోజు ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించిన ప్రధాని మోదీ ఆస్పత్రుల్లో బాధితుల్ని కూడా పరామర్శించారు. విపత్తు సమయంలో వారు పడిన కష్టాన్ని విని చలించిపోయారు. ఈ క్రమంలో ఓ బాధిత కుటుంబానికి చెందిన చిన్నారిని పలకరించారు. తాతయ్యలా అనిపించారో ఏమో కానీ ఆ చిట్టి తల్లి ప్రధాని బుగ్గల్ని ప్రేమగా నిమిరింది. ఆయనా చిన్నారిని ప్రేమగా హత్తుకున్నారు. PM వయనాడ్ పర్యటనలో ఈ ఘటన ప్రధాన ఆకర్షణగా మారింది.
నెట్ సర్ఫింగ్‌తో ఎంతో జ్ఞానం సంపాదించుకోవచ్చు. కానీ కొంతమంది విషాదాల వార్తల్ని, భయానకమైన, అవాస్తవమైన విషయాల్నే ఎక్కువగా చదువుతుంటుంటారు. దీన్ని ‘డూమ్ స్క్రోలింగ్’గా వ్యవహరిస్తారు. ఇలాంటి అలవాటు ఉన్నవారు దాన్ని మానుకోవాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్, ఉన్మాదం, తప్పుడు ఆలోచనలు, బైపోలార్ డిజార్డర్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర నేతలు, కార్యకర్తలతో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ఇవాళ NTR భవన్‌లో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలోపేతంపై చర్చించారు. వారి నుంచి సూచనలు, వినతులు స్వీకరించారు. గ్రామాల్లో క్యాడర్‌ను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని నేతలకు చంద్రబాబు సూచించారు.
తెలంగాణలో పార్టీ పునర్‌నిర్మాణంపై దృష్టి పెట్టిన టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయిలో సభ్యత్వాలపై దృష్టి పెట్టాలని సూచించారు. త్వరలోనే టీటీడీపీ అధ్యక్షుడిని నియమిస్తానని, సభ్యత్వాలు పూర్తయ్యాక కమిటీలు ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఇకపై ప్రతి నెల రెండో శనివారం రాష్ట్రానికి వస్తానని చంద్రబాబు వెల్లడించారు.
J&K: అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు. ఉగ్రవాదులు దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. దీంతో టెర్రరిస్టులు కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు మరణించారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
Sorry, no posts matched your criteria.