India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ OpenAIపై ఎలాన్ మస్క్ కన్నేశారు. ఆయన నేతృత్వంలోని ఇన్వెస్టర్లు 97.4 బిలియన్ డాలర్లకు OpenAIను కొనుగోలు చేసేందుకు ఆ కంపెనీ బోర్డుకు ఆఫర్ చేశారు. ఈ ఆఫర్‌ను ఆ సంస్థ సీఈవో ఆల్ట్‌మన్ తిరస్కరించారు. కాగా మస్క్ అప్పట్లో ఈ కంపెనీలో భాగస్వామిగా ఉండేవారు. దీన్ని నాన్-ప్రాఫిట్ నుంచి ప్రాఫిట్ కార్పొరేషన్‌గా మార్చాలని ఆల్ట్‌మన్ నిర్ణయం తీసుకోవడంతో మస్క్ వైదొలిగారు.

చిలుకూరు బాలాజీ అర్చకుడు <<15409945>>రంగరాజన్‌పై దాడిచేసిన<<>> వ్యక్తి వివరాలు బయటకొచ్చాయి. తూ.గో. జిల్లా కొప్పవరానికి చెందిన వీర రాఘవరెడ్డి ‘రామరాజ్యం’ అనే సంస్థను ప్రారంభించి తాము ఇక్ష్వాకుల వంశస్థులమని ప్రచారం చేసుకుంటున్నారు. ఆలయాలు తిరుగుతూ తమకు మద్దతివ్వాలని కోరుతున్నారు. ఇతడు చట్టాలపై మంచి పట్టు తెచ్చుకున్నారు. 2015లో తన కూతురి అడ్మిషన్ విషయంలో జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌పై కేసు వేసి గెలిచారు.

AP: విజయవాడ నుంచి రాజధాని అమరావతి వెళ్లేందుకు ప్రస్తుతమున్న కరకట్ట రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. దాదాపు అలైన్‌మెంట్ పూర్తి కాగా త్వరలో టెండర్ల ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకోసం భూసేకరణ/భూసమీకరణ చేయాలా? అనే దానిపై సీఎంతో చర్చించాక నిర్ణయం తీసుకోనున్నారు. కృష్ణా నది వరదలను తట్టుకునేలా కరకట్టను బలోపేతం చేయనున్నారు.

‘లైలా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ వ్యాఖ్యలపై చెలరేగిన <<15417744>>వివాదం<<>> కొనసాగుతోంది. హీరో విశ్వక్‌సేన్ సారీ చెప్పినా వైసీపీ ఫ్యాన్స్ తగ్గటం లేదు. పృథ్వీరాజ్‌తో క్షమాపణలు చెప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 115K+ ట్వీట్లతో #BoycottLaila ఇంకా Xలో ట్రెండ్ అవుతోంది. మరి దీనిపై మరోసారి మూవీ టీమ్ నుంచి ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలి. ఈ సినిమా ఈనెల 14న థియేటర్లలోకి రానుంది.

APలో అక్షరాస్యత రేటు 67.5%గా ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గత మూడేళ్లలో అక్షరాస్యత రేటు పెంపునకు ఎలాంటి చర్యలు తీసుకున్నారని వైసీపీ ఎంపీ తనూజారాణి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సమాధానం ఇచ్చారు. 2023-24లో దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత 77.5%గా ఉండగా, ఏపీలో 67.5%గా ఉందన్నారు. పీఎం కౌశల్ యోజన కింద రాష్ట్రానికి రూ.48.42కోట్లు మంజూరు చేశామని తెలిపారు.

TG: రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది. సాధారణం కన్నా నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. మరోవైపు సోమవారం ఖమ్మంలో 35, హైదరాబాద్‌లో 32 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది.

చంద్రయాన్-3 ల్యాండింగ్ సైట్ 3.7 బిలియన్ ఏళ్ల నాటిదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. హై రిజల్యూషన్ రిమోట్ సెన్సింగ్ డేటా సెట్‌లను ఉపయోగించి బెంగళూరులోని ఇస్రో ఎలక్ట్రో ఆప్టిక్స్ సిస్టమ్స్ సెంటర్, అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ, చండీగఢ్‌లోని పంజాబ్ వర్సిటీ శాస్త్రవేత్తల బృందం ‘శివశక్తి’ పాయింట్‌ను (69.37°S, 32.32°E) మ్యాప్ చేసింది. అక్కడ చిన్న బండరాళ్లు, రాతి శకలాలున్నాయని పేర్కొంది.

AP: మద్యం ధరల పెంపుపై ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ స్పందించారు. బ్రాండ్, సైజుతో సంబంధం లేకుండా బాటిల్‌పై రూ.10 పెంచినట్లు తెలిపారు. రూ.15, రూ.20 పెరిగినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమన్నారు. రూ.99 మద్యం బాటిల్, బీర్ల ధరల్లో మార్పులు లేవని వెల్లడించారు. అన్ని బ్రాండ్ల ధరలను షాపుల్లో కచ్చితంగా ప్రదర్శించాలని యజమానులను ఆదేశించారు.

TG: రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. 3 స్థానాలకు మొత్తం 118 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. KNR-ADB-NZB-MDK గ్రాడ్యుయేట్ స్థానానికి 80, టీచర్స్ స్థానానికి 15 మంది, WGL-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 23 మంది నామినేషన్లు వేశారు. ఈనెల 13న మ.3 గంటలలోగా నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 27న పోలింగ్ జరగనుంది.

అట్లీ డైరెక్షన్‌లో సల్మాన్ ఖాన్ నటించాల్సిన సినిమా ఆగిపోయినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కాల్సిన ఈ మూవీలో రజినీకాంత్ లేదా కమల్ హాసన్ కూడా నటిస్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఈ కాంబోలో మూవీ రావడం లేదని ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్‌తో చేసే సినిమా కోసం అట్లీ స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. దీనిపై ఆయన నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.