India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రముఖ నిర్మాత, మల్లెమాల ఎంటర్టైన్‌మెంట్స్ అధినేత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి భార్య వరలక్ష్మి (62) మరణించారు. కొద్దిరోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె నిన్న తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమార్తె అయిన వరలక్ష్మిని శ్యామ్ ప్రసాద్ రెడ్డి పెళ్లి చేసుకున్నారు. తలంబ్రాలు, ఆహుతి, అంకుశం, అమ్మోరు, అంజి, అరుంధతి వంటి సినిమాలకు శ్యామ్‌ప్రసాద్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు.
TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన కేశవరావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీకి SEP 3న ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానంలో రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీకి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ అంశంపై రాహుల్ గాంధీ త్వరలో పార్టీ నేతలతో చర్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా దేశంలో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాల బై ఎలక్షన్‌కు EC <<13798382>>నోటిఫికేషన్<<>> విడుదల చేసింది.
AP: రాష్ట్రంలో రూ.7,266 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. పలు కీలక ప్రాజెక్టులను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ తూర్పు బైపాస్‌కు రూ.2,716 కోట్లు, వినుకొండ-గుంటూరు రోడ్డుకు రూ.2,360 కోట్లు, సబ్బవరం-షీలానగర్ రోడ్డుకు రూ.906 కోట్లు, విజయవాడ మహానాడు జంక్షన్-నిడమానూరు రోడ్డుకు రూ.669 కోట్లు, చెన్నై-కోల్‌కతా హైవేపై రణస్థలం రహదారికి రూ.325 కోట్లు కేటాయించింది.
ఒలింపిక్ డబుల్ మెడలిస్ట్ మనూ భాకర్ నిన్న ఏఐసీసీ అగ్ర నేత సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె సాధించిన పతకాలను సోనియాకు చూపించి, ఒలింపిక్స్ విశేషాలను పంచుకున్నారు. కాగా మనూ భాకర్ మళ్లీ పారిస్ వెళ్లనున్నారు. ఈ నెల 11న జరిగే ఒలింపిక్స్ ముగింపు వేడుకల్లో భారత ఫ్లాగ్ బేరర్‌గా మను వ్యవహరించనున్నారు.
రీవెరిఫికేషన్‌లో విఫలమైన 73 లక్షల మొబైల్ కనెక్షన్లను టెలికం కంపెనీలు రద్దు చేసినట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ LSలో తెలిపారు. ఆయా మొబైల్ కనెక్షన్లను రీవెరిఫై చేయాలని టెలికం విభాగం(డాట్) టెల్కోలను ఆదేశించింది. వివరాల ధ్రువీకరణలో విఫలమైన కంపెనీలు, కనెక్షన్లను రద్దు చేశాయి. నకిలీ IDలు లేదా అడ్రస్‌లతో తప్పుడు కనెక్షన్లు పొందిన వారిని గుర్తించేందుకు డాట్ ఒక వ్యవస్థని రూపొందించింది.
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ స్పిన్ బౌలింగ్‌లో ఇబ్బంది పడుతున్నారు. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో మూడు మ్యాచుల్లో స్పిన్నర్లకే వికెట్ సమర్పించుకున్నారు. పేస్‌ను సమర్థంగా ఎదుర్కొన్న కోహ్లీ.. స్పిన్నర్లు వచ్చేసరికి నెమ్మదిస్తున్నారు. ‘విరాట్ లాంటి వరల్డ్ నం.1 బ్యాటర్ ఇలా LBW అవ్వడం ఆశ్చర్యకరం. అతడు స్పిన్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయట్లేదేమో!’ అని పాక్ మాజీ ప్లేయర్ బాసిత్ అభిప్రాయపడ్డారు.
TG: రూ.500కే గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. గ్యాస్ రాయితీ సొమ్మును 2 రోజుల్లో వినియోగదారుల ఖాతాల్లో జమ చేయాలని CM రేవంత్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సబ్సిడీ డబ్బులు జమ అయ్యేందుకు నాలుగైదు రోజులు పడుతోంది. మరోవైపు ఈ స్కీం ప్రారంభించినప్పుడు 39.50 లక్షలుగా ఉన్న లబ్ధిదారులు ప్రజాపాలన కేంద్రాల్లో సవరణకు అవకాశం ఇవ్వడంతో తాజాగా 44.10 లక్షలకు చేరారు.
పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల వేటలో భారత్‌కు నిన్న తీవ్ర నిరాశ ఎదురైంది. మరోవైపు ఇవాళ రెండు పతకాల కోసం భారత్ బరిలో ఉంది. గత ఒలింపిక్స్ గోల్డ్ విన్నర్ నీరజ్ తిరిగి తన పతకాన్ని డిఫెండ్ చేసుకుంటారా లేదా అనేది ఇవాళ రాత్రి తేలనుంది. ఇక కాంస్యం కోసం భారత పురుషుల హాకీ జట్టు స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇవాళ్టి పూర్తి షెడ్యూల్ కోసం పైన చూడండి.
AP: విశాఖ స్థానిక సంస్థల <<13788692>>ఎమ్మెల్సీ<<>> ఉప ఎన్నికను వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వైఎస్ జగన్ నేరుగా MPTC, ZPTCలతో మాట్లాడుతున్నారు. నిన్న అరకు, పాడేరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారిని బెంగళూరుకు తరలించినట్లు సమాచారం. ఇవాళ పాయకరావుపేట, నర్సీపట్నం, అనకాపల్లి నేతలతో భేటీ అనంతరం వారిని కూడా క్యాంపునకు తరలిస్తారని తెలుస్తోంది.
AP: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ స్కూల్ మేనేజ్‌మెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఓటర్ల జాబితాలను పాఠశాలల్లో ప్రదర్శించారు. ఎన్నిక విధానం చేతులు ఎత్తడం లేదా చెప్పడం ద్వారా ఉంటుంది. ఎన్నికైన మొత్తం 15 మంది సభ్యుల్లో ఒకరిని ఛైర్మన్‌గా, మరొకరిని వైస్ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు. ఇవాళే ప్రమాణస్వీకారం చేసి తొలి కమిటీ సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులనూ నియమిస్తారు.
Sorry, no posts matched your criteria.