India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇవాళ WPL (వుమెన్స్ ప్రీమియర్ లీగ్) మినీ వేలం జరగనుంది. బెంగళూరులో మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది. వేలంలో 120 మంది క్రికెటర్లు ఉండగా, అందులో భారత్ నుంచి 92 మంది ఉన్నారు. మొత్తం 5 జట్లలో 19 స్లాట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. వేలంలో హీథర్ నైట్, లీ తహుహూ, డియోండ్ర డాటిన్, స్నేహ్ రాణా, పూనమ్ యాదవ్, వేద కృష్ణమూర్తి భారీ ధర పలికే అవకాశాలు ఉన్నాయి.
TG: ములుగు(D) వాజేడు SI హరీశ్ <<14767070>>ఆత్మహత్య<<>> కేసులో అనసూర్య అనే యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. సూర్యాపేటకు చెందిన ఆమె రాంగ్ కాల్ ద్వారా ఆయనకు పరిచయమైంది. తరచూ ఫోన్ చేస్తూ సాన్నిహిత్యం పెంచుకొని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసింది. హరీశ్ అందుకు నిరాకరించారు. తనను శారీరకంగా వాడుకున్నాడంటూ మీడియాకు, ఉన్నతాధికారులకు చెబుతానని ఆమె బెదిరించడంతోనే హరీశ్ రివాల్వర్‌తో కాల్చుకొని చనిపోయాడని పోలీసులు తెలిపారు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డారు. ఇన్నింగ్స్ 37వ ఓవర్ వేస్తుండగా ఆయన మోకాలి నొప్పితో బాధపడుతూ మైదానాన్ని వీడారు. ఆయన స్కానింగ్‌కు వెళ్తారా లేక మళ్లీ మైదానంలో అడుగుపెడతారా? అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ మ్యాచులో సిరాజ్ 10.2 ఓవర్లు బౌలింగ్ వేసి వికెట్లేమీ తీయలేదు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 94/3గా ఉంది.
AP: రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నీటి సంఘాల ఎన్నికలను NDA కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 6,149 సాగునీటి సంఘాల ఎన్నికలకు గానూ 5,946 సంఘాలకు ఎన్నికలు ముగిశాయి. వీటిలో 95 శాతం సంఘాలను కూటమి గెలుచుకుంది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ పూర్తైంది. సాగునీటి సంఘాల అధ్యక్షులు డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఛైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంది. పులివెందుల నియోజకవర్గంలోని మొత్తం 32 సంఘాలను TDP కైవసం చేసుకుంది.
TG: కేజీ ఉల్లిగడ్డ ధర మరో వారం, పది రోజుల్లో రూ.100కు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. వారం రోజుల కిందటి వరకు కేజీకి రూ.30-రూ.40గా ఉండగా ప్రస్తుతం రూ.70-రూ.80 పలుకుతోంది. రాష్ట్రంలో సాగు తగ్గడం, మార్కెట్లోకి సరిపడా ఉల్లిగడ్డ రావట్లేదని వ్యాపారులు అంటున్నారు. డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నాయని, వచ్చే 2, 3 నెలలు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని చెబుతున్నారు.
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు సీక్వెల్ లేదని సీనియర్ నటుడు శ్రీకాంత్ తెలిపారు. ఈ సినిమాలో ఆయన ఓ కీలక పాత్రలో నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఈ మూవీలో అప్పన్న పాత్రలో రామ్ చరణ్ నటన చూసి అందరూ షాక్ అవుతారు. చాలా కొత్తగా కనిపిస్తాడు. ఇందులో SJ సూర్య పాత్ర “సరిపోదా శనివారం” సినిమా క్యారెక్టర్‌ను మించి ఉంటుంది’ అని చెప్పారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2025 జనవరి 10న రిలీజ్ కానుంది.
WT20 WC తర్వాత భారత మహిళల జట్టు తొలి T20 సిరీస్‌కు సిద్ధమైంది. వెస్టిండీస్‌తో 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి గేమ్‌లో తలపడనుంది. ముంబై వేదికగా రా.7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో 0-3తో ఘోరంగా ఓడిపోయిన భారత్ ఇందులోనైనా రాణించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. టాప్ ఆర్డర్‌లో ఓపెనర్ స్మృతి మంధాన మినహా మిగతావారు పెద్దగా పరుగులు చేయకపోతుండటం జట్టును కలవరపెడుతోంది.
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. 2 రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి తమిళనాడు తీరం దిశగా రానుందని తెలిపింది. దీని ప్రభావంతో ఈనెల 17, 18 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్సుందని అంచనా వేసింది.
తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా విసురుతోంది. TGలోని ఉమ్మడి ADB జిల్లా బేలలో అత్యల్పంగా 6.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. APలో అల్లూరి జిల్లా కుంతలంలో 8.9 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో AP, TGలో చలి తీవ్రత కాస్త తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
ఉమెన్స్ హాకీ జూనియర్ ఆసియా కప్-2024 టైటిల్ కోసం ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్, చైనా జట్లు తలపడబోతున్నాయి. మస్కట్‌లో రాత్రి 8:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. హాకీ ఇండియా యాప్‌లో లైవ్ చూడవచ్చు. కాగా నిన్న జపాన్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో భారత జట్టు 3-1 తేడాతో విజయం సాధించింది. మరో సెమీ ఫైనల్‌లో సౌత్ కొరియాపై చైనా 4-1 తేడాతో గెలిచింది.
Sorry, no posts matched your criteria.