news

News February 10, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 10, 2025

శుభ ముహూర్తం (10-02-2025)

image

✒ తిథి: శుక్ల త్రయోదశి రా.7.23 వరకు
✒ నక్షత్రం: పునర్వసు రా.6.34 వరకు
✒ శుభ సమయం: ఉ.5.48-6.24, సా.7-సా.7.24 వరకు
✒ రాహుకాలం: ఉ.7.30 నుంచి ఉ.9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30 నుంచి మ.12.00 వరకు
✒ దుర్ముహూర్తం: మ.12.24-మ.1.12, మ.2.46-మ.3.34
✒ వర్జ్యం: ఉ.6.46 నుంచి ఉ.8.20 వరకు
✒ అమృత ఘడియలు: సా.4.16 నుంచి సా.5.50 వరకు

News February 10, 2025

TODAY HEADLINES

image

* దక్షిణాది రాష్ట్రాలకు మోదీ ప్రమాదకరం: రేవంత్
* తిరుమల కల్తీ నెయ్యి కేసులో నలుగురు అరెస్ట్
* కులగణన రీసర్వే చేస్తే సహకరిస్తాం: కేటీఆర్
* APలో ట్రాక్టర్ బోల్తా.. నలుగురు కూలీలు దుర్మరణం
* రోహిత్ సెంచరీ.. వన్డే సిరీస్ కైవసం చేసుకున్న భారత్
* మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా
* భారీ ఎన్‌కౌంటర్‌లో 31 మంది మావోల మృతి
* పైరసీ చేసిన, చూస్తున్న వాళ్లను వదిలిపెట్టం: నిర్మాత బన్నీవాసు

News February 10, 2025

వీరు త్వరగా ముసలోళ్లు కారు?

image

అన్ని రక్త వర్గాల్లో కంటే B బ్లడ్ గ్రూప్ వారు నెమ్మదిగా వృద్ధాప్యం పొందుతారని ప్లానెట్ టుడే సర్వే తెలిపింది. మిగతా గ్రూపులతో పోల్చుకుంటే ఈ గ్రూప్ వారు నెమ్మదిగా ముసలోళ్లుగా మారతారని పేర్కొంది. వీరి రక్తంలో కణాల పునరుత్పత్తి, కణజాల మరమ్మతులు మెరుగ్గా ఉండటం వల్ల యవ్వనంగా కనిపిస్తారని తెలిపింది. అలాగే వీరికి సుదీర్ఘ ఆయుర్దాయం కూడా ఉంటుందని వెల్లడించింది.

News February 10, 2025

రేపు మహా కుంభమేళాకు రాష్ట్రపతి

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపు మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. అనంతరం స్థానిక ఆలయంలో పూజలు చేస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రయాగ్ రాజ్‌లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.

News February 9, 2025

ఇంగ్లండ్ చెత్త రికార్డు

image

వన్డేల్లో ఇంగ్లండ్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. 300కు పైగా స్కోర్ చేసి అత్యధిక సార్లు పరాజయం పాలైన జట్టుగా నిలిచింది. 99 మ్యాచుల్లో 28 సార్లు ఇంగ్లండ్ ఓడింది. ఆ తర్వాతి స్థానాల్లో భారత్(27), వెస్టిండీస్(23), శ్రీలంక(19) ఉన్నాయి. వన్డే WC 2023 తర్వాత ఇంగ్లండ్‌కు ఇది వరుసగా నాలుగో సిరీస్ ఓటమి.

News February 9, 2025

మీ పిల్లలకు ఫోన్లు ఇస్తున్నారా? అయితే రిస్క్‌లో పడ్డట్లే…

image

మీ పిల్లలు ఏడుస్తున్నారని ఫోన్లు ఇస్తున్నారా.. అయితే వారికి మీరు కీడు చేసినట్లే. చిన్నపిల్లల్లో 6నెలల నుంచి మాటలు రావటం ప్రారంభమవుతుంది. చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తూనే వారు మాట్లాడటం నేర్చుకుంటారు. ఈ వయసులో ఫోన్లు ఇవ్వటం ద్వారా వాటినే చూస్తుంటారు. తద్వారా మూడేళ్ల దాకా మాటలు రాకపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు అంటున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఆటిజం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.

News February 9, 2025

తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం

image

AP: తిరుమల కల్తీ నెయ్యి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. నలుగురు నెయ్యి సరఫరాదారులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అదుపులోకి తీసుకుంది. ఇందులో ఏఆర్ డెయిరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్, పరాగ్ ఫుడ్స్ ప్రతినిధులు ఉన్నారు. వీరిని రేపు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. సీబీఐ జేసీ వీరేశ్ ప్రభు తిరుపతిలోనే ఉండి విచారణను వేగవంతం చేశారు.

News February 9, 2025

చైతూని చూసి గర్విస్తున్నా: నాగార్జున

image

తన కొడుకు నాగచైతన్య‌ను చూసి గర్విస్తున్నట్లు అక్కినేని నాగార్జున ట్వీట్ చేశారు. ‘తండేల్’ కేవలం సినిమా మాత్రమే కాదని, చైతూ డ్రీమ్, కృషికి నిదర్శనమని కొనియాడారు. ఈ చిత్రాన్ని అందించిన అల్లు అరవింద్, బన్నీ వాస్, దర్శకుడు చందూ మొండేటికి ధన్యవాదాలు తెలియజేశారు. తమ కుటుంబానికి మద్దతుగా ఉన్న అక్కినేని అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.

News February 9, 2025

సినిమా ఆఫర్.. మాజీ CM కూతురికి రూ.4 కోట్లు టోకరా

image

సినిమా ఆఫర్ ఇస్తామంటూ కొందరు ఉత్తరాఖండ్ మాజీ CM రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ కూతురు ఆరుషికి రూ.4 కోట్లకు టోకరా పెట్టారు. ముంబైకి చెందిన వరుణ్, మాన్సీలు నిర్మాతలమంటూ పరిచయం చేసుకున్నారు. విక్రమ్ మాస్సే హీరోగా తెరకెక్కించే మూవీలో కీలక పాత్రతో పాటు లాభంలో 20% షేర్ ఇస్తామని, పెట్టుబడి పెట్టాలని చెప్పారు. ఇది నమ్మి ఆమె విడతలవారీగా రూ.4 కోట్లు ఇచ్చారు. మూవీ ప్రారంభం కాకపోవడంతో మోసం చేశారని కేసు పెట్టారు.