news

News November 13, 2024

చంద్రబాబుకు అప్పు రత్న బిరుదు ఇవ్వాలి: జగన్

image

AP: చంద్రబాబు హయాంలో అప్పులు 19శాతం పెరిగితే, తాను సీఎంగా ఉన్న కాలంలో 15శాతం మాత్రమే పెరిగినట్లు YS జగన్ వెల్లడించారు. రూ.10 లక్షల కోట్లు, రూ.14లక్షల కోట్ల అప్పు అని తమపై తప్పుడు ప్రచారం చేసి, బడ్జెట్‌లో రూ.6లక్షల కోట్ల అప్పు మాత్రమే చూపించారని ఆరోపించారు. అంటే చంద్రబాబు, కూటమి నేతలు చేసిందంతా తప్పుడు ప్రచారం కాదా? అని ప్రశ్నించారు. అప్పు రత్న అనే బిరుదును చంద్రబాబుకు ఇవ్వాలని సెటైర్లు వేశారు.

News November 13, 2024

ALERT: రేపు భారీ వర్షాలు

image

AP: అల్పపీడనం బలహీనపడినప్పటికీ రేపు కొన్ని చోట్ల భారీ వర్షాలు, ఈనెల 15, 16 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA వెల్లడించింది. రేపు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, ATP, సత్యసాయి, TPTY జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, అల్లూరి, కోనసీమ, ప.గో, ఏలూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, YSR, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని తెలిపింది.

News November 13, 2024

కుట్రపూరితంగానే కలెక్టర్‌పై దాడి: భట్టి

image

TG: కుట్రపూరితంగానే కలెక్టర్‌పై BRS శ్రేణులు దాడి చేశాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని Dy CM భట్టి విక్రమార్క ఆరోపించారు. అమాయక గిరిజనులను రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పారని మండిపడ్డారు. పరిశ్రమల వల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ‘పరిశ్రమలు రావాలంటే భూసేకరణ జరగాల్సిందే. భూమి కోల్పోతున్నవారికి మెరుగైన ప్యాకేజీతో పాటు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పిస్తాం’ అని వెల్లడించారు.

News November 13, 2024

ఏపీ శ్రీలంక అవుతుందని దుష్ప్రచారం చేశారు: జగన్

image

APకి రూ.10లక్షల కోట్ల అప్పులున్నాయంటూ ఎన్నికల సమయంలో చంద్రబాబు తమపై తప్పుడు ప్రచారం చేశారని జగన్ ఆరోపించారు. ‘ఓ పద్ధతి ప్రకారం మా ప్రభుత్వంపై గోబెల్స్ ప్రచారం చేశారు. పరిమితికి మించి వైసీపీ అప్పులు చేసిందని అబద్ధాలు చెప్పారు. ఏపీ మరో శ్రీలంక అవుతుందని ముందు చంద్రబాబు మాట్లాడారు. ఆ తర్వాత పవన్, పురందీశ్వరి ఆయనకు వత్తాసు పలికారు. గవర్నర్‌తోనూ ప్రసంగంలో అబద్ధాలు చెప్పించారు’ అని జగన్ మండిపడ్డారు.

News November 13, 2024

కాసేపట్లో కోర్టుకు పట్నం నరేందర్ రెడ్డి

image

TG: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు కొడంగల్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఆయనను విడుదల చేయాలంటూ కోర్టుకు వెళ్లే దారిలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి. లగచర్లలో ఉన్నతాధికారులపై జరిగిన దాడిలో నరేందర్ కుట్ర ఉందన్న ఆరోపణలతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

News November 13, 2024

ఇది ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్: జగన్

image

AP:పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే చంద్రబాబు మోసాలు బయటకొస్తాయనే భయంతోనే ఇన్ని నెలల పాటు బడ్జెట్ ప్రవేశపెట్టలేదని YCP చీఫ్ జగన్ ఆరోపించారు. ‘ఇప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టేలా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా 4 నెలలు మాత్రమే ఉంటే ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్‌లో ఆమేరకు నిధులు కేటాయించేవారు. ప్రజలను మోసం చేసేలా బడ్జెట్ ఉంది’ అని మండిపడ్డారు.

News November 13, 2024

SENSEX 2 నెలల్లో 8000 పాయింట్లు డౌన్.. WHAT NEXT?

image

స్టాక్‌మార్కెట్లు బేరు బేరుమంటున్నాయి. జీవితకాల గరిష్ఠం నుంచి BSE సెన్సెక్స్ 2 నెలల్లోనే 8300 పాయింట్లు నష్టపోయింది. NSE నిఫ్టీ 26277 నుంచి 10% తగ్గింది. సూచీలు 20% తగ్గితే బేర్స్ గ్రిప్‌లోకి వెళ్లినట్టు భావిస్తారు. నిఫ్టీ 200 DMAను టచ్ చేయడం టెన్షన్ పెడుతోంది. ఇప్పటికే ₹1000Cr MCap మీదున్న 900 స్టాక్స్ 20% క్రాష్ అవ్వడంతో బేర్ మార్కెట్లోకి ఎంటరవుతున్నామని ఇన్వెస్టర్లు నిరాశ చెందుతున్నారు.

News November 13, 2024

స్కూళ్లకు కీలక ఆదేశాలు

image

AP: నవంబర్ 14న అన్ని స్కూళ్లల్లో నిర్వహించాల్సిన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ వాయిదా పడింది. ఈ మేరకు అన్ని స్కూళ్లకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ మొదటివారంలో ఈ కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తామని పేర్కొంది. త్వరలోనే కొత్త తేదీ, ఇతర వివరాలను వెల్లడిస్తామని చెప్పింది.

News November 13, 2024

‘పుష్ప-2’ సెకండ్ హాఫ్ డబ్బింగ్ మొదలెట్టిన రష్మిక

image

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సెకండ్ హాఫ్ డబ్బింగ్ స్టార్ట్ చేసినట్లు నటి రష్మిక ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తవగా అది అద్భుతంగా వచ్చింది. పూర్తి సినిమాను చూసేందుకు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు. కాగా, పట్నాలో ఈనెల 17న ట్రైలర్ ఈవెంట్‌ జరగనుంది.

News November 13, 2024

అభిషేక్ శర్మకు చావో రేవో: చోప్రా

image

భారత ఓపెనర్ అభిషేక్ వైఫల్యాలపై కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆల్రెడీ గిల్, జైస్వాల్ ఓపెనింగ్ స్థానం కోసం రెడీగా ఉన్నారు. 2 సెంచరీలతో శాంసన్ తన స్థానాన్ని ఖరారు చేసుకున్నట్లే. కానీ అభిషేక్ మాత్రం జింబాబ్వేపై సెంచరీ తప్పితే ఏ మ్యాచ్‌లోనూ 3వ ఓవర్ దాటి ఆడట్లేదు. ఈ సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లు అతడికి చావో రేవో. ఛాన్సులు అందిపుచ్చుకోకుంటే జట్టులో మళ్లీ చోటు దక్కదు’ అని హెచ్చరించారు.