India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ఇప్పటికే 14 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ నేడు మిగిలిన మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ స్థానాలపై కాంగ్రెస్ గతకొంతకాలంగా తర్జనభర్జన పడుతోంది. నేడు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశం అనంతరం దీనిపై తుది ప్రకటన వచ్చే అవకాశం ఉంది. సాయంత్రం గం.6.30కు శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఈ మీటింగ్ జరగనుంది.
అయోధ్య రామమందిరం ఊపులో యూపీలోని 80 లోక్‌సభ సీట్లూ గెలవాలనుకుంటున్న బీజేపీకి పశ్చిమ యూపీ తలనొప్పిగా మారింది. గతంలో ఇక్కడ బీజీపీకి మద్దతు వచ్చినా ఈసారి ఆ పరిస్థితి లేదు. రాజ్‌పుత్, త్యాగీ, సైనీ వర్గాలు అసంతృప్తితో ఉండటమే కారణం. ముఖ్యంగా తమ వర్గానికి తక్కువ సీట్లు కేటాయించడంపై రాజ్‌పుత్‌లు పెదవి విరుస్తున్నారట. మరోవైపు ఈ వ్యతిరేకతను క్యాష్ చేసుకునేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. <<-se>>#Elections2024<<>>
స్టేజ్-4 క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ మహిళను ఆఫీసుకు రమ్మని ఆమె పనిచేసే కంపెనీ బాస్ లేఖ రాయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలు ఎంత ఫిట్‌గా ఉందో తెలుసుకునేందుకు వైద్యుల నుంచి లేఖ తేవాలని ఆమె కోరింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా ఓ మహిళ అయ్యి ఉండి తోటి మహిళతో ఇలా ప్రవర్తించడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. క్యాన్సర్ బాధితురాలనే కనికరం లేకుండా ఆఫీసుకు రమ్మనడం సరికాదని మండిపతున్నారు.
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ PC ఘోష్ నేతృత్వంలో ఈనెల 24 నుంచి న్యాయ విచారణ ప్రారంభంకానుంది. నాలుగు రోజుల పాటు విచారణ జరగనుందని సమాచారం. ఈనెల 25న మేడిగడ్డ ప్రాజెక్టును జస్టిస్ ఘోష్ సందర్శించనున్నారు. విచారణలో పలువురికి సమన్లు జారీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కమిషన్.. న్యాయవాదులు, బ్యారేజీలకు సంబంధించిన సాంకేతిక సిబ్బంది, నిపుణులను నియమించుకోనుంది.
తమను కాదని విదేశీ సంస్థలు భారత్‌వైపు మొగ్గుచూపడంపై చైనా అక్కసువెళ్లగక్కింది. ఎలాన్ మస్క్ భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీని స్థాపించేందుకు ఆసక్తి కనబర్చడాన్ని డ్రాగన్ తప్పుపట్టింది. ‘భారత్‌లో టెస్లా తయారీ ప్లాంట్ స్థాపిస్తే అది వర్కౌట్ కాకపోవచ్చు. స్థిరత్వం లేని, ఇంకా పూర్తిగా వృద్ధి చెందని మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం తొందరపాటు చర్య అవుతుంది’ అని చైనా అధికారిక పత్రిక ది గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు ప్రారంభించినట్లు అమెరికా వెల్లడించింది. ఈ దాడుల నేపథ్యంలో పొరుగు దేశాలైన ఇరాక్, జోర్డాన్ అప్రమత్తమయ్యాయి. ఇరాక్ ఇప్పటికే తమ గగనతలాన్ని క్లోజ్ చేయగా, ఏదైనా ఇరాన్ విమానం తమ గగనతలంలోకి ప్రవేశిస్తే కూల్చివేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జోర్డాన్ ప్రకటించింది. సిరియాలోని తమ ఎంబసీపై దాడికి ప్రతీకారంగా ఏ క్షణమైనా ఇజ్రాయెల్ దాడికి దిగుతామని ఇటీవల ఇరాన్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.
లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో సంపన్న అభ్యర్థిగా మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ కుమారుడు నకుల్‌నాథ్ నిలిచారు. 2019లో కాంగ్రెస్ తరఫున ఛింద్వాడాలో గెలిచి ఇప్పుడు మరోసారి పోటీకి దిగిన నకుల్ సంపద రూ.716కోట్లు అని ADR వెల్లడించింది. ఆ తర్వాత స్థానంలో రూ.662కోట్లతో AIADMK నేత అశోక్ కుమార్, రూ.206 కోట్లతో BJP నేత మాల రాజ్యలక్ష్మీ షా, రూ.159కోట్లతో BSP అభ్యర్థి మజీద్ అలీ ఉన్నారు. <<-se>>#Elections2024<<>>
బెంగళూరు సౌత్ నుంచి మరోసారి బరిలో నిలిచిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య సంపద భారీగా పెరగడం చర్చనీయాంశమైంది. 2019లో రూ.13.46లక్షలుగా ఉన్న ఆయన సంపద ఐదేళ్లలో 30రెట్లు పెరిగి రూ.4.10కోట్లకు చేరింది. అయితే ఇందుకు కారణం స్టాక్ మార్కెట్లేనని సూర్య చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో పెట్టుబడులు కొనసాగిస్తున్నానని, ఇవే తన సంపద పెరిగేలా చేశాయన్నారు.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్‌గా మరోసారి క్రిస్టాలినా జార్జివా ఎన్నికయ్యారు. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి ఐదేళ్ల పాటు ఎండీగా రెండో టర్మ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆమె నాయకత్వంలో ఎన్నో ఒడుదొడుకులను దీటుగా ఎదుర్కొన్నామని ప్రశంసిస్తూ బోర్డు క్రిస్టాలినాను ఏకగ్రీవంగా ఎన్నుకుంది. కాగా మరోసారి IMF MD బాధ్యతలు అందుకోవడంపై క్రిస్టాలినా హర్షం వ్యక్తం చేశారు.
ఖతర్‌తో T20లో ఓవర్‌లో 6 <<13046401>>సిక్సర్లు<<>> బాదిన దీపేంద్ర సింగ్(నేపాల్) పేరు నెట్టింట మారుమోగుతోంది. అతను 2023లో మంగోలియాతో మ్యాచ్‌లోనూ వరుసగా తాను ఎదుర్కొన్న 6 బంతుల్లో 6 సిక్సులు కొట్టారు. అయితే అది రెండు ఓవర్ల మధ్య జరిగింది. 18వ ఓవర్ చివరి 5 బంతులకు దీపేంద్ర సిక్సులు కొట్టారు. 19వ ఓవర్ మొదటి బంతికి కుశాల్ సింగిల్ తీయగా, రెండో బంతికి దీపేంద్ర మళ్లీ సిక్సర్ బాదారు.
Sorry, no posts matched your criteria.