news

News February 8, 2025

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలింది: హరీశ్ రావు

image

TG: మొన్న హరియాణా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ పాత్ర అమోఘం అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. తాజాగా ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గాడిద గుడ్డు మిగిలిందన్నారు. తప్పులు ఒప్పుకొని, ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణన మళ్లీ చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాలన్నారు. లేకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

News February 8, 2025

ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు

image

1. యాపిల్ – $3.45 ట్రిలియన్ (అమెరికా)
2. మైక్రోసాఫ్ట్ – $3.06 ట్రిలియన్ (అమెరికా)
3. ఎన్‌విడా – $2.98 ట్రిలియన్ (అమెరికా)
4. అమెజాన్ – $2.47 ట్రిలియన్ (అమెరికా)
5. ఆల్ఫాబెట్ – $2.33 ట్రిలియన్ (అమెరికా)
6. మెటా ప్లాట్‌ఫారమ్‌లు – $1.79 ట్రిలియన్ (అమెరికా)
7. సౌదీ అరామ్‌కో – $1.79 ట్రిలియన్ (సౌదీ అరేబియా)
8. టెస్లా – $1.23 ట్రిలియన్ (అమెరికా)

News February 8, 2025

ఢిల్లీని కమ్మేసి.. AAPను ఊడ్చేసిన కమలం

image

ఢిల్లీ ఎన్నికల్లో BJP ఆధిక్యంలో దూసుకెళ్తోంది. 27 ఏళ్ల తర్వాత అక్కడ అధికారాన్ని చేపట్టడానికి వ్యూహాలు రచించింది. ఢిల్లీని ఆనుకొని ఉన్న హరియాణా, UP, రాజస్థాన్‌లో రూలింగ్‌లో ఉండటం, కేంద్రంలోనూ హ్యాట్రిక్ పాలన కొనసాగించడం కమలం పార్టీకి బాగా కలిసొచ్చింది. 2017 నుంచి UPలో, 2023 నుంచి రాజస్థాన్, హరియాణాలో గతేడాది కమలం 2వసారి మళ్లీ అధికారంలోకి రావడంతో కాషాయం శ్రేణులు హస్తిన ఓటర్లను ప్రభావితం చేయగలిగారు.

News February 8, 2025

కేరళ క్రికెట్ సంఘంపై శ్రీశాంత్ ఆగ్రహం

image

కేరళ క్రికెట్ అసోసియేషన్(KCA)కు, మాజీ బౌలర్ శ్రీశాంత్‌కు మధ్య వివాదం ముదురుతోంది. విజయ్ హజారే ట్రోఫీకి KCA సంజూని సెలక్ట్ చేయకపోవడం వల్లే అతడికి ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాన్స్ దక్కలేదని శ్రీశాంత్ ఇటీవల ఆరోపించారు. ఆ ఆరోపణల్ని తిప్పికొట్టిన కేసీఏ, ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా అండగా నిలిచామని గుర్తుచేసింది. దానిపై స్పందించిన శ్రీశాంత్, తన పరువు తీసిన వారు తగిన జవాబు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు.

News February 8, 2025

ఢిల్లీ కోటపై కాషాయ జెండా

image

27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగిరింది. కేంద్రంలో మూడు పర్యాయాలుగా బీజేపీ అధికారం చేపడుతున్నా హస్తిన పీఠం దక్కకపోవడం ఆ పార్టీకి వెలితిగా ఉండేది. కానీ ఇవాళ ఆ కోరిక తీరింది. అద్భుతమైన రాజకీయ వ్యూహాలతో ఆప్ కంచుకోటను బద్దలుకొట్టిన కమలదళం దేశ రాజధానిలో పాగా వేసింది. ఆప్ అధినేత కేజ్రీవాల్, మనీశ్ సిసోడియాను సైతం ఓడించి కోలుకోలేని దెబ్బకొట్టింది.

News February 8, 2025

ఎవరీ పర్వేశ్ వర్మ?

image

ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్వేశ్ వర్మ మట్టికరిపించిన విషయం తెలిసిందే. జాట్ సామాజిక వర్గానికి చెందిన 47 ఏళ్ల పర్వేశ్ ఢిల్లీ మాజీ CM సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. 2013లో మెహరౌలీ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. 2014- 2024 వరకు వెస్ట్ ఢిల్లీ MPగా పనిచేశారు. కేజ్రీవాల్‌పై గెలుపు నేపథ్యంలో ఈయన పేరును CM అభ్యర్థిగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

News February 8, 2025

KK సర్వేకు బిగ్ షాక్

image

AP ఎన్నికలపై ఎగ్జాక్ట్ ఫిగర్‌కు దగ్గరగా ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించిన KK సర్వే ఇటీవల తేలిపోతోంది. ఢిల్లీలో AAPకు అధికారం వస్తుందని, ఆ పార్టీ 44 సీట్లు గెలుస్తుందని ఇటీవల ఈ సర్వే అంచనా వేసింది. కానీ ఫలితాల్లో AAP 22, BJP 48 చోట్ల లీడ్‌లో ఉన్నాయి. అటు 2024 హరియాణా ఎన్నికలపై ఈ సర్వే(INC-75, BJP-11) అంచనా ప్రకటించగా, అసలు ఫలితాల్లో BJP(48) గెలిచింది. దీంతో ఎగ్జిట్‌పోల్స్ క్రెడిబిలిటీ చర్చగా మారింది.

News February 8, 2025

Breaking: ఢిల్లీ సీఎం ఆతిశీ విజయం

image

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ఆద్మీ పార్టీకి స్వల్ప ఊరట. ఢిల్లీ సీఎం ఆతిశీ మార్లేనా 3521 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కల్కాజీ నుంచి పోటీ చేసిన ఆమె సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత రమేశ్ బిధూరీని ఓడించారు. 9 రౌండ్లు ముగిసే సరికి 252 ఓట్ల వెనుకంజలో ఉన్న ఆమె పదో రౌండులో 989 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఆఖరిదైన 12వ రౌండ్ ముగిసే సరికి 3521 ఓట్ల ఆధిక్యం అందుకున్నారు. కేజ్రీ, సిసోడియా ఓడినా ఆతిశీ గెలవడం గమనార్హం.

News February 8, 2025

BJPకి అండగా ముస్లిం మహిళలు!

image

ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం సాధించడం వెనక ముస్లిం మహిళల పాత్ర ఉందని విశ్లేషకులు అంటున్నారు. ట్రిపుల్ తలాక్, సెంట్రల్ స్కీమ్స్ ఇందుకు దోహదం చేశాయని చెప్తున్నారు. ఆ మతంలోని పశుమందా వంటి వెనకబడిన వర్గాలు అండగా నిలిచాయని అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, ఆప్ తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయన్న IUML ప్రెసిడెంట్ తొలిసారి బీజేపీకి ఓటేయడం, అనుచరులను ప్రభావితం చేయడమూ కలిసొచ్చిందని అంటున్నారు.

News February 8, 2025

‘లైలా’కు A సర్టిఫికెట్: విశ్వక్ సేన్

image

తన తాజా సినిమా ‘లైలా’కు సెన్సార్ బోర్డు ‘A’(పెద్దలకు మాత్రమే) సర్టిఫికెట్ ఇచ్చిందని హీరో విశ్వక్ సేన్ వెల్లడించారు. మూవీ చూస్తే ‘A’ సర్టిఫికెట్ ఎందుకో అర్థమవుతుందని పేర్కొన్నారు. ‘ప్రేక్షకులు రొటీన్ మూవీస్‌ని చూడటం లేదు. అందుకే ఇలాంటి విచిత్రమైన కథను సెలక్ట్ చేశాం. డైరెక్టర్ నాకు కథ చెప్పినప్పుడు నవ్వుతూనే ఉన్నాను. కానీ లేడీ గెటప్ వేయడమే కష్టంగా అనిపించింది’ అని స్పష్టం చేశారు.