India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పారిస్ ఒలింపిక్స్‌లో బ్రిటన్‌తో జరిగిన QFలో భారత హాకీ జట్టు కీలక ప్లేయర్ అమిత్ రోహిదాస్‌కు రిఫరీ జోషువా బర్ట్ రెడ్ కార్డ్ చూపించిన సంగతి తెలిసిందే. రిఫరీ సిఫార్సుతో అమిత్‌పై SF మ్యాచ్ ఆడకుండా సస్పెన్షన్ వేటు కూడా పడింది. కాగా ఈ రిఫరీ బాలీవుడ్ మూవీ ‘చక్ దే ఇండియా’లో AUS టీమ్‌కు కోచ్‌గా నటించారు. సినిమాలో విలన్ అయిన అతను, రియల్‌గానూ భారత జట్టుకు విలన్ అయ్యాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
AP: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోస్టులు ఖాళీగా ఉన్న చోట చదువు నాణ్యత దెబ్బతినకుండా విద్యా వాలంటీర్లను నియమించుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఏదో ఒక స్కూల్‌లో ఉండేలా చూడాలని, ఆ తర్వాత వారిని ప్రభుత్వ బడిలోకి తీసుకురావడంపై ఆలోచించొచ్చని తెలిపారు. పిల్లలపై ఒత్తిడి లేకుండా విజ్ఞాన, విహార యాత్రలు, క్రీడలు నిర్వహించాలన్నారు.
బ్రిటన్‌లో రాజకీయ ఆశ్రయం పొందేందుకు అనుమతి లభించే వరకు బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విషయంలో యూకే నుంచి ఇప్పటిదాకా ఎలాంటి అనుమతి లభించలేదని డైలీ సన్ తెలిపింది. ఆమెకు తాత్కాలిక ఆశ్రయం కల్పించిన భారత్ రవాణా సహా ఇతరత్రా లాజిస్టికల్ సపోర్ట్ అందిస్తోంది. ప్రస్తుతం హసీనాతో ఆమె సోదరి రెహానా ఉన్నారు.
TG: రుణమాఫీ జరగడంతో రెన్యువల్ కోసం రైతులు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. తాకిడి పెరగడంతో HNK జిల్లా పరకాలలో బ్యాంకు అధికారులు టోకెన్ల సిస్టమ్ అమలు చేస్తున్నారు. దీంతో పలువురు రైతులు మొన్న రాత్రి బ్యాంకు వద్దే నిద్రపోయి, నిన్న ఉదయాన్నే ముందుగా లైన్‌లో నిలబడ్డారు. ఈనెల 15 వరకే లోన్ల రెన్యువల్ వర్తిస్తుందనే అపోహతో రైతులు భారీగా వస్తున్నారని, దీనికి ఎలాంటి గడువు లేదని అధికారులు స్పష్టం చేశారు.
షేక్ హసీనా 2009లో రెండోసారి పగ్గాలు చేపట్టాక చేసిన ప్రతీకార రాజకీయాలు ఆమె పతకానికి నాంది పలికాయి. 1971 యుద్ధ నేరాల కేసులను తిరగదోడి, విపక్ష నేతలు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించి, వారిని జైళ్లకు పంపారు. వీటికి తోడు దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, నిరుద్యోగం, హింస పెరిగిపోవడం లాంటి కారణాలు ప్రజల్లో తిరుగుబాటుకు దారితీశాయి.
ఒలింపిక్స్‌లో సూపర్ ఫామ్‌తో దూసుకెళ్తున్న భారత హాకీ జట్టు నేడు జర్మనీతో సెమీఫైనల్స్‌లో తలపడనుంది. బలాబలాల పరంగా ఇరు జట్లు మధ్య పెద్దగా తేడా ఏమీ లేదు. ఫైనల్స్ లక్ష్యంతో హర్మన్ ప్రీత్ సేన ధీమాగా బరిలోకి దిగుతోంది.
కీలక డిఫెండర్ అమిత్ సస్పెన్షన్ వేటుతో దూరం కావడం భారత్‌కు కాస్త ఇబ్బంది కలిగించే అంశం. గెలిచిన జట్టు NED లేదా స్పెయిల్‌తో ఫైనల్లో తలపడుతుంది. చివరిగా 1980లో భారత జట్టు ఫైనల్ చేరింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఆల్ టైం హైలో ఉన్న పరిస్థితుల్లో ప్రైస్ కరెక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నందునా ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అమెరికా మాంధ్యం భయాలు, ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణ, వడ్డీ రేట్ల పెంపు, ఎన్నికలు ముగియడం, కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం, కార్పొరేట్ ఫలితాల వెల్లడి వల్లే ప్రైస్ కరెక్షన్ అవుతున్నట్టు కనిపిస్తోంది.
TG: HYDలోని ఉస్మానియా, గాంధీ హాస్పిటళ్లలో అందించే వైద్య సేవలను ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రుల్లో అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పలువురు సీనియర్ డాక్టర్లను జిల్లా ఆస్పత్రులకు బదిలీ చేసింది. అన్ని ఆస్పత్రుల్లో MRI, సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తేనుంది. ఇందుకోసం మెషీన్ల కొనుగోలుకు ఆదేశాలిచ్చింది. సిటీలోని ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను వారం రోజుల్లో భర్తీ చేస్తామని తెలిపింది.
TG: రూ.2 లక్షల రైతు రుణమాఫీ ప్రక్రియను ఈ నెలలోనే పూర్తిచేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేశామని, టెక్నికల్ సమస్యలతో పెండింగ్‌లో ఉన్న వాటిని కూడా పూర్తి చేస్తామన్నారు. బస్సు సౌకర్యం లేని గ్రామాలకు సర్వీసులు ప్రారంభిస్తామని, HYDలో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులే నడిపేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
ఏపీలో గత ఐదేళ్లలో 4,84,249 చెట్లు నరికేసినట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఇందులో పట్టాదారు భూముల్లో 2,44,830, మళ్లించిన అటవీ భూముల్లో 1,35,023 చెట్లు, చట్టవిరుద్ధంగా 1,04,396 చెట్లను తొలగించినట్లు వెల్లడించారు. అత్యధికంగా తిరుపతి జిల్లాలో చట్టబద్ధంగా 61,964, చట్టవిరుద్ధంగా 40,349 చెట్లు నరికేసినట్లు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.