India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: CM చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మరో 20 హోటళ్లను ఏర్పాటు చేసేందుకు చంద్రశేఖరన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. రూ.40వేల కోట్లతో టాటాపవర్ సోలార్, విండ్ ప్రాజెక్టులు, విశాఖలో TCS ద్వారా 10వేల ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. భేటీలో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు.
AP: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించే గడువు తేదీని పొడిగించారు. మార్చిలో ఫస్ట్, సెకండియర్ పరీక్షలు రాసే విద్యార్థులు నవంబర్ 21వరకు ఎటువంటి ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చని అధికారులు పేర్కొన్నారు. రూ.1,000 ఫైన్‌తో డిసెంబర్ 5 వరకు ఫీజు కట్టొచ్చన్నారు. తొలుత అక్టోబరు 21 నుంచి నవంబర్ 11 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. మరోసారి గడువు పెంచే ఆస్కారం లేదని అధికారులు స్పష్టం చేశారు.
JSW Holdings షేరు ధర 4 రోజుల్లో 70% పెరిగి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ ఏడాది Jan-Aug వరకు ₹5K-₹8K మధ్య కరెక్షన్ అవుతూ కన్సాలిడేటైన షేరు తాజాగా ₹16,978కి చేరుకుంది. దీంతో అధిక Volatilityకి అవకాశం ఉండడంతో BSE, NSE ఈ స్టాక్‌పై నిఘా పెట్టాయి. ట్రేడింగ్ యాక్టివిటీపై ఎక్స్‌ఛేంజ్‌లు వివరణ కోరాయి. మార్కెట్ ఆధారిత ట్రేడింగ్ వాల్యూమ్ కాబట్టి సంస్థ స్పందించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమృత్ పథకంలో అక్రమాలకు పాల్పడిందని ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ ఆయన బావమరిది సృజన్‌కు లాభం చేకూరేలా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ కేటీఆర్ గతంలోనే ఖట్టర్‌కు లేఖ రాశారు. ఇప్పుడు నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు.
ఇండియాలో గత నెలలో అత్యంత కాలుష్య నగరాల జాబితాను CREA విడుదల చేసింది. అందులో ఢిల్లీ రీజియన్‌కు చెందిన నగరాలే టాప్-10లో ఉండటం గమనార్హం. తొలిస్థానంలో ఢిల్లీ ఉండగా తర్వాతి స్థానాల్లో ఘజియాబాద్, ముజఫర్‌నగర్, హాపూర్, నోయిడా, మీరట్, చర్ఖీ దాదరీ, గ్రేటర్ నోయిడా, గుర్గావ్, బహదుర్గఢ్ ఉన్నాయి. కాగా, హైదరాబాద్‌లోనూ ఎయిర్ క్వాలిటీ పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.
స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేశామని, అలాంటిది ED, CBI దాడులకు భయపడబోమని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే స్పష్టం చేశారు. మోదీ ఆదేశానుసారంగానే ఈ దాడులు జరుగుతున్నాయని ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు. ‘విడిపోతే తుడిచిపెట్టుకుపోతాం’ అని యోగీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ నిజమైన యోగీ ఎవరూ ఇలా మాట్లాడరన్నారు. రాజీవ్ హంతకులను సోనియా, ప్రియాంక క్షమించారని, కరుణ అంటే ఇదే అన్నారు.
AP: ప్రశ్నిస్తామన్న భయంతోనే YCPకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని YS జగన్ అన్నారు. YCP ఎమ్మెల్సీలతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విధానాలపై నిలదీయాలని వారికి సూచించారు. ‘అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మనమే. 40% ఓటు షేర్ సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. అందుకే ప్రతిరోజూ మీడియా ద్వారా పూర్తి వివరాలు, ఆధారాలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం’ అని తెలిపారు.
AP: సీఎం చంద్రబాబును తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) ఛైర్మన్ బీఆర్ నాయుడు సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి సీఎంను కలిసిన ఆయన తిరుమలలో చేపట్టనున్న పలు కార్యక్రమాలను వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లను ఆయన కలిసి శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు. నవంబర్ 6న TTD ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
మారుతీ సుజుకీ నుంచి సరికొత్త డిజైర్ కారు లాంచ్ అయింది. మూడవ తరం సెడాన్ సెగ్మెంట్‌లో ఫస్ట్ క్లాస్ ఫీచర్లతో మెరుగైన శైలి, సామర్థ్యం, సేఫ్టీతో Dzire కారును అందుబాటులోకి తీసుకొచ్చారు. మొత్తం 9 రకాల వేరియంట్స్ ఉండగా కొన్నింటికి సన్ రూఫ్ కూడా ఉండనుంది. కాగా, కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌తో సేఫ్టీకి, 24.79kmplతో మైలేజ్‌కి అధిక ప్రాధాన్యత నిచ్చింది. LXI వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర 6,79,000లుగా నిర్ణయించారు.
AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇది రాబోయే 2 రోజుల్లో తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉందంది. దీని ప్రభావంతో రేపు ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.