India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏదైనా సినిమా ₹100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందంటే దాన్నో విశేషంగా చెప్పుకొనే వాళ్లం. ఇప్పుడు పరిస్థితి మారింది. సినిమా ₹వెయ్యి కోట్లదా? కాదా? అని అందరూ చర్చించుకుంటున్నారు. తాజాగా ఆ మార్క్ చేరుకున్న 8వ చిత్రంగా <<14851893>>పుష్ప-2<<>> నిలిచింది. అంతకుముందు దంగల్, బాహుబలి-2, RRR, KGF-2, జవాన్, పఠాన్, కల్కీ సినిమాలు ఈ ఘనత సాధించాయి. ఈ 8లో 4 మన తెలుగు చిత్రాలే ఉండడం విశేషం.
AP: రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్ట్ అయిన విజయ్ పాల్‌ను రెండు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 13, 14 తేదీల్లో ఆయన్ను విచారించనున్నారు. విజయపాల్ ప్రస్తుతం గుంటూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామను గత ప్రభుత్వ హయాంలో కస్టడీలో చిత్రహింసలు పెట్టారన్న కేసులో CID మాజీ అదనపు ఎస్పీ విజయపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో వేధింపులపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్‌లైన్ వేదికగా మహిళలను వేధింపులకు గురి చేసిన వారిపై BNS సెక్షన్ 78 ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో కేంద్ర సమాచార శాఖ బదులిచ్చింది. సైబర్ నేరాలపై కూడా BNS చట్టాన్ని ఆశ్రయించవచ్చని పేర్కొంది.
BGT 3వ టెస్టు బ్రిస్బేన్ వేదికగా 14న ప్రారంభం కానుంది. అయితే 14-16 వరకు బ్రిస్బేన్‌లో వర్షాలు పడే అవకాశముందని weather.com తెలిపింది. ఇది సిరీస్‌లో తిరిగి పుంజుకోవడానికి ఉన్న ఇండియా అవకాశాలను దెబ్బతీస్తుందని చెప్పింది. ఫ్యాన్స్ 5రోజులు మ్యాచ్ చూసే అవకాశం ఉన్నా.. వర్షం వల్ల ఎక్కువ అంతరాయాలు కలుగుతాయంది. అటు, పిచ్‌లో బౌన్స్ ఉంటుదని, సాధారణంగా గబ్బా ఎప్పుడూ ఫాస్ట్ వికెట్టే అని క్యూరేటర్ చెప్పారు.
చలికాలంలో సాధారణంగా నీరు పెద్దగా తాగాలనిపించదు. ఇలాగైతే సమస్యలొస్తాయని, కాలం ఏదైనా శరీరానికి నీరు అవసరమని వైద్యులు చెబుతున్నారు. నీటి % తక్కువైతే డీహైడ్రేట్ అయి పొడిచర్మం, అలసట, తలనొప్పి వస్తాయంటున్నారు. ప్రత్యామ్నాయంగా జ్యూస్, వాటర్ కంటెంట్ ఎక్కువుండే పండ్లు తీసుకోవచ్చని సూచిస్తున్నారు. అలాగే, శీతాకాలం చెమట పట్టక శరీరం నుంచి ఉప్పు బయటకు వెళ్లదు. అందుకే ఆహారంలో ఉప్పు తగ్గించాలని చెబుతున్నారు.
ఈ ఏడాది అత్యధికంగా సెర్చ్ చేసిన భారతీయ సినిమాల లిస్ట్‌ను గూగుల్ ట్రెండ్స్ రిలీజ్ చేసింది. ఇందులో శ్రద్ధాకపూర్ నటించిన ‘స్త్రీ2’ తొలి స్థానంలో నిలిచింది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా రూ.700 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో కల్కి 2898AD, 12TH FAIL, లాపతా లేడీస్, హనుమాన్, మహారాజ, మంజుమ్మల్ బాయ్స్, గోట్, సలార్, ఆవేశం టాప్-10లో నిలిచాయి.
AP: రాష్ట్రంలో హెల్మెట్ నిబంధన అమలు కావట్లేదని పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్ ధరించకపోవడం వల్ల 667 మంది మరణించినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. దీంతో హెల్మెట్ నిబంధన ఎందుకు అమలు చేయట్లేదు? అని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ మరణాలకు బాధ్యత ఎవరిది? అని సీరియస్ అయింది. దీనిపై వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
FB, ఇన్‌స్టా, వాట్సాప్ సేవలు <<14854292>>డౌన్<<>> అవ్వడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఈ యాప్‌ల మాతృసంస్థ మెటా స్పందించింది. తమ అప్లికేషన్లను కొందరు వినియోగదారులు యాక్సెస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నట్లు తెలిసిందని పేర్కొంది. సాంకేతిక సమస్య వల్ల ఇలా జరిగిందని, వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు తెలిపింది. అసౌకర్యం కలిగించినందుకు క్షమాపణలు కోరింది.
స్పేస్ ఎక్స్, టెస్లా CEO మస్క్ సంపద 400 బి.డాలర్లు దాటింది. దీంతో ఆయన ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి వ్యక్తిగా నిలిచారు. స్పేస్‌ఎక్స్ ఇన్‌సైడర్ షేర్ ట్రేడింగ్, అగ్రరాజ్య ఎన్నికల్లో ఆయన మద్దతిచ్చిన ట్రంప్ విజయం సంపదను అమాంతం పెంచాయి. ప్రస్తుతం మస్క్ సంపద 439.2 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బర్గ్ బిలీనియర్ సూచీ తెలిపింది. అమెరికా ఎన్నికల ముందు నుంచి ఇప్పటివరకు టెస్లా షేర్లు 65% పెరిగాయంది.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.