India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

స్టాక్ మార్కెట్‌లో విజయం సాధించడం అందరికీ సాధ్యం కాదు. కానీ సరిగ్గా ఇన్వెస్ట్ చేస్తే ఇలా ఉంటుంది. ఐదేళ్ల క్రితం 10వేల డాలర్లు(రూ.8.7లక్షలు) సేవింగ్స్ అకౌంట్‌లో భద్రపరిస్తే అది రూ.8.96 లక్షలు అయ్యేది. అదే డబ్బును స్టాక్ మార్కెట్‌లో Nvidiaలో ఇన్వెస్ట్ చేస్తే $285,000 (రూ.2.4కోట్లు), Bitcoinలో చేస్తే $220,000, Teslaలో చేస్తే $139,000 అయ్యేవి.
నోట్: ఇన్వెస్ట్ చేసే ముందు నిపుణుల సలహాలు పాటించాలి.

నాగచైతన్య-సాయిపల్లవి జంటగా నటించిన తండేల్ మూవీని పైరసీ వెంటాడింది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఒక్కరోజు పూర్తికాకుండానే ఆన్‌లైన్ HD ప్రింట్ అందుబాటులోకి రావడంతో అభిమానులు, ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఇది చాలా బాధాకరమని, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కాపాడాలంటూ సినీవర్గాలు సైతం పైరసీని ఖండిస్తూ ట్వీట్స్ చేస్తున్నాయి. దీనిపై మేకర్స్ స్పందించాల్సి ఉంది. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి.

నీట్- యూజీ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి మార్చి 7 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ప్రకటించింది. మే 4న పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి NTA ఈ పరీక్ష నిర్వహించనుంది.

AP: మాజీ సీఎం మరీ దిగజారి ప్రవర్తిస్తున్నారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. క్యారెక్టర్ ఏంటో ఆయన మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ‘వైఎస్ బిడ్డ, తోడబుట్టిన చెల్లి అని కూడా చూడకుండా విజయసాయిరెడ్డితో నా క్యారెక్టర్‌పై నీచంగా మాట్లాడించారు. వైఎస్ కోరికలకు విరుద్ధంగా అబద్ధం చెప్పాలని విజయసాయిపై ఒత్తిడి తీసుకువచ్చి చెప్పించారు. ఇదీ జగన్ మహోన్నత వ్యక్తిత్వం’ అని ఆమె ఫైర్ అయ్యారు.

AP: రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 20న భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం జరగనుంది. సమావేశంలో చర్చించాల్సిన ప్రతిపాదనలను 18వ తేదీ సాయంత్రంలోగా పంపాలని సీఎస్ కార్యాలయం మంత్రులకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనుండగా, 28న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

అయోధ్య రాముడి దర్శనం ఉదయం 6గంటల నుంచే ప్రారంభించనున్నట్లు శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. ఇప్పటి వరకూ ఉదయం 7గంటలకు ఆలయాన్ని తెరుస్తుండగా.. భక్తులు అధికంగా వస్తుండటంతో దర్శన సమయాలు మార్చినట్లు తెలిపారు. రాముల వారికి ఉదయం 4గంటలకు మంగళహారతి, 6గంటలకు ‘శ్రింగార్ హారతి’ ఇచ్చిన అనంతరం ఆలయాన్ని తెరుస్తారు. రాత్రి పదిగంటల వరకూ స్వామివారిని దర్శించుకోవచ్చు.

TG: అందుబాటులో ఉన్న బీసీ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నివాసంలో ఆయన సమావేశమై బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై చర్చించారు. బీసీలకు ప్రభుత్వం ద్రోహం చేసిందని ఈ సందర్భంగా కేటీఆర్ ఆరోపించారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు సిద్ధం కావాలని పిలుపు ఇచ్చినట్లు తెలుస్తోంది. సమావేశం అనంతరం బీఆర్ఎస్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

TG: రెండో శనివారం సందర్భంగా రెగ్యులర్‌గా రేపు స్కూళ్లకు సెలవు ఉంటుంది. అయితే కొన్ని స్కూళ్లు సెలవును రద్దు చేశాయి. రేపు స్కూలుకు రావాలని హైదరాబాద్‌లో విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు మెసేజ్‌లు పంపాయి. విద్యా సంవత్సరం ముగియనుండటం, సిలబస్ పూర్తి కాకపోవడం, స్కూలు పనిదినాలు తగ్గడం సహా పలు కారణాలతో FEB 8న సెలవును రద్దు చేశాయి. మరి రేపు సెలవు లేదని మీ స్కూలు నుంచి మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.

ప్రధాని మోదీతో భేటీపై నాగార్జున స్పందించారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన ‘అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ’ పుస్తకాన్ని మోదీ ఆవిష్కరించడంపై నాగ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ బుక్‌ను మోదీకి అందించడం గౌరవంగా భావిస్తున్నానని, ఇది తన తండ్రి సినీ వారసత్వానికి నివాళిగా భావిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఆయన సేవలను మోదీ గుర్తించడం తమ కుటుంబం, దేశ సినీ ప్రేమికులకు ఒక విలువైన జ్ఞాపకమని నాగార్జున పేర్కొన్నారు.

మోనాలిసా… కుంభమేళాలో తన ఆకర్షించే కళ్లతో ఫేమస్ అయిన ఈ అమ్మాయి ప్రస్తుతం ‘డైరీ ఆఫ్ మణిపూర్’ చిత్రంలో నటిస్తోంది. దీనికి రెమ్యునరేషన్‌గా రూ.21లక్షలు తీసుకుందని సమాచారం. అంతేకాకుండా లోకల్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం రూ.15 లక్షలతో డీల్ చేసుకుందట. పూసలమ్మి రోజుకు రూ.1000 సంపాదిస్తే చాలనుకున్న మోనాలిసాకు ఇప్పుడు డబ్బుతో పాటు దేశవ్యాప్తంగా ఫేమ్ వచ్చేసింది. లక్కంటే ఇదేనేమో మీరేమంటారు.
Sorry, no posts matched your criteria.