India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకురానుంది. ఇప్పటివరకు వారికి ఎలాంటి ఉద్యోగ ప్రయోజనాలు, సామాజిక భద్రత లేవు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ-కామర్స్, సేవా రంగానికి మరింత ఊతం ఇచ్చేలా ఓ పథకం రూపొందిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు. వారికి పెన్షన్, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో 70 లక్షల మంది వర్కర్లు ఉన్నట్టు అంచనా.
డిజిటల్ ఆర్థిక సేవల సంస్థ మొబిక్విక్ IPOకు Retail Investors నుంచి అనూహ్య స్పందన లభించింది. బుధవారం ప్రారంభమైన IPO మొదటి గంటలోనే పూర్తిగా సబ్‌స్ర్కైబ్ అవ్వడం గమనార్హం. ₹265-279 Price Bandతో ఆఫర్ చేసిన 1.18 కోట్ల షేర్లకు 2.17 కోట్ల బిడ్లు దాఖలయ్యాయి. AI , సేవల విస్తృతికై ఈ Fintech సంస్థ ₹572 కోట్ల సమీకరణకు ఐపీవోకు రాగా 7.6% అధికంగా సబ్‌స్ర్కిప్షన్ డిమాండ్ ఏర్పడింది.
ప్రయాణికులు లేకున్నా విద్యార్థి చదువు కోసం రైలును కొనసాగించిన ఘటన జపాన్‌లో జరిగింది. హక్కైడోలో క్యుషిరటాకి అనే రైల్వే స్టేషన్‌లో కనా హరాడా అనే విద్యార్థి మాత్రమే రోజూ ప్రయాణించేది. రైలు ఆపితే ఆమె చదువుకు ఆటంకం కలుగుతుందని డిగ్రీ పూర్తయ్యేవరకూ ట్రైన్ కొనసాగించారు. అదే మన దగ్గర వరంగల్ జిల్లా నెక్కొండలో ప్రయాణికులు లేకుంటే రైలు నిలుపరని, ప్రజలే చందాలు వేసుకుని రోజూ టికెట్స్ కొంటున్నారు.
ప్రపంచంలో ఎన్నో వృత్తులు ఉన్నప్పటికీ ప్రజలు వైద్యులపై ఎక్కువ విశ్వాసం కలిగి ఉన్నట్లు తేలింది. 2024లో IPSOS జరిపిన సర్వేలో ఇండియాలో 57శాతం మంది డాక్టర్ వృత్తిపై ఎక్కువ విశ్వాసంతో ఉన్నారు. దీంతోపాటు ఆర్మీ ఆఫీసర్లను 56%, టీచర్లను 56%, సైంటిస్టులను 54%, జడ్జిలను 52%, బ్యాంకర్స్‌ను 50%, పోలీసులను 47 శాతం మంది నమ్ముతున్నారు. కాగా, రాజకీయ నాయకులు అట్టడుగున ఉన్నట్లు సర్వే రిపోర్ట్ పేర్కొంది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు 83 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 298 పరుగులు చేసింది. ఆ జట్టులో అన్నాబెల్(110) సెంచరీతో చెలరేగారు. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 4 వికెట్లు తీశారు. ఛేదనలో స్మృతి మంధాన(105) మినహా మిగతా ప్లేయర్లు విఫలమయ్యారు. AUS బౌలర్ గార్డ్‌నర్ 5 వికెట్లు తీసి పతనాన్ని శాసించారు. దీంతో ఆస్ట్రేలియా 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది.
AP: వాట్సాప్ ద్వారా 153 పౌరసేవలు అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసిందని మంత్రి లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ సమాచారమంతా ఒకే వెబ్‌సైట్‌లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్‌పై కలెక్టర్లతో సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యాశాఖలో అపార్ ఐడీ జారీలో ఇబ్బందులను పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం యూఏఈ ప్లాట్‌ఫాం ఒక్కటే పౌరసేవలు అందిస్తోందని పేర్కొన్నారు.
TG: జల్‌పల్లిలో ఉద్రిక్త పరిస్థితుల నడుమ మంచు విష్ణు ప్రధాన అనుచరుడు కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్‌పై దాడి కేసులో ఆయనను పహాడీ షరీఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం తనపై దాడి జరిగిందని మనోజ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరో నిందితుడు వినయ్ కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ సచివాలయంలో డిసెంబర్ 12 నుంచి ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు కానుంది. సచివాలయంలో పనిచేసే అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి దీనిని వర్తింపజేయనున్నారు. ఔట్ సోర్సింగ్, సచివాలయం హెడ్ నుంచి వేతనాలు పొందే ప్రతి ఉద్యోగికి తప్పనిసరిగా ఫేషియల్ అటెండెన్స్ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గీతా పారాయణం గిన్నిస్ రికార్డు సాధించింది. ఇవాళ గీతా జయంతి సందర్భంగా 5వేల మందికిపైగా భక్తులు ‘కర్మ యోగ్’ అధ్యాయాన్ని పఠించారు. ఈ గిన్నిస్ రికార్డు సాధించడంపై సీఎం మోహన్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని గోశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన నిర్ణయించారు.
మహారాష్ట్ర నాసిక్‌లోని ఓ హౌసింగ్ సొసైటీ విపక్ష రాజకీయ పార్టీలపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. Dec 15న జరగనున్న సొసైటీ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థిస్తూనే, ఓడిపోయిన వారు విపక్షాల మాదిరి ఎన్నికల ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తవద్దని సూచించడం వైరల్‌గా మారింది. పోలింగ్‌పై భరోసా ఉంచాలని కోరింది. మూడేళ్లపాటు సొసైటీ బాధ్యతల్ని పర్యవేక్షించే కమిటీ ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యమని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.