India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మణిపుర్‌లో జరిగిన హింసతో 59వేలకు పైగా మంది నిరాశ్రయులు అయినట్లు సీఎం బిరెన్ సింగ్ తెలిపారు. 11,133 ఇళ్లు ధ్వంసమైనట్లు కాంగ్రెస్ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు అసెంబ్లీలో సమాధానమిచ్చారు. ‘వన్ ఫ్యామిలీ వన్ లాక్’ పథకంలో భాగంగా 2,972 ఖాతాల్లో రూ.25వేల చొప్పున మొదటి విడత నగదు జమ చేసినట్లు పేర్కొన్నారు. ముందుగా హింసలో ఇళ్లు కోల్పోయిన వారికే ప్రభుత్వం నగదు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
యంగ్ హీరో శర్వానంద్‌తో మాస్ డైరెక్టర్ సంపత్ నంది సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. సంపత్ చెప్పిన కథకు ఈ హీరో ఒకే చెప్పారని సినీవర్గాల్లో టాక్. ఫ్యామిలీ హీరోను పవర్ ఫుల్ రోల్‌లో చూపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సంపత్ నంది సాయిధరమ్ తేజ్‌తో ‘గాంజా శంకర్’ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో ఈ కథనే మార్చి శర్వాతో తీస్తారని చర్చ నడుస్తోంది.
పారిస్ ఒలింపిక్స్‌లో పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత షట్లర్ లక్ష్యసేన్ కాంస్యం గెలుస్తారని అంతా భావించారు. అయితే మలేషియా ప్లేయర్ చేతిలో 2-1తో పరాజయం పాలయ్యారు. మోచేతికి గాయంతోనే సేన్ ఆటను కొనసాగించారు. మ్యాచ్ మధ్యలో పలుమార్లు ఆటంకం కలగడంతో ఆటపై ప్రభావం చూపిందని లక్ష్యసేన్ చెప్పారు. కాగా 2012, 2016, 2021 ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌లో పతకం గెలిచిన భారత ప్లేయర్లు ఈ సారి నిరాశపరిచారు.
TG: యూఎస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ సమక్షంలో వి-హబ్ ప్రతినిధులు డబ్ల్యూకే హోల్డింగ్‌తో రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందం చేసుకున్నారు. 5 మిలియన్ల యూఎస్ డాలర్ల పెట్టుబడికి ఆ సంస్థ అంగీకారం తెలిపింది. వి-హబ్ అనేది రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తల స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తోంది. కాగా అంతకుముందు న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్‌ను సీఎం సందర్శించారు.
తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం అయ్యేందుకు ఇంకా సమయం ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. గత కొంత కాలంగా ఉదయనిధి డిప్యూటీ సీఎం అవుతారనే చర్చ నేపథ్యంలో తాజాగా ఆయన స్పందించారు. మరోవైపు చెన్నైలో వరదలను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సొంత నియోజకవర్గమైన కొలత్తూరులో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులకు స్టాలిన్ పలు సూచనలు చేశారు.
1881: శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జననం
1934: తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొ.కొత్తపల్లి జయశంకర్ జననం
1943: అభ్యుదయ కవి కె.శివారెడ్డి జననం
1925: భారత జాతీయోద్యమ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ మరణం
2019: మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మరణం
2023: ప్రజా గాయకుడు గద్దర్ మరణం
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
పారిస్ ఒలింపిక్స్‌లో 3000m స్టిపుల్ ఛేజ్‌లో భారత అథ్లెట్ అవినాష్ చరిత్ర సృష్టించారు. ఈ విభాగంలో ఫైనల్ చేరిన తొలి భారతీయుడిగా నిలిచారు. రౌండ్-1లో ఆయన 8:15.43 సెకన్ల సమయంలోనే గమ్యాన్ని చేరుకొని టాప్-5లో నిలిచారు. దీంతో ఈ నెల 8న జరిగే ఫైనల్లో అవినాష్ పోటీ పడనున్నారు.
<<-se>>#Olympics2024<<>>
✒ తేది: ఆగస్టు 6, మంగళవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:40 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 5:57 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:22 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:49 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:47 గంటలకు
✒ ఇష: రాత్రి 8.04 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
షేక్ హసీనా దేశం విడిచి, తన పదవికి రాజీనామా చేయడంతో బంగ్లాదేశ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ప్రధాని, ప్రతి పక్ష నేత ఖలేదా జియా విడుదలకు ప్రెసిడెంట్ మహ్మద్ షహబుద్దీన్ ఉత్తర్వులు ఇచ్చారు. మరోవైపు పార్లమెంటును రద్దు చేశారు. అంతేకాకుండా విద్యార్థి నిరసనల్లో అరెస్టైనవారికి స్వేచ్ఛ కల్పించాలని ఆర్మీ ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయించారు. కాగా ఖలేదా అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.