India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుపతి-కోయంబత్తూరు మధ్య ప్రయాణించే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు గర్భిణిని లైంగిక వేధింపులకు గురిచేసి, రైల్లోంచి కిందకి నెట్టివేశాడు. ఈ ఘటన కేవీ కుప్పం రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. రక్తపుమడుగులో పడి ఉన్న మహిళను జోలార్‌పేట పోలీసులు గుర్తించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు పాల్పడిన వేలూరు కేవీ కుప్పంకు చెందిన హేమరాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. నేటి వరకు 40 కోట్ల మందికి పైగా త్రివేణీ సంగమం వద్ద పుణ్యస్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఇవాళ కుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం సంభవించింది. సెక్టార్-18 శంకరాచార్య మార్గంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

AP: అంబేడ్కర్ కోనసీమ(D) సఖినేటిపల్లి(మ) అంతర్వేదిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం ఇవాళ జరగనుంది. అర్ధరాత్రి 12.55 గంటలకు మృగశిరా నక్షత్రయుక్త వృశ్చిక లగ్నంలో శ్రీదేవి భూదేవి అమ్మవార్లతో అర్చకులు కళ్యాణం జరిపించనున్నారు. దాదాపు 2-3 లక్షల మంది భక్తులు ఈ వేడుక కోసం తరలిరానున్నారు. ఆర్టీసీ దాదాపుగా 105 బస్సులు తిప్పుతుండగా, 1600 మంది సిబ్బందితో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

AP: ఈ నెల 24 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 28న లేదా మార్చి 3వ తేదీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. BAC సమావేశం తర్వాత ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.

కోడిగుడ్డులో వైట్ మాత్రమే తినాలా? ఎల్లో తినొద్దా? అని చాలా మందికి సందేహం ఉంటుంది. అలాంటి వారికి డా.మోహన వంశీ క్లారిటీ ఇచ్చారు. ‘బరువు తగ్గాలి అనుకునేవారికి ఎగ్ వైట్ ఎంతో మంచిది. అదే ఎల్లోలో A,D,E,B12 అనే విటమిన్లు, ఐరన్ వంటి మినరల్స్ ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి, ఎనర్జీ కోసం చాలా అవసరం. ఎగ్స్ న్యూట్రిషన్ రిచ్ ఫుడ్. ఎలా తిన్నా మీ ఆహారంలో తప్పకుండా ఉండేలా చూసుకోండి’ అని తెలిపారు. SHARE IT

ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లోని అతిథి గృహాన్ని కుటుంబంతో కలిసి సందర్శించడం తనకు దక్కిన గౌరవమని మాస్టార్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అన్నారు. ‘రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందించిన ఆతిథ్యం దీనిని మరింత ప్రత్యేకం చేసింది. విందులో హృదయపూర్వక సంభాషణలు నన్ను మరింత ప్రభావితం చేశాయి. ఈ అనుభవాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. రాష్ట్రపతి భవన్‌ను సందర్శించి దాని గొప్పతనం, వారసత్వాన్ని తెలుసుకోండి’ అని తెలిపారు.

టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు ODI, T20 కెప్టెన్సీ ఇవ్వాలని BCCI యోచిస్తున్నట్లు నేషనల్ మీడియా పేర్కొంది. బాగా రాణిస్తున్నప్పటికీ అతడికి అన్యాయం జరుగుతోందనే భావనలో కోచ్ గంభీర్, బోర్డు అధికారులున్నట్లు సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవకపోతే ODIలకు హార్దిక్‌ను కెప్టెన్ చేయాలని, T20ల్లో సూర్య బ్యాటింగ్‌లో విఫలమవుతున్న నేపథ్యంలో ఆ పగ్గాలు కూడా పాండ్యకే ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

RBI రెపోరేటు తగ్గించాక చాలామందిలో కొన్ని సందేహాలు మొదలయ్యాయి. ఇది కేవలం హోమ్‌లోన్‌కు మాత్రమే వర్తిస్తుందా? పర్సనల్, ఆటో లోన్లకు వర్తించదా? అంటూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సాధారణంగా బ్యాంకులు ఫిక్స్‌డ్, ఫ్లోటింగ్ అనే 2 రకాల వడ్డీరేట్లను ఆఫర్ చేస్తాయి. ఫ్లోటింగ్ రేటుకే మీరు లోన్ తీసుకొని ఉంటే రెపోరేటు మార్పులను బట్టి EMI పెరగడం, తగ్గడం ఉంటుంది. హోమ్, పర్సనల్, ఆటో లోన్లకూ వర్తిస్తుంది.

ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ మరోసారి లేఆఫ్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది. మైసూర్ క్యాంపస్‌లో దాదాపు 700 మంది ట్రైనీ ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు సమాచారం. ఇంటర్నల్ అసెస్‌మెంట్‌లో భాగంగా నిర్వహించిన ఎవాల్యుయేషన్ పరీక్షల్లో వీరందరూ ఫెయిల్ కావడంతోనే ఇంటికి పంపినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు తమను ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతోనే పరీక్షలు కఠినంగా నిర్వహించారని ఉద్యోగులు వాపోతున్నారు.

AP: సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరి నేతృత్వంలోని బృందం ఇవాళ సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 2047- విజన్ డాక్యుమెంట్‌పై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.