news

News February 7, 2025

ఆపరేషన్ టైగర్: శిండే గూటికి ఠాక్రే ఎంపీలు!

image

మహారాష్ట్రలో ‘ఆపరేషన్ టైగర్’ హాట్‌టాపిక్‌గా మారింది. ఉద్ధవ్ ఠాక్రే SSUBT 9 మంది ఎంపీల్లో ఆరుగురు శిండే శివసేనలో చేరబోతున్నారని సమాచారం. ఇప్పటికే చర్చలు ముగిశాయని, వచ్చే పార్లమెంటు సెషన్‌లోపు వీరు చేరడం ఖాయమేనని తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్రాల్లో NDA అధికారంలో ఉండటం, ఐదేళ్ల వరకు నిధులు లేకుండా మనుగడ కష్టమవ్వడమే ఇందుకు కారణాలని టాక్. 2/3 వంతు MP/MLAలు మారితే పార్టీ మార్పు నిరోధక చట్టం వర్తించదు.

News February 7, 2025

టాటా ఆస్తిలో రూ.500 కోట్లు.. ఎవరీ మోహన్ దత్తా?

image

వ్యాపార దిగ్గజం రతన్ టాటా తన వీలునామాలో రూ.500 కోట్లు మోహినీ మోహన్ దత్తా అనే వ్యక్తికి రాశారు. ఆ పేరు తాజాగా బయటికి రావడంతో ఆయన ఎవరన్న ఆసక్తి నెలకొంది. ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌కు చెందిన దత్తా ఒకప్పుడు స్టాలియన్ అనే ట్రావెల్ ఏజెన్సీకి యజమాని. దాన్ని టాటా గ్రూప్‌లో కలిపేశారు. టాటాతో మోహన్‌కు 60 ఏళ్ల స్నేహముందని జంషెడ్‌పూర్‌వాసులు చెబుతుంటారు. ఆ స్నేహంతోనే భారీ మొత్తాన్ని ఇచ్చారని తెలుస్తోంది.

News February 7, 2025

ఫొటోల మార్ఫింగ్ కేసు.. విచారణకు హాజరైన RGV

image

AP: కూటమి నేతల ఫొటోల మార్ఫింగ్ కేసులో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆయనపై కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులివ్వడంతో ఒంగోలు రూరల్ పీఎస్‌లో ఇవాళ విచారణకు హాజరయ్యారు.

News February 7, 2025

ఆ కామెంట్స్ నేను పట్టించుకోను: హర్షిత్ రాణా

image

ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌లో టీమ్ ఇండియా దూబే స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణాను దించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దానిపై రాణా స్పందించారు. ‘అనేవాళ్లు అంటూనే ఉంటారు. అవేవీ నేను పట్టించుకోదలచుకోలేదు. నా ఆటపైనే తప్ప వేరే వాటిపై దృష్టి పెట్టను’ అన్నారు. గ్రౌండ్‌కి వచ్చిన తర్వాతే తాను అరంగేట్రం చేస్తున్నట్లు తెలిసిందని.. దానికి ముందుగానే సిద్ధమై ఉన్నానని తెలిపారు.

News February 7, 2025

ట్యాక్స్ బెన్ఫిట్స్‌తో ఇలా చేయండి: డా.ముఖర్జీ

image

కేంద్రం ట్యాక్స్ భారాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రజలకు డాక్టర్ ముఖర్జీ చిన్న సలహా ఇచ్చారు. ‘ట్యాక్స్ బెన్ఫిట్స్‌ వల్ల మిగిలిన అదనపు డబ్బును హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంగా పెట్టడం మంచి మార్గం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఆస్పత్రి ఖర్చులు భరించడం కష్టం. సేవింగ్స్ మొత్తం ఖర్చవకుండా కాపాడుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు చెప్పిరావు కాబట్టి ఏళ్ల తరబడి ఆదా చేసిన డబ్బు రోజుల్లో ఖాళీ అవుతుంది’ అని Xలో రాసుకొచ్చారు.

News February 7, 2025

నాకు అరెస్ట్ వారెంట్ వచ్చిందనడం అబద్ధం: సోనూ సూద్

image

తనపై అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ వచ్చిన వార్తలు అబద్ధమని నటుడు సోనూ సూద్ ట్విటర్లో తెలిపారు. ‘సోషల్ మీడియాలో ఈ అంశాన్ని సెన్సేషనలైజ్ చేస్తున్నారు. మాకు సంబంధం లేని వేరే అంశంలో సాక్ష్యం చెప్పేందుకు కోర్టు నన్ను పిలిచింది. ఈ కేసులో దేనికీ నేను బ్రాండ్ అంబాసిడర్‌ను కాదు. పబ్లిసిటీ కోసం నా పేరును కొందరు వాడుతున్నారు. ఆ విషయంలో కఠిన చర్యలు తీసుకోనున్నాం’ అని పోస్ట్ పెట్టారు.

News February 7, 2025

ఆస్ట్రేలియాకు వెళ్లిన స్టూడెంట్స్ వీసాలు రద్దు.. ఎందుకంటే?

image

అమెరికాకు వెళ్లిన స్టూడెంట్స్ పార్ట్ టైమ్ జాబ్స్ చేసేందుకు అక్కడి ప్రభుత్వం నిరాకరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆస్ట్రేలియాకు వెళ్లిన స్టూడెంట్స్‌ పరిమితికి మించి పార్ట్ టైమ్ జాబ్స్ చేసి ఇబ్బందులపాలవుతున్నారు. ఇలా చేయడంతో విద్యార్థుల వీసాలు రద్దవుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నోటీసులను Xలో షేర్ చేస్తున్నారు. అక్కడ స్టూడెంట్స్ 15 రోజుల్లో 48గంటల కంటే తక్కువ సేపు మాత్రమే పనిచేయాలి.

News February 7, 2025

కలియుగ శ్రవణ కుమారులు!

image

తల్లిదండ్రులను కావడిపై మోస్తూ ఎన్నో ప్రాంతాలు తిరిగి ప్రాణాలు సైతం కోల్పోయిన శ్రవణ కుమారుడు ఎందరికో ఆదర్శం. అలాంటి ఇద్దరు అన్నదమ్ములు మహాకుంభమేళాలో కనిపించారు. తమ తల్లిదండ్రులను చెరో వైపు కూర్చోబెట్టుకుని శ్రవణ కుమారుడి తరహాలో కావడిపై మోశారు. వయసైపోయిన తల్లిదండ్రులను ఓల్డేజ్ హోమ్‌లో ఉంచుతున్న ఈ రోజుల్లో ఇలా వారికి సేవ చేయడం గొప్ప విషయమని నెటిజన్లు కొనియాడుతున్నారు. మీరేమంటారు?

News February 7, 2025

‘తండేల్’ మూవీ రివ్యూ

image

హీరోతో పాటు అతడి జాలర్ల బృందాన్ని పాక్ చెర నుంచి విడిపించేందుకు హీరోయిన్ చేసే ప్రయత్నమే ‘తండేల్’ కథ. నాగచైతన్య, సాయిపల్లవి నటన, వారి మధ్య ప్రేమ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. బుజ్జితల్లి, హైలెస్సా సాంగ్స్ బాగున్నా ఒకే బీజీఎం రిపీట్ అవుతుంది. ఎమోషనల్ సీన్స్ హత్తుకుంటాయి. ఫస్టాఫ్ స్లోగా సాగడం, జైల్లో కొన్ని సీన్స్ ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి. నిడివిని ఇంకాస్త తగ్గిస్తే బాగుండేది.
రేటింగ్: 2.75/5

News February 7, 2025

అమెరికాలో విమానం మిస్సింగ్

image

అమెరికాలో విమానం అదృశ్యమైంది. 10 మందితో అలస్కా మీదుగా ప్రయాణిస్తున్న ఫ్లైట్ రాడార్ సిగ్నల్స్‌కు అందకుండా పోయింది. దీంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఇటీవల వాషింగ్టన్‌లోని రోనాల్డ్ రీగన్ ఎయిర్‌పోర్టు వద్ద ఆర్మీ హెలికాప్ట‌ర్ ఢీకొట్టడంతో విమానం పోటోమాక్ నదిలో కుప్పకూలింది. ఈ ఘ‌ట‌న‌లో మొత్తం 67 మంది ప్ర‌యాణికులు మృతి చెందారు.