India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగ్లాదేశ్ హిందువులకు కెనడా హిందువులు అండగా నిలిచారు. ఆ దేశంలో మైనారిటీలకు రక్షణ కల్పించాలంటూ ఒట్టావాలోని బంగ్లా హైకమిషన్ ముందు ఆందోళన చేపట్టారు. ‘షేమ్ షేమ్ బంగ్లాదేశ్’, ‘మహ్మద్ యూనస్ కూనీకోర్’, ‘హిందూలైవ్స్ మ్యాటర్’, ‘హిందువుల ఊచకోత ఆపండి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘హిందూ స్త్రీలు, పిల్లలను రేప్ చేస్తున్నారు. గతంలో పాక్, అఫ్గాన్‌లో జరిగినట్టే బంగ్లాలోనూ జరుగుతోంది’ అని ఒకరు వాపోయారు.
అమెరికాలోని న్యూయార్క్ నుంచి ఇంగ్లండ్‌లోని లండన్‌కు గంటలో ప్రయాణించేలా ట్రైన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 3,400 మైళ్ల దూరం ప్రస్తుతం విమానంలో వెళ్లాలంటే దాదాపు 7 గంటల సమయం పడుతుంది. అట్లాంటిక్ మహా సముద్రంలో ట్రాన్స్ అట్లాంటిక్ టన్నెల్ ద్వారా రైలులో 54 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టుకు సుమారు 19.8 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. దీనిని నిర్మించేందుకు దశాబ్దాలు పట్టొచ్చు.
యువత, మధ్య వయస్కుల్లో బింగే, హై ఇంటెన్సిటీ డ్రింకింగ్ అలవాటు ప్రమాద ఘంటికలు మోగిస్తోందని డాక్టర్లు అంటున్నారు. 2 గంటల్లోనే 6 పెగ్గులేస్తే బింగే, 10-12 వరకు తాగితే హై ఇంటెన్సిటీ డ్రింకింగ్ అంటారు. సోషల్ ఆబ్లిగేషన్స్, ఫ్రెండ్స్ వల్ల అతిగా మద్యం తాగే అలవాటు పెరుగుతోందని వారు చెప్తున్నారు. దీంతో పాంక్రియాస్, లివర్, స్టొమక్, హార్ట్, మైండ్, నెర్వస్ సిస్టమ్ రోగాలబారిన పడతాయని వార్నింగ్ ఇస్తున్నారు.
AP: పేదరికం, మూఢనమ్మకం ఓ చిన్నారి ప్రాణాలు తీశాయి. నెల్లూరుకు చెందిన లక్ష్మయ్య, లక్ష్మి కూతురు భవ్యశ్రీ(8) బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతుండగా సర్జరీ చేయాలని వైద్యులు చెప్పారు. అలా చేస్తే ఆమె బతకదని పేరెంట్స్ భయపడ్డారు. దానికితోడు డబ్బులూ లేవు. ఆదూరిపల్లి చర్చిలో ప్రార్థనలు చేస్తే నయం అవుతుందని కొందరు చెప్పడంతో 40 రోజులుగా ఉపవాసం ఉంటూ ప్రేయర్స్ చేశారు. చివరికి భవ్యశ్రీ చర్చిలోనే ప్రాణాలు విడిచింది.
సందీప్ రెడ్డి తెరకెక్కించనున్న స్పిరిట్ మూవీలో ప్రభాస్ లుక్స్ ఎలా ఉంటాయన్నదానిపై ఆయన ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఓ ఫ్యాన్ గ్రోక్ ఏఐను వాడి ప్రభాస్ పోలీస్ గెటప్‌ను క్రియేట్ చేశారు. ప్రభాస్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఆ పిక్ వైరల్ అవుతోంది. డార్లింగ్ ప్రస్తుతం ది రాజా సాబ్, సలార్ సీక్వెల్, ఫౌజీ సినిమాల్లో నటిస్తున్నారు. వాటి తర్వాతే స్పిరిట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నేడు APలో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయంది. రేపు నెల్లూరు, అనంతపురం, వైఎస్ఆర్, చిత్తూరు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.
TG: రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’, తెలంగాణ తల్లి ఫొటోను పాఠ్యపుస్తకాల్లో ముద్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి పదో తరగతి టెక్ట్స్ బుక్‌ల్లో ఇవి కనిపించనున్నాయి. ప్రస్తుత పుస్తకాల్లో ప్రతిజ్ఞతోపాటు జాతీయ గీతం, జాతీయ గేయం ఉన్నాయి. ఇక వచ్చే ఏడాదీ విద్యార్థులకు పాత సిలబస్సే ఉంటుందని, 2026-27లో సిలబస్ మారే అవకాశం ఉందని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి తెలిపారు.
AP: ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు రూ.300 ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు రూ.255 కూలి ఇస్తుండగా దీనిని రూ.300కు పెంచేందుకు CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. పనులు ఎలా చేపడితే రూ.300 కూలి వస్తుందో కూలీలు, మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇప్పటికే అవగాహన కల్పించారు. దీనిపై కలెక్టర్లు, డ్వామా PDలకు పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణ తేజ ఉత్తర్వులు జారీ చేశారు.
క్రిప్టో కరెన్సీ మార్కెట్లో బలహీనత కనిపిస్తోంది. ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణే ఇందుకు కారణం. లక్ష డాలర్ల స్థాయిని తాకాక బిట్‌కాయిన్ క్రమంగా పతనమవుతోంది. 3 రోజుల్లోనే $6500 (Rs 5.5L) మేర నష్టపోయింది. ఇవాళ $96,593 వద్ద మొదలైన BTC $539 నష్టంతో $96,093 వద్ద ట్రేడవుతోంది. Mcap $1.94 ట్రిలియన్ల నుంచి $1.91 ట్రిలియన్లకు తగ్గింది. ETH, USDT, XRP, SOL, BNP, DOGE, USDC, ADA, TRX కాయిన్లూ నష్టాల్లోనే ఉన్నాయి.
TG: రైతు భరోసా కోసం అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరినట్లు తెలుస్తోంది. రూ.10 వేల కోట్లు ఇచ్చేందుకు ICICI బ్యాంకు అంగీకరించినట్లు సమాచారం. కోకాపేట, రాయదుర్గంలోని TGIICకి చెందిన 400 ఎకరాల భూములను తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. ఆడిటింగ్ పూర్తి చేసి RBIకి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇందులో రూ.8 వేల కోట్లు రైతుభరోసాకు, రూ.2 వేల కోట్లు పదవీ విరమణ ఉద్యోగుల ప్రయోజనాలకు ఖర్చు చేయనుంది.
Sorry, no posts matched your criteria.