news

News February 6, 2025

డిగ్రీ అర్హతతో రూ.1.10 లక్షల జీతంతో ఉద్యోగాలు

image

224 పోస్టుల భర్తీకి AAI (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నోటిఫికేషన్ విడుదల చేసింది. జూనియర్, సీనియర్ అసిస్టెంట్ పోస్టుల కోసం మార్చి 5లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. జనరల్ అభ్యర్థులు రూ.1,000 ఫీజు చెల్లించి అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. SC, STలకు వయసు సడలింపు ఉంటుంది. అభ్యర్థులు డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) చదివి ఉండాలి. నెలకు రూ.31,000-రూ.1,10,000 జీతం ఉండనుంది. aai.aero

News February 6, 2025

బీజేపీకి 45-55 సీట్లు: యాక్సిస్ మై ఇండియా

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించింది. బీజేపీ 45-55, ఆప్ 15-25, కాంగ్రెస్ 0-1, ఇతరులు 0-1 సీట్లు గెలుస్తాయని పేర్కొంది. 70 అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు అవసరం.

News February 6, 2025

₹61,500 బదులు ₹10,000 Income Tax చెల్లిస్తే చాలు..

image

₹12L వరకు ట్యాక్స్ లేదు. దానిపై జస్ట్ ₹10వేలు పెరిగితే, అంటే ₹12.10L అయితే ₹61,500 పన్ను చెల్లించాలేమోనని కొందరు కంగారు పడుతున్నారు. వీరికి సెక్షన్ 87A ప్రకారం మార్జినల్ రిలీఫ్ ఉంటుంది. మొత్తం పన్ను (61,500)లో పెరిగిన శాలరీ (10000)ని తీసేయగా మిగిలిన మొత్తం రిబేట్‌‌ (51,500) వస్తుంది. దానిని ₹61,500 నుంచి తీసేస్తే మిగిలిన ₹10000 మాత్రమే పన్నుగా చెల్లించాలి. ఇలా ₹51,500 ఆదా చేసుకోవచ్చు. Share It.

News February 6, 2025

తెలుగులోనూ జీవోలు.. ఇలా చూసేయండి!

image

AP: రాష్ట్ర ప్రభుత్వం అధికార సైట్‌లో ఇంగ్లిష్‌తో పాటు తెలుగులో జీవోలను అప్‌లోడ్ చేస్తోంది. <>https://goir.ap.gov.in<<>> లోకి వెళ్లి వ్యవసాయం, విద్య, ఆర్థిక, మున్సిపల్, రవాణా ఇలా అన్ని శాఖలకు సంబంధించిన జీవోలను తెలుగులో చూడొచ్చు.

News February 6, 2025

స్కూల్‌లో ఫైర్.. 17 మంది చిన్నారులు సజీవదహనం

image

నైజీరియాలోని ఓ పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. జంఫారా స్టేట్ కైరా నమోదాలోని ఓ ఇస్లామిక్ స్కూల్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బడిలో 100 మంది విద్యార్థులు ఉన్నారు. స్కూల్ పక్కనే నిల్వ ఉంచిన కర్రలకు మంటలు అంటుకుని ప్రమాదం సంభవించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

News February 6, 2025

మల్లన్నకు షోకాజ్ నోటీసులు, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం

image

TG: కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఒక కులాన్ని దూషించడం, కులగణన నివేదికను దహనం చేయడంపై పార్టీ సీరియస్ అయింది. ఎమ్మెల్సీగా ఉండి పార్టీ రాజ్యాంగాన్ని, విధానాలను అతిక్రమించారని అందులో పేర్కొంది. షోకాజ్ నోటీసులకు ఫిబ్రవరి 12లోగా వివరణ ఇవ్వాలని, లేదంటే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

News February 6, 2025

ఇండియా గురించి యురోపియన్ మాటల్లో..!

image

ఏడాది క్రితం ఇండియాకు వచ్చిన యురోపియన్ నిక్‌హునో తన అభిప్రాయాలు పంచుకున్నారు. ‘ఇక్కడ రైతులు ఎడారుల్లో కూడా పంటలు పండిస్తున్నారు. పేదరికమే ప్రతిభను పెంచుతుంది. INDలో ఎలాంటి పని అయినా పవిత్రమే. ఇక్కడ డబ్బు ఉన్నా లేకున్నా ఒకే గౌరవం ఉంది. భాషలు వేరైనా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. నదులను, ప్రకృతిని గౌరవిస్తారు. నిజాయితీ గలవారిని గౌరవిస్తారు. అజ్ఞాత వ్యక్తి కష్టాల్లో ఉన్నా తోడుగా ఉంటారు’ అని తెలిపారు.

News February 6, 2025

OTTలోకి కొత్త సినిమాలు

image

ఫిబ్రవరి 7 – గేమ్ ఛేంజర్ (AMAZON PRIME)
ఫిబ్రవరి 8 – దేవకీ నందన వాసుదేవ (Disney+ Hotstar)
ఫిబ్రవరి 11- కాదలిక్కా నేరమిల్లై (Netflix)
ఫిబ్రవరి 14 – మార్కో (SonyLIV)
ఫిబ్రవరి 18 – ముఫాసా-ది లయన్ కింగ్ (Disney+ Hotstar)
FEB 22 (అంచనా) – కిచ్చా సుదీప్ ‘MAX’ – ZEE5

News February 6, 2025

భారత్‌కు బిగ్ షాక్.. ఓపెనర్లు ఔట్

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ (15), రోహిత్ శర్మ (2) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్ (1*), శ్రేయస్ అయ్యర్ (12*) ఉన్నారు. కాగా భారత్ విజయానికి ఇంకా 218 పరుగులు అవసరం.

News February 6, 2025

హర్షిత్ రానా అరుదైన రికార్డు

image

భారత యువ పేసర్ హర్షిత్ రాణా భారీగా పరుగులిస్తున్నా వికెట్లు తీస్తూ ఆకట్టుకుంటున్నారు. మూడు ఫార్మాట్లలో (టెస్ట్, ODI, టీ20) డెబ్యూ మ్యాచుల్లో మూడేసి వికెట్లు తీసిన తొలి ఇండియన్ బౌలర్‌గా రికార్డు నెలకొల్పారు. టెస్టులో AUSపై 3/48, టీ20లో ENGపై 3/33, ODIలో ENGపై 3/53 వికెట్లతో రాణించారు. అలాగే వన్డేల్లో డెబ్యూ మ్యాచులో ఒకే ఓవర్లో అత్యధిక రన్స్ (26) సమర్పించుకున్న భారత బౌలర్‌గా నిలిచారు.