news

News February 6, 2025

డ్వాక్రా మహిళలకు 50 శాతం రాయితీతో షేడ్ నెట్స్: మంత్రి

image

AP: ఉద్యానసాగును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. 2025-26లో 5వేల మంది డ్వాక్రా మహిళలకు 50% రాయితీతో షేడ్‌నెట్స్ అందిస్తామని చెప్పారు. ఒక్కో షెడ్ వ్యయం ₹3.22Lకాగా సబ్సిడీ పోను మిగతా మొత్తాన్ని స్త్రీనిధి, బ్యాంకుల ద్వారా రుణం ఇప్పిస్తామని చెప్పారు. జాతీయ జీవనోపాధుల పథకం కింద రాష్ట్రానికి ₹1,000Cr కేంద్ర నిధులు పొందనున్నట్లు పేర్కొన్నారు.

News February 6, 2025

పవన్‌కు స్పాండిలైటిస్.. ఇది ఎలా వస్తుంది?

image

<<15370291>>ఏపీ Dy.CM పవన్ కళ్యాణ్<<>> స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నారు. జీవనవిధానంలో మార్పులు, మెడ దగ్గర దెబ్బ తగలడం, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల స్పాండిలైటిస్ వస్తుంది. దీనివల్ల మెడ, వెన్నెముక వద్ద తీవ్రమైన నొప్పి ఉంటుంది. తూలి పడిపోతున్నామనే భావన కలుగుతుంది. వాంతులు రావడం, వికారం వంటి లక్షణాలు ఉంటాయి. మెడ, భుజాలు, చేతులకు తిమ్మిర్లు, నిద్రలేమి సమస్య ఏర్పడతాయి. వ్యాధి ముదిరితే కండరాలు కృశించి పోయే అవకాశం ఉంది.

News February 6, 2025

స్పాండిలైటిస్ నివారణ మార్గాలివే

image

✒ డాక్టర్ల సూచన మేరకు వ్యాయామాలు చేయాలి. ఔషధాలు తీసుకోవాలి. జీవన విధానాన్ని మార్చుకోవాలి.
✒ కూర్చునే, పడుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
✒ ఆహారంలో క్యాల్షియం, ప్రొటీన్‌, విటమిన్లు పుష్కలంగా ఉండాలి.
✒ ఒమేగా-3 సప్లిమెంట్లు ఉండే అవిసె గింజలు, వాల్‌నట్స్‌, చేపలు, తాజా పండ్లు, కూరగాయాలు, పాలు, చీజ్, సోయా, మీల్‌మేకర్ తినాలి.
✒ మద్యపానానికి దూరంగా ఉండాలి.

News February 6, 2025

ఉద్యోగులకు పీఆర్సీ ఎప్పుడు?: బొప్పరాజు

image

AP: కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైనా ఉద్యోగుల సమస్యలపై చర్చించలేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీకి ఛైర్మన్‌ను నియమించలేదని దుయ్యబట్టారు. ఉద్యోగులు మధ్యంతర భృతి(IR) కోరతారనే నియామకాన్ని ఆలస్యం చేస్తున్నట్లు చర్చ జరుగుతోందన్నారు. తమకు రావాల్సిన బకాయిలపై క్లారిటీ ఇవ్వాలని, క్యాబినెట్ సబ్ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు.

News February 6, 2025

చైనా టెలికాం కంపెనీకి యూజర్ల లాగిన్ డేటా

image

చైనా డీప్‌సీక్‌తో యూజర్ల డేటా భద్రతకు ముప్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. US నిషేధిత చైనా ప్రభుత్వ టెలికాం కంపెనీ(చైనా మొబైల్)తో డీప్‌సీక్‌కు సంబంధాలు ఉన్నాయంటున్నారు. కంప్యూటర్ కోడ్ ద్వారా యూజర్ల లాగిన్ సమాచారాన్ని టెలికాం సంస్థకు పంపుతోందని పేర్కొంటున్నారు. కెనడాకు చెందిన ఫీరూట్ సెక్యూరిటీ సంస్థ తొలుత దీన్ని గుర్తించింది. ఇప్పటికే డీప్‌సీక్‌ను ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్ నిషేధించాయి.

News February 6, 2025

25న శ్రీకాళహస్తికి సీఎం చంద్రబాబు

image

AP: శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 21 నుంచి 13 రోజుల పాటు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 25వ తేదీన సీఎం చంద్రబాబు ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఏటా మహాశిరాత్రికి(ఫిబ్రవరి 26) ముందు రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటిదాకా మంత్రులు పట్టువస్త్రాలు సమర్పించేవారు. ఈసారి సీఎం హాజరుకానున్నారు.

News February 6, 2025

ఇవాళ CLP సమావేశం.. కీలక అంశాలపై చర్చ

image

TG: కాంగ్రెస్ శాసనసభాపక్షం(CLP) ఇవాళ సమావేశం కానుంది. HYDలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో CM రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. MLC ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు, కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇటీవల అసంతృప్త ఎమ్మెల్యేల భేటీ అంశమూ ప్రస్తావనకు రావొచ్చని సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీ కూడా పాల్గొననున్నారు.

News February 6, 2025

మరో టీమ్‌ను కొనుగోలు చేసిన కావ్యా మారన్

image

సన్ గ్రూప్ వారసురాలు కావ్యా మారన్ మరో క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేశారు. ఇంగ్లండ్ వేదికగా జరిగే ‘ది హండ్రెడ్’ లీగ్‌లో Northern సూపర్ ఛార్జెస్ ఫ్రాంచైజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఆమె ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, SA20లో ఈస్ట్రర్న్ కేప్ టౌన్ టీమ్‌లకు ఓనర్‌గా ఉన్న విషయం తెలిసిందే. కాగా హండ్రెడ్ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ టీమ్‌ను MI, మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టును LSG కొనుగోలు చేశాయి.

News February 6, 2025

ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా పతనమైన ఇరాన్ కరెన్సీ

image

అణ్వాయుధ తయారీకి సిద్ధమవుతున్న ఇరాన్ లక్ష్యంగా US అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ఒత్తిడి ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక US డాలర్‌తో పోలిస్తే ఆ దేశ కరెన్సీ 8,50,000 రియాల్స్‌కు పతనమైంది. ఇది ఇరాన్ చరిత్రలోనే అత్యల్ప స్థాయి. ఇరాన్ చమురు ఎగుమతులను సున్నాకు తీసుకువచ్చేలా ట్రంప్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆంక్షలు తనకు ఇష్టం లేదని, చర్చలకు రావాలని ఆయన ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.

News February 6, 2025

English Learning: Antonyms

image

✒ Humble× Proud, Assertive
✒ Impenitent× Repentant
✒ Hypocrisy× Sincerity, frankness
✒ Indifferent× Partial, Biased
✒ Impulsive× Cautious, Deliberate
✒ Infernal× Heavenly
✒ Indigent× Rich, Affluent
✒ Interesting× Dull, Uninteresting
✒ Insipid× Pleasing, appetizing