news

News February 6, 2025

ఇవాళ CLP సమావేశం.. కీలక అంశాలపై చర్చ

image

TG: కాంగ్రెస్ శాసనసభాపక్షం(CLP) ఇవాళ సమావేశం కానుంది. HYDలోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల కేంద్రంలో CM రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. MLC ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు, కులగణన, ఎస్సీ వర్గీకరణను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇటీవల అసంతృప్త ఎమ్మెల్యేల భేటీ అంశమూ ప్రస్తావనకు రావొచ్చని సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీ కూడా పాల్గొననున్నారు.

News February 6, 2025

మరో టీమ్‌ను కొనుగోలు చేసిన కావ్యా మారన్

image

సన్ గ్రూప్ వారసురాలు కావ్యా మారన్ మరో క్రికెట్ టీమ్‌ను కొనుగోలు చేశారు. ఇంగ్లండ్ వేదికగా జరిగే ‘ది హండ్రెడ్’ లీగ్‌లో Northern సూపర్ ఛార్జెస్ ఫ్రాంచైజ్‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఆమె ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్, SA20లో ఈస్ట్రర్న్ కేప్ టౌన్ టీమ్‌లకు ఓనర్‌గా ఉన్న విషయం తెలిసిందే. కాగా హండ్రెడ్ లీగ్‌లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ టీమ్‌ను MI, మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టును LSG కొనుగోలు చేశాయి.

News February 6, 2025

ట్రంప్ ఎఫెక్ట్.. భారీగా పతనమైన ఇరాన్ కరెన్సీ

image

అణ్వాయుధ తయారీకి సిద్ధమవుతున్న ఇరాన్ లక్ష్యంగా US అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ఒత్తిడి ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక US డాలర్‌తో పోలిస్తే ఆ దేశ కరెన్సీ 8,50,000 రియాల్స్‌కు పతనమైంది. ఇది ఇరాన్ చరిత్రలోనే అత్యల్ప స్థాయి. ఇరాన్ చమురు ఎగుమతులను సున్నాకు తీసుకువచ్చేలా ట్రంప్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆంక్షలు తనకు ఇష్టం లేదని, చర్చలకు రావాలని ఆయన ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.

News February 6, 2025

English Learning: Antonyms

image

✒ Humble× Proud, Assertive
✒ Impenitent× Repentant
✒ Hypocrisy× Sincerity, frankness
✒ Indifferent× Partial, Biased
✒ Impulsive× Cautious, Deliberate
✒ Infernal× Heavenly
✒ Indigent× Rich, Affluent
✒ Interesting× Dull, Uninteresting
✒ Insipid× Pleasing, appetizing

News February 6, 2025

దరఖాస్తు గడువు పెంపు

image

AP: రాష్ట్రంలో గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు దరఖాస్తు గడువును ఈ నెల 8 వరకు ఎక్సైజ్ శాఖ పొడిగించింది. ఈ నెల 10న డ్రా తీసి లబ్ధిదారుల పేర్లను కలెక్టర్లు ప్రకటిస్తారని వెల్లడించింది. రాష్ట్రంలోని 340 మద్యం దుకాణాలను ప్రభుత్వం గీత కార్మికులకు కేటాయించిన విషయం తెలిసిందే.

News February 6, 2025

అమెరికాలో తెలుగోళ్లు ఎంతమంది ఉన్నారంటే?

image

అక్రమ వలసదారులను అమెరికా వారి దేశాలకు తిప్పి పంపుతోంది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందినవారూ ఉన్నారు. అమెరికాలో తెలుగు వారు 12.30 లక్షలకుపైగా ఉన్నారు. ఎక్కువగా కాలిఫోర్నియా(2 లక్షలు)లో నివసిస్తున్నారు. ఆ తర్వాత టెక్సాస్(1.50 లక్షలు), న్యూజెర్సీ(1.10 లక్షలు), ఇల్లినాయిస్(83 వేలు), వర్జీనియా(78 వేలు), జార్జియా(52 వేలు)లో ఉన్నారు. అక్కడ హిందీ, గుజరాతీ మాట్లాడే వారి తర్వాత తెలుగు మాట్లాడేవారే ఎక్కువ.

News February 6, 2025

సుమతీ నీతి పద్యం- ఎవరు బలవంతుడు?

image

లావుగలవాని కంటెను
భావింపగ నీతిపరుడు బలవంతుండౌ
గ్రావంబంత గజంబును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ!
తాత్పర్యం: కొండంత ఏనుగును మావటివాడు లొంగదీసుకుని దానిపై ఎక్కి కూర్చుంటాడు. అలాగే శరీర బలం ఉన్నవాడి కంటే నీతిమంతుడే నిజమైన బలవంతుడు.

News February 6, 2025

సాయి పల్లవితో డాన్స్ చాలా కష్టం: నాగ చైతన్య

image

నిజమైన ప్రేమలో ఉండే బాధను ‘తండేల్’లో చూపించబోతున్నామని హీరో నాగచైతన్య చెప్పారు. స్క్రిప్ట్, తన లుక్ కసరత్తులకే 8 నెలల టైమ్ కేటాయించామని ప్రెస్‌మీట్‌లో తెలిపారు. ఈ చిత్రంలో సాయిపల్లవి నటన అద్భుతమని కొనియాడారు. ఆమెతో కలిసి డాన్స్ చేయాలని చాలా కష్టపడాల్సి ఉంటుందన్నారు. శివపార్వతుల స్ఫూర్తితో తమ పాత్రలు డిజైన్ చేశామని, అందుకు శివశక్తి థీమ్ సాంగ్ పెట్టామని పేర్కొన్నారు.

News February 6, 2025

భారత్‌తో శాంతి కోరుకుంటున్నాం.. కానీ: పాక్ పీఎం షరీఫ్

image

శాంతి పేరుతో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి సన్నాయి నొక్కులు నొక్కారు. కశ్మీర్ సహా అన్ని సమస్యలను భారత్‌తో సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని చెప్పారు. అయితే 2019 ఆగస్టు 5 నాటి ఆలోచన(ఆర్టికల్ 370 రద్దు) నుంచి బయటకు రావాలన్నారు. POK అసెంబ్లీలో మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితికి ఇచ్చిన వాగ్దానాన్ని భారత్ నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

News February 6, 2025

ఫిబ్రవరి 6: చరిత్రలో ఈరోజు

image

✒ 1890: స్వాతంత్ర్య సమర యోధుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ జననం
✒ 1931: సమరయోధుడు మోతిలాల్ నెహ్రూ మరణం
✒ 1932: రచయిత భమిడిపాటి రామగోపాలం జననం
✒ 1947: ప్రముఖ రచయిత్రి కె.వి.కృష్ణకుమారి జననం
✒ 1956: AP అసెంబ్లీ తొలి మహిళా స్పీకర్ ప్రతిభా భారతి జననం
✒ 2008: హాస్యనటి కల్పనా రాయ్ మరణం
✒ 2022: సింగర్ లతా మంగేష్కర్ మరణం(ఫొటోలో)