India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖఢ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విపక్ష ఇండియా కూటమి పార్టీలు నిర్ణయించాయి. గత కొన్నేళ్లుగా ఆయన సభను నడుపుతున్న తీరుపై విపక్షాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయి. ప్రతి అంశంలోనూ ఛైర్మన్ తమతో వాగ్వాదానికి దిగుతున్నారని విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీసుకొచ్చిన తీర్మానంపై TMC, AAP, SP సంతకాలు చేశాయి. త్వరలో సభలో ప్రవేశపెట్టనున్నాయి.
TG: రైలు కిందపడి పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. స్థానిక ఓ పాఠశాలలో టెన్త్ చదువుతున్న లక్ష్మీనక్షత్ర(13)ను ఆమె తల్లి ఏదో విషయంలో మందలించింది. దీంతో క్షణికావేశానికి లోనైన ఆమె రైలు కింద పడి సూసైడ్ చేసుకుంది. రైల్వే పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం లక్ష్మీనక్షత్ర మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.
TG: గ్రూప్-2 పరీక్షలు వాయిదా వేయాలన్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. పరీక్షకు వారం రోజుల ముందు తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. గ్రూప్-2, RRB పరీక్షలు ఒకే రోజు ఉన్నాయని, పరీక్షలు వాయిదా వేయాలని పలువురు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదల కావడం గమనార్హం.
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రేపు పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ట్వీట్ చేసింది. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు,నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం రైతులకు సూచించింది.
AP: జగన్ కంటే మహానటుడు ఎవరూ లేరని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. అరాచక పాలన సాగించి ఇప్పుడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు. అసత్యాలు చెప్పి హామీలు ఎగ్గొట్టిన చరిత్ర జగన్‌ది అని విమర్శించారు. విద్యావ్యవస్థను దారిలో పెట్టి ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మార్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘పుష్ప-2’ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.829 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. దీంతో అత్యంత వేగంగా రూ.800 కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచిందని పేర్కొంది. కాగా ఇవాళ్టి నుంచి తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లను కాస్త తగ్గించారు.
TG: ఇందిరమ్మ రాజ్యమంటే అణచివేతలు, అక్రమ అరెస్టులేనా అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మాతృమూర్తులపై పురుష పోలీసులతో దౌర్జన్యమా? ఏం పాపం చేశారని వారిని రోడ్డుపైకి లాగారని మండిపడ్డారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వారి ఆగ్రహజ్వాలలను తట్టుకోలేరని హెచ్చరించారు.
స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలు చవిచూశాయి. Sensex 200 పాయింట్ల నష్టంతో 81,508 వద్ద, నిఫ్టీ 58 పాయింట్ల నష్టంతో 24,619 వద్ద స్థిరపడ్డాయి. మెటల్, రియల్టీ, IT షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. Sensex 81,400 పరిధిలో, Nifty 24,580 పరిధిలో ఉన్న సపోర్ట్ సూచీల భారీ పతనాన్ని నిలువరించాయి. Wipro, LT, Sbi Life టాప్ గెయినర్స్. Tata Consum, Hind Unilivr, Tata Motors టాప్ లూజర్స్.
‘పుష్ప-2’ సినిమా చూసేందుకు వచ్చిన ప్రేక్షకులకు వింత అనుభవం ఎదురైంది. కేరళలోని కొచ్చిన్ సినీపోలిస్‌లో ఫస్టాఫ్‌కు బదులుగా సెకండాఫ్ ప్రదర్శించారని సినీవర్గాలు పేర్కొన్నాయి. అయితే, ఈ తప్పిదాన్ని ఎవరూ గుర్తించలేకపోగా ఎంజాయ్ చేశారని తెలిపాయి. ఇంటర్వెల్ సమయంలో శుభం కార్డు పడటంతో వెంటనే థియేటర్ యాజమాన్యానికి చెప్పి తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వెల్లడించాయి.
Digital Arrest మోసాలు పెరుగుతున్నాయి. ముంబైకి చెందిన మహిళకు ఓ ఫ్రాడ్‌స్టర్ ఫోన్ చేసి మీ ఆధార్‌ను ఉపయోగించి ఐదుగురు ₹2 కోట్ల మోసానికి పాల్పడ్డారంటూ బెదిరించాడు. బ్యాంకు అకౌంట్ వివరాలు చెప్పాలని ఆ కేటుగాడు కోరగా, ‘నువ్వు నిజంగా పోలీసువైతే వ్యక్తిగతంగా వచ్చి విచారించు. ఇలా వీడియో కాల్‌లో కాదు’ అని ఆ మహిళ గట్టిగా మందలించి ఫోన్ కట్ చేసింది. ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉండండి. Share It.
Sorry, no posts matched your criteria.