news

News February 5, 2025

విడదల రజినీపై కేసుకు హైకోర్టు ఆదేశం

image

AP: మాజీ మంత్రి విడదల రజినీపై 2 వారాల్లోగా కేసు నమోదు చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు వివరాలను తమకు పంపాలని పేర్కొంది. 2019లో రజినీని ప్రశ్నించినందుకు తనను చిత్రహింసలకు గురి చేశారంటూ పిల్లి కోటి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. తనపై తప్పుడు కేసులు పెట్టించి పోలీసులతో కొట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు రజినీపై కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు.

News February 5, 2025

కొత్త జెర్సీలో భారత ప్లేయర్లు

image

ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు టీమ్ఇండియా సిద్ధమైంది. కొత్త జెర్సీతో టీమ్ సభ్యులు దిగిన ఫొటోలను బీసీసీఐ షేర్ చేసింది. భుజాల వద్ద జాతీయ జెండా రంగు పెద్దగా కనిపించేలా దీనిని డిజైన్ చేశారు. ఎంతో స్టైలిష్ & క్లాసీ లుక్‌తో ఉన్న జెర్సీలో మన ప్లేయర్లు అదిరిపోయారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రేపు విదర్భ స్టేడియంలో తొలి వన్డే జరగనుంది. జెర్సీ ఎలా ఉందో కామెంట్ చేయండి.

News February 5, 2025

BREAKING: పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ఆయన జ్వరంతో పాటు స్పాండిలైటిస్‌తో బాధ పడుతున్నారని ఉపముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారని పేర్కొన్నాయి. దీంతో రేపటి క్యాబినెట్ సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోవచ్చని తెలిపాయి.

News February 5, 2025

గ్రేట్.. ఈ డాక్టర్ ఫీజు రూ.10 మాత్రమే

image

జబ్బుపడి ఆస్పత్రికి వెళ్తే డాక్టర్ ఫీజు రూ.500పైమాటే. కానీ, రూ.10 మాత్రమే ఫీజుగా తీసుకుంటూ పేదలకు వైద్య సేవలందిస్తున్నారు పట్నాకు చెందిన డాక్టర్ ఎజాజ్ అలీ. 40 ఏళ్లుగా రూ.10 తీసుకొని రోగులకు అత్యున్నత చికిత్స అందించేందుకే ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన అందించిన సరసమైన చికిత్స లెక్కలేనన్ని జీవితాలను ప్రభావితం చేసింది. ఆరోగ్య సంరక్షణలో ఎజాజ్ చేసే నిస్వార్థ సేవను అభినందించాల్సిందే.

News February 5, 2025

H1B వీసా హోల్డర్లకు మరో షాక్ తప్పదా!

image

అమెరికాలో పనిచేస్తున్న విదేశీయులకు మరో షాక్ తగిలేలా ఉంది. వారి వర్క్ పర్మిట్ వీసా రెన్యూవల్ గడువును 180 నుంచి 540 రోజులకు పెంచుతూ తీసుకున్న జో బైడెన్ నిర్ణయం రద్దు చేసేలా ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి ఆమోదం లభిస్తే మళ్లీ ఆ గడువు 180 రోజులకు తగ్గుతుంది. ఫలితంగా వేలాది వలసదారులు, శరణార్థులు, గ్రీన్ కార్డు హోల్డర్లు, H1B వీసా హోల్డర్ల భాగస్వాములపై ప్రభావం పడుతుంది.

News February 5, 2025

BREAKING: టెట్ ఫలితాలు విడుదల

image

తెలంగాణ టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ కార్యదర్శి యోగిత ఫలితాలను రిలీజ్ చేశారు. ఈ ఏడాది జనవరి 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహించగా, 1.35 లక్షల మంది హాజరయ్యారు. TETలో 31.21 శాతం మంది అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News February 5, 2025

భారత్‌తో తొలి వన్డేకు ఇంగ్లండ్ జట్టు ఇదే

image

భారత్‌తో జరగబోయే తొలి వన్డేకు ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. దాదాపు ఏడాదిన్నర తర్వాత సీనియర్ ప్లేయర్ జో రూట్‌ను జట్టులోకి తీసుకుంది. ఈ జట్టుకు జోస్ బట్లర్ సారథిగా వ్యవహరిస్తారు. జట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (C), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మహమూద్. రేపు ఇరు జట్ల మధ్య నాగ్‌పూర్‌లో తొలి వన్డే జరగనుంది.

News February 5, 2025

SRH తగ్గేదేలే.. ఈసారి కప్ మనదే..!

image

IPL టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ప్రైమ్ ఫామ్‌లో ఉన్నారు. T20 క్రికెట్‌లో వీరిద్దరూ తమ బ్యాటింగ్ పవర్‌తో రెచ్చిపోతున్నారు. తమ దేశాల తరఫున వీరు పవర్ ప్లేలో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి ఆడుతున్నారు. ప్రస్తుతం T20 ర్యాంకింగ్స్‌లో హెడ్ నంబర్‌వన్, అభిషేక్ రెండో స్థానంలో ఉన్నారు. ఇదే ఫామ్ కొనసాగిస్తే ఈసారి ఐపీఎల్ టైటిల్ మనదేనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News February 5, 2025

రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండలు

image

TG: రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో 32 నుంచి 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతూ వేసవిని తలపిస్తోంది. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఎండలు కాస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో వారంపాటు ఇవే ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేసింది. మరోవైపు హైదరాబాద్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. మీ ఏరియాలో ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 5, 2025

Way2Newsలో ఎక్స్‌క్లూజివ్‌గా ఎగ్జిట్ పోల్స్

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కానున్నాయి. ఢిల్లీ పీఠం ఎవరిదనే దానిపై యాక్సిస్ మై ఇండియా, సీ ఓటర్, జన్ కీ బాత్, టుడేస్ చాణక్య వంటి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి. Way2Newsలో వేగంగా, ఎక్స్‌క్లూజివ్‌గా ఎగ్జిట్ పోల్స్ తెలుసుకోవచ్చు.