India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

IPL టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ప్రైమ్ ఫామ్‌లో ఉన్నారు. T20 క్రికెట్‌లో వీరిద్దరూ తమ బ్యాటింగ్ పవర్‌తో రెచ్చిపోతున్నారు. తమ దేశాల తరఫున వీరు పవర్ ప్లేలో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగి ఆడుతున్నారు. ప్రస్తుతం T20 ర్యాంకింగ్స్‌లో హెడ్ నంబర్‌వన్, అభిషేక్ రెండో స్థానంలో ఉన్నారు. ఇదే ఫామ్ కొనసాగిస్తే ఈసారి ఐపీఎల్ టైటిల్ మనదేనని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

TG: రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో 32 నుంచి 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతూ వేసవిని తలపిస్తోంది. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఎండలు కాస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో వారంపాటు ఇవే ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేసింది. మరోవైపు హైదరాబాద్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. మీ ఏరియాలో ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కాసేపట్లో ముగియనుంది. సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కానున్నాయి. ఢిల్లీ పీఠం ఎవరిదనే దానిపై యాక్సిస్ మై ఇండియా, సీ ఓటర్, జన్ కీ బాత్, టుడేస్ చాణక్య వంటి సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించనున్నాయి. Way2Newsలో వేగంగా, ఎక్స్‌క్లూజివ్‌గా ఎగ్జిట్ పోల్స్ తెలుసుకోవచ్చు.

కంటికి అద్భుతంగా కనిపించే కళాఖండాన్ని రూ.కోట్లు పెట్టి కొనుగోలు చేయడం చూస్తుంటాం. కానీ, అసలు భౌతికంగా లేని ఓ ఆర్ట్‌ను $18,300 (రూ.15లక్షలు)కు కొనుగోలు చేశారు. ఇటాలియన్ కళాకారుడు సాల్వటోర్ గరౌ భౌతికంగా కనిపించని శిల్పాన్ని రూపొందించారు. అయితే ఇది భౌతికంగా కనిపించనప్పటికీ అక్కడ ఏదో రూపం ఉందనే భావనే కలుగుతోందని చెప్పుకొచ్చారు. దీనిని విక్రయించేందుకు వేలం నిర్వహించగా భారీ డిమాండ్ కనిపించింది.

AP: ఈసారి జగన్ 2.Oని చూడబోతున్నారని YS జగన్ అన్నారు. ‘2.0 వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్ ఎలా పని చేస్తాడో చూపిస్తా. తొలి విడతలో ప్రజల కోసం తాపత్రయ పడ్డా. వారికి మంచి చేసే విషయంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయా. ఇప్పుడు మిమ్మల్ని పెడుతున్న కష్టాలు, బాధలను చూశా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టను. ఎక్కడున్నా తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతా’ అని జగన్ హెచ్చరించారు.

TG: రిజర్వేషన్ల కోసమే రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టినట్లు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. పీసీసీలోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ‘రాష్ట్రంలో 3.6 శాతం మందే సర్వేలో పాల్గొనలేదు. వీరిలో ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉన్నారు. అలాగే పార్టీలో ఎంతటివారైనా నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. రూల్స్ పాటించని వారిపై కచ్చితంగా చర్యలు ఉంటాయి’ అని ఆయన హెచ్చరించారు.

కోల్‌కతాలోని ఇండియన్ ఆర్మీ ఈస్ట్రన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పేరును మార్చినట్టు తెలిసింది. ఫోర్ట్ విలియమ్ బదులు ‘విజయ్ దుర్గ్’గా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. 2023, DECలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని డిఫెన్స్ మినిస్ట్రీ PR, వింగ్ కమాండర్ హిమాన్షు తివారీ చెప్పారని TOI తెలిపింది. అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇంటర్నల్ కమ్యూనికేషన్లో విజయ్‌దుర్గ్‌నే వాడుతున్నట్టు చెప్పారని వెల్లడించింది.

AP: శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఈ నెల 19- మార్చి 1 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా CM చంద్రబాబు 23న స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేసేందుకు దేవస్థాన యంత్రాంగం కృషి చేస్తోంది. పాతాళగంగ వద్ద రక్షణ కంచెలు, మహిళలు బట్టలు మార్చుకునే గదులకు మరమ్మతులు చేస్తున్నారు. అటు శివ దీక్ష భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు.

దేశీయ స్టాక్‌మార్కెట్లు మోస్తరు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంలో లాభపడినప్పటికీ గ్లోబల్ మార్కెట్ల నుంచి నెగటివ్ సంకేతాలు రావడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. నిఫ్టీ 23,696 (-42), సెన్సెక్స్ 78,271 (-312) వద్ద క్లోజయ్యాయి. FMCG, రియాల్టి, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లు ఎరుపెక్కాయి. మీడియా, మెటల్, PSU బ్యాంకు, O&G షేర్లు ఎగిశాయి. హిందాల్కో, ITC హోటల్స్, ONGC, అపోలో హాస్పిటల్స్, BPCL టాప్ గెయినర్స్.

కొత్త పన్ను విధానంలో ఉన్న ఏకైక మినహాయింపు NPS. సెక్షన్ 80CCD ప్రకారం బేసిక్ శాలరీలో 14% వరకు లబ్ధి పొందొచ్చు. దీనికి ₹75K స్టాండర్డ్ డిడక్షన్ తోడైతే దాదాపుగా ₹14L వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. Ex. CTC ₹13.75L, బేసిక్ ₹7.16L (CTCలో 50%) అనుకుందాం. అందులో NPS ₹1.1L (బేసిక్‌లో 14%), SD ₹75K తీసేస్తే మిగిలేది ₹11.9L. ఇది Taxable Income ₹12.1L కన్నా తక్కువే.
Sorry, no posts matched your criteria.