India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పొగాకు, పాన్ మసాలా నమిలి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం పశ్చిమ బెంగాల్‌లోని ప్రధాన సమస్యల్లో ఒకటి. దీన్ని అడ్డుకునేందుకు ఆ రాష్ట్ర సర్కారు కీలక నిర్ణయాన్ని తీసుకోనుంది. బహిరంగప్రాంతాల్లో ఉమ్మేవారిపై అత్యంత భారీగా జరిమానాలు విధించేలా ఓ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ఇలాంటి చట్టం ఉన్నప్పటికీ భారీ మార్పులు, జరిమానాతో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

TG: గచ్చిబౌలి <<15340404>>కాల్పుల కేసులో<<>> అరెస్టయిన బత్తుల ప్రభాకర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘సరిపోదా శనివారం’లో నాని ఓ రోజు కోపాన్ని ప్రదర్శించినట్లుగా ప్రభాకర్‌కూ ఓ స్టైల్ ఉంది. వారంలో 3రోజులు ప్లానింగ్, గురువారం చోరీ, వీకెండ్‌లో జల్సాలు చేస్తాడు. ₹10L దొరుకుతాయనుకుంటే రంగంలోకి దిగుతాడు. జీవితంలో ₹335Cr కొట్టేయాలని, 100మంది అమ్మాయిలతో గడపాలనేది ఇతని లక్ష్యమని పోలీసుల విచారణలో వెల్లడైంది.

ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నేత ఆగా ఖాన్(88) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్ వర్క్ Xలో వెల్లడించింది. ఆయన వారసుడిని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ఆగా ఖాన్‌కు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. 1957లో ఆయన ఇమామ్‌గా బాధ్యతలు స్వీకరించారు.

భారత్‌లో చిన్న పట్టణాల ప్రజలు లగ్జరీ షాపింగ్‌పై భారీగా వెచ్చిస్తున్నారని టాటా క్లిక్ లగ్జరీ నివేదిక తెలిపింది. ఈ-కామర్స్ విస్తృతి పెరగడంతో మారుమూల పట్టణాల ప్రజలు సైతం ఆన్‌లైన్‌లో ఖరీదైన బ్రాండ్ల ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది. ‘వాచీలు, చెప్పులు, దుస్తులు, యాక్సెసరీస్‌ను ఖర్చుకు వెనుకాడకుండా కొంటున్నారు. ఉత్పత్తిపై పూర్తిగా రిసెర్చ్ చేశాకే కొనుగోలు చేస్తున్నారు’ అని వెల్లడించింది.

నేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్(NRDRM) తెలుగు రాష్ట్రాల్లో 6,881 ఉద్యోగాల చొప్పున పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టెన్త్-పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఆధారంగా అర్హులుగా పేర్కొంది. నేటి నుంచి ఈ నెల 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.399 దరఖాస్తు ఫీజు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అప్లై చేసుకునేందుకు ఇక్కడ <

TG: SC వర్గీకరణకు అసెంబ్లీ, మండలి నిన్న ఆమోదం తెలిపిన నేపథ్యంలో పోటీ పరీక్షలకు ఎస్సీల దరఖాస్తుల్ని ఉపకులాల వారీగా స్వీకరించాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ప్రస్తుతం ఉపకులాలతో సంబంధం లేకుండా SC విద్యార్థులకు సీట్ల కేటాయింపు జరుగుతోంది. కాగా.. ఈ నెల 25 నుంచి EAPCET దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. ఆలోపు వర్గీకరణపై ఆదేశాలు వెలువడితే దరఖాస్తుల్ని ఉపకులాలవారీగా స్వీకరించే అవకాశం ఉంది.

TG: రాష్ట్రంలో మొత్తం 5,810 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు ఈసీ లెక్కల్లో తేలింది. గతంలో 5,857 స్థానాలు ఉండగా ఈ సారి వాటి సంఖ్య తగ్గింది. జీహెచ్ఎంసీ, ఇతర నగరపాలక, పురపాలక సంస్థల్లో కొన్ని గ్రామాలు విలీనమవ్వడమే దీనికి కారణం. మండలానికి కనీసం ఐదు స్థానాలు ఉండేలా అధికారులు జాబితా రూపొందించారు. మరోవైపు రాష్ట్రంలో 32 జడ్పీ, 570 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి.

తెలంగాణలో కులగణన సర్వేలో 1.60 కోట్ల మంది బీసీలు ఉన్నారని తేలింది. వీరిలో 26 లక్షలకు పైగా జనాభాతో ముదిరాజ్‌లు టాప్‌లో ఉన్నారు. ఆ తర్వాత 20 లక్షల జనాభాతో యాదవులు, 16 లక్షల జనాభాతో గౌడ కులస్థులు, ఆ తర్వాత 13.70 లక్షల జనాభాతో మున్నూరు కాపులు ఉన్నట్లు సర్వేలో తేలింది. ఇక 12 లక్షలకు పైగా జనాభాతో పద్మశాలీలు ఉన్నట్లు వెల్లడైంది. మొత్తం బీసీ జనాభాలో ఈ ఐదు కులాలే సగానికి పైగా ఉన్నట్లు తేలింది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఆరింటి వరకూ ఓటింగ్ కొనసాగనుంది. 13,766 పోలింగ్ కేంద్రాల్లో 1.56 కోట్లమంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 3వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో అదనపు భద్రతా బలగాలను ఎన్నికల సంఘం మోహరించింది. ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెలువడనున్నాయి. గత రెండు పర్యాయాలు ఆప్‌ను గెలిపించిన ఢిల్లీ ఓటరు తీర్పు ఈసారి ఎలా ఉండనుందన్నది ఆసక్తికరంగా మారింది.

US అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. గాజా భూభాగాన్ని తాము స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గాజాలో జీవిస్తున్న 20లక్షలమంది పైచిలుకు పాలస్తీనీయులు ఆ భూభాగాన్ని వదిలి ఇరుగు పొరుగు దేశాలకు వెళ్లిపోవాలని తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో భేటీ అనంతరం ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
Sorry, no posts matched your criteria.