India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మెగాస్టార్ చిరంజీవికి ఆయన తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆపత్కాలంలో ఉన్న ఎందరికో ఆయన సహాయం చేశారని కొనియాడారు. కావాల్సిన వారి కోసం ఎంతవరకైనా తగ్గుతారని, ఆ గుణమే చిరంజీవిని సుగుణ సంపన్నుడిగా చేసిందన్నారు. జనసేనకు రూ.5 కోట్లు విరాళమిచ్చి విజయంలో సహకరించిన ఆయన చిరాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు.
కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ డా. సందీప్ ఘోష్ ఆస్పత్రిలో అనాథ శవాలను అమ్ముకొనేవాడని కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ అక్తర్ అలీ ఆరోపించారు. అలాగే బయోమెడికల్ వ్యర్థాలను బంగ్లాదేశ్‌కు రవాణా చేసే నెట్‌వర్క్‌లో భాగం కావడం వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడ్డాడని తెలిపారు. ఆస్పత్రి, కళాశాలకు సంబంధించిన ఏ పని చేయడానికైనా డబ్బులు వసూలు చేసేవాడని అలీ చెప్పారు.
వివిధ అంశాలపై తెలంగాణలో అధికార – విపక్షాలు గురువారం నిరసనలకు దిగనున్నాయి. అదానీ స్టాక్స్ ప్రైస్ మ్యానిప్యులేషన్ ఆరోపణలపై జేపీసీతో విచారణకు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నిరసనలకు పిలుపునిచ్చింది. మరోవైపు తెలంగాణలో 40 శాతం మంది రైతులకు కూడా రుణమాఫీ లబ్ధి జరగలేదని, ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో విపక్ష బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.
AP: అచ్యుతాపురం <<13910421>>ఫార్మా<<>> కంపెనీలో జరిగిన ప్రమాదంలో కాకినాడకు చెందిన చల్లపల్లి హారిక (22) మరణించారు. తాపీ మేస్త్రీగా పని చేసే తండ్రి ఐదేళ్ల క్రితం చనిపోయారు. కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె ఏడాది క్రితం ‘ఎసెన్షియా’లో చేరారు. రాఖీ పండుగకు కాకినాడకు రాగా మరో రెండు రోజులు ఉండాలని సోదరులు కోరినా యాజమాన్యం అనుమతించకపోవడంతో నిన్న ఉదయం వెళ్లారు. మృత్యువు వెంటాడటంతో ప్రమాదంలో ప్రాణాలు వదిలారు.
AP: డిగ్రీ రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. 24 వరకు రిజిస్ట్రేషన్లు, 23-25 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, కోర్సుల ఎంపిక, 26న ఆప్షన్ల సవరణకు అవకాశం ఉంటుంది. 29న సీట్లను కేటాయిస్తారు. విద్యార్థులు ఈ నెల 30 నుంచి SEP 3వ తేదీ లోపు కాలేజీల్లో చేరాలి. రాష్ట్రవ్యాప్తంగా 1,045 డిగ్రీ కళాశాలల్లో 3,33,757 సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో 1,27,659 సీట్లు భర్తీ అయ్యాయి.
కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వివాదాస్పద మాజీ ప్రిన్సిపల్ డా.సందీప్ ఘోష్‌పై బెంగాల్ ప్రభుత్వం వేటువేసింది. నేషనల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పిస్తూ ఆరోగ్య శాఖ ఉత్తర్వులిచ్చింది. డా.ఘోష్‌పై విచారణ జరపకుండా బదిలీ చేయడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. అలాగే RG కర్ కాలేజీ ప్రస్తుత ప్రిన్సిపల్ సుహృత పాల్‌ను కూడా ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించింది.
AP: అచ్యుతాపురంలోని ఫార్మా కంపెనీలో పేలుడుకు 18 మంది చనిపోయారు. ఈ ప్రమాదానికి కారణాలపై ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ‘రియాక్టర్‌లో తయారైన మిథైల్ టెర్ట్-బ్యుటైల్ ఈథర్ మిశ్రమాన్ని ట్యాంకులోకి మార్చుతుండగా లీకై ఆవిరిగా మారింది. ఆ వాయువు వాతావరణంలోని రసాయనాలతో ప్రతిస్పందించడంతో పేలుడు జరిగింది. ఆ లీకేజీ మిశ్రమం ఎలక్ట్రిక్ ప్యానల్‌పై పడటంతో మంటలు చెలరేగాయి’ అని పేర్కొంది.
AP: అచ్యుతాపురంలోని సెజ్‌లో ప్రమాదం జరిగిన ఎసెన్షియా ఫార్మా కంపెనీపై రాంబిల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. BNS 106(1), 125(A), 125(B) సెక్షన్ల కింద కేసు పెట్టారు. నిన్న జరిగిన పేలుడు ఘటనలో 18 మంది మృతి చెందగా, మరో 40 మందికి గాయాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం మృతదేహాలకు పోస్టుమార్టం కొనసాగుతోంది.
TG: అదానీ కుంభకోణంపై జేపీసీ వేయాలని, సెబీ ఛైర్మన్ రాజీనామా చేయాలన్న డిమాండ్లతో కాంగ్రెస్ హైకమాండ్ దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. దీంతో ఇవాళ గన్‌పార్క్ అమరవీరుల స్తూపం నుంచి బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీసు వరకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. ఈ నిరసనలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
TG: ఉత్తర తెలంగాణలో ఎల్లుండి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. ఆ ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. ఈ నెల 24 వరకు ఇవి కొనసాగొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Sorry, no posts matched your criteria.